founds
-
మాటకు కట్టుబడి... జోరుగా సాగుతున్న నాడు నేడు
విజయనగరం పూల్‌బాగ్: జిల్లాలో మనబడి నాడు–నేడు రెండో విడత పనులు చురుగ్గా సాగుతున్నాయి. అనుకున్న సమయానికే పనులు పూర్తిచేసి పాఠశాల అదనపు తరగతి గదులను వినియోగంలోనికి తెచ్చేలా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే జిల్లాలో నాడు–నేడు మొదటి విడతలో రూ.238 కోట్లుతో 1,060 పాఠశాలలను ఎంపిక చేసి పూర్తిచేయడం జరిగింది. ఉన్నత స్థితికి చేర్చే లక్ష్యంతో.. రాష్ట్ర పభుత్వ లక్ష్యం మేరకు జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చే లక్ష్యంతో రెండో విడిత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పాఠశాల తల్లిదండ్రులకు కమిటీలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలతో కూడిన బ్యాంకు అకౌంటులో నాడు–నేడు రివాల్వింగ్ ఫండ్ విడుదల చేస్తున్నారు.ఈ ఫండ్‌తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నాడు–నేడు మొదటి విడతలో పని చేసిన అనుభవం ఉన్న ఎంఈఓ, ఏఈ, హెచ్ఎంలు, పేరెంట్ కమిటీల సభ్యులు, సిఆర్పీలు, ఎమ్మార్సీలో పని చేస్తున్న ఎంఐఎస్, ఎల్డీఏ, మండల లెవెల్ అకౌంటెంట్స్‌తో పాటు మిగిలిన సిబ్బంది, సచివాలయంలో పని చేస్తున్న ఇంజినీరింగ్ సిబ్బందితో రెండో విడత పనులు పూర్తిచేసేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. తొమ్మిది రకాల పనులు.. నాడు–నేడు రెండో విడిత కోసం జిల్లాలో ఉన్న మొత్తం 27 మండలాల్లో 451 పాఠశాలలు ఎంపిక చేశారు. ఈ పనుల కోసం ఏపీఈపీడబ్ల్యూఐడీసీకి 160 పాఠశాలలు, ప్రజారోగ్య డిపార్ట్మెంటుకు 33 పాఠశాలలు, గ్రామీణ నీటి సరఫరా డిపార్ట్మెంట్కు 63 పాఠశాలలు, సమగ్రశిక్షా డిపార్ట్మెంట్కు 195 చొప్పున మొత్తం నాలుగు ఏజెన్సీలకు నిర్మాణ పనుల బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రెండో విడతను జాతీయ నూతన విద్యావిధానం ఆధారంగా చేసుకొని పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందుకోసం కేవలం కంపోనేంట్ పనులు మాత్రమే కాకుండా అదనపు తరగతి గదుల నిర్మాణ పనులతో కూడిన 9 రకాల పనులు జరుగుతున్నాయి. వీటిల్లో అదనపు తరగతి గదులు, అంగన్వాడీ కేంద్రాలకు పూర్తిస్థాయి మరమ్మతులు, ఉన్నత పాఠశాలల్లో 10 కాంపోనెంట్స్ పనులు ఉన్నాయి. నిధుల విడుదల.. 451 పాఠశాలలకు (514 ప్రాజెక్టు పను) రూ.68 కోట్ల 80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. 576 పాఠశాల అదనపు తరగతి గదుల కోసం రూ.69కోట్ల 12 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే 439 పాఠశాలల పేరెంట్స్ కమిటీ ఖాతాలకు రివాల్వింగ్ ఫండ్ జమ అయింది. ఇసుక, సిమెంట్‌కు కొరత లేదు విజయనగరం కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశాల మేరకు ఇసుక కోసం ప్రతి మండలంలో 3 స్టాక్ పాయింట్స్‌ను ఏర్పాటు చేశాం. ఇండెంట్ పెట్టిన పాఠశాలలన్నింటికీ సరఫరా చేస్తున్నాం. ఏ పాఠశాలకు ఎంత మేరకు అవసరం, ఎంత వెళ్తోంది అనే అంశాలను పరిశీలించి రికార్డు నిర్వహించడానికి సీఆర్పీని ఇంచార్జిగా నియమించాం. ఇంతవరకు 2,130 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం ఇండెంట్ పెట్టగా 1,659 మెట్రిక్ టన్నులను సరఫరా చేశాం. – డాక్టర్ వేముల అప్పలస్వామినాయుడు, ఏపీసీ, సమగ్రశిక్ష, విజయనగరం (చదవండి: అందమైన కలలకు రూపం 'నగరవనం') -
రూ.10,095 కోట్లకేంద్ర నిధులు పెండింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి హక్కుగా, గ్రాంట్‌గా కేంద్రం నుంచి రావాల్సిన రూ.10,095 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇవే కాకుండా జీఎస్టీ కింద రూ.6,016 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.2,812 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.817 కోట్లు, ఇంకా మరిన్ని నిధులు రాలేదన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకున్నా, ప్రభుత్వానికి ఆదాయం లేకున్నా గత 5 నెలల్లో రూ.55,638 కోట్లు వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేసినట్టు వెల్లడించారు. శాసనమండలిలో ఆర్థికశాఖకు సంబంధించిన మూడు బిల్లులపై వేర్వేరు సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఆయన ఆయా అంశాలు ప్రస్తావించారు. షరతులు ఒప్పుకోం.. తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్లుపై హరీశ్ మాట్లాడుతూ అప్పు కోసం కేంద్రం విధించే షరతులకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. ‘మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నాం. గోడౌన్లు కట్టుకుని, ఉచిత కరెంటు అందించి రైతును సంపన్న వర్గాలుగా మార్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఇలాంటి సమయంలో కేంద్రం రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా షరతులు పెట్టింది. వీటిని అమలు చేసేది లేదు. వ్యవసాయ పంపుసెట్లు వాడే చోట మీటర్లు పెట్టాలని అప్పుడే అప్పు ఇస్తామని మెలిక పెట్టింది. ఇలాంటివి సరికాదని ప్రధానికి, ఆర్థిక మంత్రికి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఎఫ్ఆర్బీఎం పెంపునకు కేంద్రం అనుమతిచ్చినా.. రాష్ట్రానికి నష్టం జరిగే షరతులకు తలొగ్గేది లేదని సీఎం చెప్పారు. అప్పులను చూసే ముందు.. రాష్ట్ర అప్పులు, ఆదాయాన్ని కలిపి చూడాలి. మన రాష్ట్ర జీఎస్డీపీ పెరుగుదల 2014కు ముందు రూ.4 లక్షల 52 వేల కోట్లయితే ఈనాడు రూ.11 లక్షల 5 వేల 349 కోట్లు. ప్రస్తుత సవరణ ద్వారా వివిధ కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇస్తుంది. గతంలో కార్పొరేషన్లకు రాష్ట్ర ఆదాయంలో 90 శాతం వరకు గ్యారంటీ ఇచ్చే అవకాశముంది. దాన్ని 200 శాతానికి పెంచడం జరుగుతుంది. కరోనా కంటే ముందు మన దేశ జీడీపీ క్రమేపీ గత 8 క్వార్టర్లు తగ్గుతూ వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో మైనస్ 24 శాతానికి తగ్గింది. ఈ పరిస్థితుల్లోనూ మన రాష్ట్రం మాత్రం డబుల్ డిజిట్ ఉంది. ఫెర్టిలైజర్స్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి రూ.లక్షా 85 వేల కోట్లు తెస్తే ఆ డబ్బు రాయితీల కోసం ఖర్చు చేశారు. కాళేశ్వరం మీద డబ్బులు ఖర్చు చేయడం ద్వారా లక్ష కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చయింది’అని మంత్రి వ్యాఖ్యానించారు. -
జాయింట్ చెక్ పవర్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: చెక్ పవర్‌పై సందిగ్ధం వీడింది. గ్రామ సర్పంచ్‌కు, ఉప సర్పంచ్‌కు కలిపి జాయింట్ చెక్ పవర్ అధికారాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇక గ్రామస్థాయిలో పంచాయతీ పాలన వేగవంతం కానుంది. ఇప్పటి వరకు ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూసిన సర్పంచ్‌లకు ప్రభుత్వం తీపి కబురు అందించినట్లయింది. జిల్లాలో 584 గ్రామ పంచాయతీలు ఉండగా ఏన్కూరు మండలం నూకాలంపాడు సర్పంచ్ మినహా 583 పంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఈ అధికారం దక్కింది. సుమారు ఐదు నెలలుగా ఎదురుచూస్తున్న వీరికి ఈ అవకాశం లభించడంతో ఆనందంగా ఉన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి జాయింట్ చెక్‌పవర్ అమలులోకి రానుంది. పంచాయతీల్లో నిధులు ఉన్నప్పటికీ చెక్ పవర్ లేకపోవడంతో పనులు ముందుకు సాగని పరిస్థితి ఇప్పటివరకూ నెలకొంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పంచాయతీ పాలకులతో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు. ఏన్కూరు మండలంలో నూకాలంపాడుకు సర్పంచ్ లేకపోవడంతో ఉప సర్పంచ్, కార్యదర్శికి చెక్ పవర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి నిరీక్షణ.. జిల్లాలో జనవరి నెలలో మూడు విడతలుగా ఎన్నికలు జరగ్గా ఫిబ్రవరి 2వ తేదీన పాలకవర్గం ఏర్పడి సర్పంచ్, ఉప సర్పంచ్‌లు బాధ్యతలు స్వీకరించారు. అయితే..అప్పటి నుంచి తమకు చెక్ పవర్ లేకపోవడంతో క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను చేపట్టలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చెక్‌పవర్ వస్తే త్వరగా గ్రామాభివృద్ధిపై, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించవచ్చనే ఆలోచనలో సర్పంచ్, ఉప సర్పంచ్‌లు ఉన్నారు. గతంలో ఇలా... గతంలో సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఉమ్మడిగా చెక్ పవర్ ఉండేది. సర్పంచ్, కార్యదర్శి ఇరువురు ఉప సర్పంచ్‌కు, గ్రామ ప్రజలకు తెలియకుండా తమకు నచ్చిన పనులు చేసేవారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక ఉప సర్పంచ్‌కు ఎలాంటి అధికారాలు లేకుండా నామమాత్రంగా పేరుకే అన్న చందంగా నాటి పరిస్థితి తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చి సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు సంయుక్తంగా చెక్‌పవర్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. తాజాగా ప్రభుత్వం అమలు చేయబోతున్న జాయింట్ చెక్ పవర్‌తో ఉపసర్పంచ్ పదవికి విలువ పెరగబోతోంది. నిధులున్నా..వెనుకంజ జిల్లాలో 14వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్ కింద పలు గ్రామ పంచాయతీల్లో నిధులు ఉన్నప్పటికీ చెక్‌పవర్ లేకపోవడంతో పనులు చేసేందుకు గ్రామ పంచాయతీలు వెనుకంజ వేశాయి. ఈ నెల 17వ తేదీ నుంచి జాయింట్ చెక్ పవర్ అమల్లోకి రానున్నట్లు ప్రకటించడంతో ఎంపీడీఓలు వారి పేర్లు, సంతకాలను సేకరించడంతో పాటు ఎస్టీఓ, డీటీఓ కార్యాలయాలకు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తయితేనే చెక్ పవర్ విధానం అమలవనుంది. శుభ పరిణామం.. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్‌ను ఇవ్వడం శుభ పరిణామం. ఇరువురికి చెక్‌పవర్ ఉండడం వల్ల అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉప సర్పంచ్‌లకు మరింత గుర్తింపు లభించినట్లయింది. –నున్నా వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్, రేగులచలక, రఘునాథపాలెం మండలం -
నిధుల కేటాయింపులో పెద్దపీట
కరీంనగర్: నిధుల కేటాయింపు విషయంలో అన్ని జిల్లాల కంటే కరీంనగర్ జిల్లాకు పెద్దపీట వేస్తానని రాష్ట్రపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రం చట్టం వల్ల నిధులు, అధికారాలు కోల్పోవడంతో స్థానిక సంస్థలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. తిరిగి అన్యాయం జరుగకుండా ఉండేందుకు నిధులు, అధికారాలను బదలాయించడంతోపాటు అవినీతి రహిత పాలన కోసం చట్టాలను ఉల్లంఘించే సర్పంచులు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై కూడా చర్య తీసుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్ చట్టసవరణకు పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నారని చెప్పారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే చట్ట సవరణ చేసి కొత్త చట్టాలను అమలులోకి తేస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసమే సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది తప్పా మరే ఉద్దేశం లేదని, సర్పంచ్‌లకు చెక్‌పవర్ లేక ఇబ్బందులు జరుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ఒకవేళ చట్టసవరణకు ముందు చెక్‌పవర్ ఇస్తే వాటిలో ఏమైనా తేడా వస్తే కోర్టును ఆశ్రయించే అవకాశాలుంటాయని, పకడ్బందీతో చట్టసవరణ చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ చట్టసవరణ ద్వారా సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, జెడ్పీ చైర్పర్సన్లకు అధికారాలను బదలాయించడంతోపాటు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరుగుతుందని చెప్పారు. గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ, ఉపాధి హమీ పథకం వంటి వాటిలో కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయబోతున్నామని అన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా అందంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామ కార్యదర్శులను నియమించామని, ఏ గ్రామంలో కూడా బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వివరాలను తెలుసుకొని సీఎం కేసీఆర్‌ను అభినందిస్తున్నారని అన్నారు. వారం రోజుల్లో గ్రామీణ ఉపాధి హమీ బిల్లులు ఇస్తామని, ఇందుకోసం ఇటీవలనే కేంద్ర మంత్రిని కలువడం జరిగిందని మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఇంటికి కనీసం 6 మొక్కలు చొప్పున నాటి వాటిని బతికించుకోవాలని, ఊర్లలోని గుట్టలపై విరివిగా పండ్ల మొక్కలను పెంచాలని, దీంతో కోతుల బెడద కూడా తప్పుతుందని, వర్షాలు బాగా పడి మంచి రోజులు వస్తాయని, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులను కోరారు. గతంలో రైతులకు ఇచ్చిన హరితహారం విజయవంతమైందని, రోడ్ల పక్కన అధికారులు నాటిని మొక్కలు ఎండిపోయాయని, ఈసారి అలా జరుగకుండా విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. పండ్లు, పూల మొక్కలు నాటేందుకు, నీరు పోసేందుకు ఎన్ని డబ్బులైనా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ జిజ్జుగా ఉన్నారని, ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో లోపాలున్నాయని ఇందుకు అధికారులందరూ బాధ్యులు కాదని, కొంతమంది కక్కుర్తి పడి తప్పులు చేస్తున్నారని చెప్పారు. అవినీతి రహిత పాలన, ఒక్కరూపాయి లేకుండా రైతులందరికీ పాసుబుక్కులు, రైతుబంధు పథకాన్ని అమలు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారని అన్నారు. త్వరలోనే ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు డబ్బులు ఇప్పిస్తామని, జూలై 1న ఆసరా పింఛన్లను రెట్టింపు చేసి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు వాటిని పంపిణి చేసే కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. వైద్య రంగంలో నెంబర్‌వన్ స్థానంలో నిలుపుదాం ఆర్థిక శాఖ మంత్రిగా జిల్లాకు అధిక నిధులు కేటాయించిన మాట వాస్తవమేనని, ఇల్లు చక్కబెట్టి సమాజం గుర్తించి ఆలోచించాలనే ఉద్దేశంతో జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఇచ్చిన హమీ మేరకు ఒక్కో మండలానికి రూ.20 లక్షలు, రూ.30 లక్షల చొప్పున అదనంగా జిల్లాకు నిధులు మంజూరు చేశామని అన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా జిల్లాను వైద్య రంగంలో రాష్ట్రంలోనే నెంబర్‌వన్ స్థానంలో నిలుపుతామని అన్నారు. రాజకీయ నాయకులకు పదవీ విరమణ ఉండదని, పదవిలో ఉన్నప్పుడు చేసిన పనులు గౌరవాన్ని నిలబెడుతాయని అన్నారు. స్థానిక సంస్థల పెండింగ్ బిల్లులు ఇప్పిస్తానని, అర్ధంతరంగా మిగిలిన పనులను పూర్తిచేయిస్తానని హామీ ఇచ్చారు. పదవిలో ఉన్నా లేకున్నా మీ గౌరవానికి భంగం కలిగించకుండా వ్యవహరిస్తానని జెడ్పీటీసీ, ఎంపీపీలకు భరోసా ఇచ్చారు.– రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలిసికట్టుగా కృషి చేశాం జిల్లా పరిషత్, మండల పరిషత్ సభ్యులుగా జిల్లా అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ జెడ్పీ గౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు మేమంతా అన్నదమ్ముల్లా, అక్కాచెల్లెల్లుగా, కుటుంబ సభ్యులుగా పార్టీలకతీతంగా కలిసికట్టుగా కృషి చేశామని, ఐదేళ్లు చాలా దగ్గరగా ఉన్నామని జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి ఈటల రాజేందర్ చేదోడు, వాదోడుగా ఉంటూ సంపూర్ణ సహకారాన్ని అందించారని ధన్యవాదాలు తెలిపారు. అధికారులు, సభ్యుల సహకారాన్ని మరిచిపోబోమని, అందరి సహకారంతో ఐదేళ్లు పదవిలో కొనసాగామని అన్నారు. రాష్ట్రంలోనే మొదటి జెడ్పీగా నిలబెట్టేందుకు నిధులు కేటాయించాలని మంత్రి దయాకర్‌రావును కోరారు. – జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ -
శిల్పారామం..ఇక కొత్త రూపం!
జిల్లాలో కడపతోపాటు పులివెందులలో శిల్పారామాలు ఉన్నాయి. రోజువారి జీవితంలో అలసిన వారికి ఈ ఆరామాలు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వీటిని ఏర్పాటు చేసి పదేళ్లు కావస్తోంది. చిన్నచిన్న మార్పులు మినహా మారుతున్న కాలానికి అనుగుణంగా పెద్దగా మార్పులేవీ జరగలేదు. ఇటీవల సందర్శకులు నూతనత్వం కొరవడిందని పెదవి విరుస్తున్నారు. ఒక దశలో శిల్పారామాల నిర్వహణ ప్రభుత్వానికి బరువుగా మారింది. ప్రతి ఆదివారం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా స్థానికంగా స్పాన్సర్లను వెతుక్కోవలసి వచ్చింది. దీంతో ఆదాయం తగ్గింది. ప్రభుత్వం దీన్ని గమనించి కొత్త అందాలతో శిల్పారామాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది. రాష్ట్ర శిల్పారామాల స్పెషలాఫీసర్ బి.జయరాజ్ కడప శిల్పారామంలో చేపట్టాల్సిన మార్పులను పరిశీలించేందుకు కడప నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కడప కల్చరల్ : కడప, పులివెందుల శిల్పారామాలలో జనం సందడి తగ్గినట్లు కనిపిస్తోంది. కారణం? ఆదాయం తగ్గలేదుగానీ పెరగని మాట నిజమే. ఆశించిన మేరకు ఆర్థికంగా అభివృద్ధి కనిపించడం లేదు. మీ దృష్టికి వచ్చిన లోపాలు ఏమిటి? నివారణకు తీసుకుంటున్న చర్యలేమిటి? కడప శిల్పారామం నగరం నుంచి దూరమని పలువురు ప్రజలు భావిస్తున్నారు. ఎస్టేట్ తర్వాత మూడు, నాలుగు కిలోమీటర్ల వరకు నిర్మానుష్యంగా ఉంటుంది. కానీ ఇటీవల నగరం వైపు నుంచి రైల్వేట్రాక్ వరకు, శిల్పారామం నుంచి పెట్రోలు బంకు వరకు అక్కడక్కడా భవనాలు వెలిశాయి. జనం సందడి పెరుగుతోంది. శిల్పారామాల పూర్తిస్థాయి అభివృద్ధికి చేపట్టనున్న చర్యలేమిటి? వీటిని పూర్తిగా ఆధునికీకరిస్తాం. స్థానికతను కోల్పోకుండా ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ సందర్శకులకు మెరుగైన వసతులు కల్పిస్తాం. వారు ఉల్లాసంగా గడిపేందుకు శిల్పారామానికి కొత్త లుక్ వచ్చేలా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏమేం మార్పులు చేపడతారు? ముఖ్యంగా వినోదానికి, ఉల్లాసంగా గడపడానికి అనుగుణంగా మార్పులు చేస్తాం. కొన్ని సాంకేతిక కారణాలతో గ్రీనరీ (పచ్చిక) లేకుండా పోయింది. కడప శిల్పారామంలో ఓ భాగాన్ని పూర్తిగా పచ్చికతో నింపుతాం. ప్రస్తుతం షాపింగ్ స్టాల్స్ దూరంగా విసిరేసినట్లు ఉన్నాయి. వాటిని ఎదురెదురుగా దగ్గరలో ఉండేటట్లు మారుస్తాం. తరుచూ హస్తకళా రూపాల ప్రదర్శన, విక్రయాలు ఏర్పాటు చేస్తాం. నైపుణ్యం గల కళాకారులకు స్టాల్స్‌ను ఉచితంగా ఇస్తాం. సందర్శకుల కోసం పాత్‌వేలను అభివృద్ధి చేస్తాం. సౌకర్యవంతంగా సేద తీరేందుకు పలుచోట్ల బెంచీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ప్రత్యేకించి వినోదం కోసం ఏం చేస్తున్నారు? కడప శిల్పారామానికి పడమర వైపునగల చెరువును నీటితో నింపి బోటింగ్, వాటర్‌గేమ్స్ నిర్వహించాలని ఆలోచిస్తున్నాం. 56 ఎకరాల చెరువులో 40 ఎకరాల్లో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించేందుకు అనుకూలంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం! ఆధునీకరణ అన్నారు...వివరాలు చెప్పగలరా..? ఆధునీకరణ కోసం అంతర్జాతీయ అనుభవం గల ఇద్దరు యువ అర్కిటెక్చర్లకు ఈ పని అప్పగించాం. వారు ప్రత్యేకించి కడప శిల్పారామాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించనున్నారు. ఇప్పటికే ఇక్కడ పర్యటించి సందర్శకుల అభిప్రాయాలు సేకరించారు. ఆ ప్రణాళిక అమలైతే కడప శిల్పారామానికి కొత్త లుక్ వస్తుందని చెప్పగలను. సందర్శకులను ఆకట్టుకునేందుకు సీమ రుచులు లాగా స్థానిక వంటకాలు, ఆహార పదార్థాలు, అల్పాహారం అందించేందుకు ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయని భావిస్తున్నారు? ఈనెలాఖరుకు మాస్టర్ ప్లాన్‌ను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తాం. కార్యాలయ పరమైన అనుమతులు అనంతరం సీఎం ఆమోదంతో వెంటనే పనులు చేపడతాం. జూలై నాటికి దశలవారీగా అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయగలమన్న విశ్వాసం ఉంది. ఈ పనులను ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యాల సమ్మేళనంతో 40–60 శాతం పద్ధతిలో చేపడుతాం. రాష్ట్రంలో శిల్పారామాల పరిస్థితి ఎలా ఉంది? పులివెందుల శిల్పారామాన్ని ఆధునీకరించి ఆర్థికంగా మెరుగైన స్థితికి చేర్చేందుకు అంచనాలు రూపొందిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది శిల్పారామాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. ప్రస్తుతం కడపతోపాటు తిరుపతి, విశాఖ, అనంతపురం, పుట్టపర్తిలలో శిల్పారామాలు ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు, కాకినాడ, విజయనగరంలలో పనులు సాగుతున్నాయి. 21న కర్నూలులో శిల్పారామానికి శంకుస్థాపన నిర్వహించనున్నాం. -
అభివృద్ధికి నిధులు కేటాయించాలి
నల్లగొండ టూటౌన్ : పట్టణంలోని 13వ వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి కోరారు. 13వ వార్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వార్డు సమస్యల పరిష్కారం కోసం మంగళవారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన 108 గంటల ధర్నాకు ఆయన మద్ధతు తెలిపి మాట్లాడారు. స్లమ్ ఏరియాలో ఉన్న వార్డుకు అధిక నిధులు కేటాయించాలని, వార్డులోని అన్ని కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అభివృద్ధి చెందిన వార్డులకు, అభివృద్ధి చెందని వార్డులకు నిధులు సమానంగా కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. వార్డులోని అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా ఎఫ్‌సీఐ రోడ్డు, శ్మశానవాటికకు నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సయ్యద్ హాశం, దండెంపల్లి సత్తయ్య, నర్సిరెడ్డి, కృష్ణారెడ్డి, అద్దంకి నర్సింహ, బోడ ఇస్తారి, పోలె సత్యనారాయణ, వార్డు కౌన్సిలర్ ఎండి.సలీం, ఆళ్ల బసవయ్య, గాదె నర్సింహ, పాక లింగయ్య, నోముల యాదయ్య, శంకర్ పాల్గొన్నారు. -
నిధులొచ్చాయి.. నొక్కేయడమే తరువాయి..
ఎత్తిపోతల పధకాల నిర్మాణం పేరిట నిధుల దోపిడి కాంట్రాక్టర్లు, అధికారుల ఇష్టారాజ్యం నూతన నిర్మాణం కన్నా మరమ్మత్తులకే అధిక కేటాయింపులు కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం ఐటిడిఎ డిఆర్డిఏ సంయుక్త నిధులు గంగలో పోసిన పన్నీరే వృధాగా ప్రవహించే కొండ వాగుల నీటిని మెట్టభూముల వైపు మళ్లిద్దామనే లక్ష్యంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు కాంట్రాక్టర్లు,అధికారులకు కల్పతరువులుగా మారాయి. కోట్లు వ్యయం చేసినా ఒక్క ఎకరం భూమికి నీరివ్వలేకపోగా అధికారులు కాంట్రాక్టర్లు మాత్రం జేబులు నింపుకొంటున్నారు. 1992 నుంచి మొదలైన ఈ దోపిడీ కథ మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నీటిపారుదల రంగానికి నిధులు విడుదల చేయడంతో ఏఓపీఎస్ఐడీసీ) అధికారులు ‘రంగం’లోకి దిగి పనులు ‘చక్కబెడుతున్నారు’. అడ్డతీగల మండలం వీరవరం వద్ద 1995 కాలంలో నిర్మించిన ఎత్తిపోతల పథకానికి మళ్లీ మరమ్మతులు మొదలుపెట్టారు. – అడ్డతీగల రూ.26.68 లక్షలు ఏమైనట్టో..! గతంలో 20 మంది రైతులకు చెందిన 50 ఎకరాలకు నీరిస్తామని చెప్పి రూ.25.25 లక్షల అంచనాతో పనులు మొదలుపెట్టి పూర్తిచేసే నాటికి రూ.26.68 లక్షలు ఖర్చయినట్టు పేర్కొన్నారు. ఇందులో 75 శాతం ఐటీyీ ఏ, 25 శాతం డీఆర్డీఏ విడుదల చేసింది. కానీ నిర్మాణం పూర్తి అయినా కనీసం ఒక్క పంటకు కూడా చుక్కనీరు ఇవ్వలేని స్థితిలో ఆ పథకం మూలనపడింది. 1995లో ఓమారు ఈపధకాన్ని పరిశీలించిన అధికారులు. ఇ¯ŒSటెక్ వెల్ పాడవ్వడంతో పాటు నీటిని అందించే సంప్ వద్ద మరమ్మత్తులు చెయ్యాలని అప్పట్లోనే చెప్పారు. వీటి పంపుసెట్, సర్వీస్లై¯ŒSలు,ప్యూజ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం విద్యుత్ సరఫరా అవసరని ఐటిడిఏ అధికారులకు వివరించి ఇప్పటికి ఆరు సార్లు మరమ్మతులు చేశారు కానీ ప్రయోజనం శూన్యం. ఇప్పుడు తాజాగా రూ.55 లక్షల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. ఆ ఎత్తిపోతల పథకం వద్ద పాత పైప్‌లై¯ŒS అలా ఉండగానే కొత్త పైప్‌లై¯ŒS పనులను చురుగ్గా చేసేస్తున్నారు. ప«థకం నిర్మాణం కన్నా మరమ్మతులకు రెండింతలు నిధులు కేటాయించేటట్లు చక్రంతిప్పిన అధికారులు నీటిని తోడే మోటార్లను వెలికితీసి బయట పడేయడం గమనార్హం. నిధుల విడుదలంతా గోప్యం.. రంపచోడవరం డివిజ¯ŒSలో 800 ఎకరాలు సాగులోనికి తీసుకురావడానికి 27 చోట్ల ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. అడ్డతీగల మండలంలోని 1992–96 కాలంలో పింజిరికొండ, పణుకురాతిపాలెం, రావిగూడెం, పైడిపుట్ట, ఉప్పలపాడు, మట్లపాడు, చాకిరేవుల, సరంపేట, వీరవరం, ధాన్యంపాలెం గ్రామాల్లో ఆయా కొండ వాగుల చెంతనే రూ.1.5 కోట్ల అంచనాలతో రూ.1.3 కోట్లు వ్యయం చేసి పథకాలు నిర్మించారు. గంగవరం మండలంలో మోహనాపురం, శరభవరం, నూగుమామిడి, కరకపాడు వంటిచోట్ల రూ.27.64 లక్షలు అంచనాలతో రూ.25.328 లక్షలు వ్యయంచేసి ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. ఏ పనులు చేపట్టినా రాజమండ్రి నుంచి వీలున్నప్పుడల్లా ఏఈ వచ్చి జరుగుతున్న పనులను చూసివెళ్తుండడంలో పర్యవేక్షణలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరిన్ని చోట్ల ఆయా పథకాల వద్ద మరమ్మతులు చేపట్టడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కాగా వీరవరం ఎత్తిపోతల పథకం వద్ద మరమ్మతుల మాయాజాలంపై సంబంధిత ఏఈ మూర్తి వివరణ కోరడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. ఏవిధమైన సమాచారం ఇవ్వడం లేదు వీరవరం ఎత్తిపోతల పథకం పనులు ఇటీవలే చేపట్టారు. పాత పైప్‌లై¯ŒS ఉండగానే కొత్త పైప్‌లై¯ŒS వేస్తున్నారు. అసలు ఏమేరకు నిధులు విడుదల అయ్యాయి, ఏం పనులు చేస్తారు అని అడిగినా ఇంజినీరింగ్ అధికారులు కనీసం సమాధానం కూడా చెప్పడం లేదు. గతంలో ఇలాగే పలుమార్లు తూతూమాత్రపు పనులు చేపట్టి వెళ్లిపోయారు. నిధుల ఖర్చు చూపుతున్నారు తప్పించి ప్రయోజనం లేదు. – జనుమూరి నాగేశ్వర్రావు, వీరవరం సర్పంచ్ ఎన్నోసార్లు పనులు చేశారు నీరు రాలేదు నాకు 3 ఎకరాల భూమి ఉంది. ఎత్తిపోతల పథకం పనిచేస్తే నీరొస్తొందని చాలాకాలం నుంచి చూస్తున్నాను. ఇప్పటికీ ఎన్నోసార్లు పనులు చేశారు. నీరు మాత్రం రాలేదు. నీరొస్తుందని ఆశ కూడా లేదు. ఇప్పుడు మళ్లీ పనులు చేస్తున్నారు. ఏమవుతుందో చూడాలి. – జర్తా హరిచంద్రారెడ్డి, వీరవరం రైతు పనులు చేస్తున్నారు నీరొస్తుందని అనుకుంటున్నాం ఎత్తిపోతల పథకం వద్ద పనులు చేస్తున్నారు. కొత్త పైప్‌లై¯ŒS వేస్తున్నారు. పథకం నిర్మించినప్పటి నుంచి పంటలకు నీరు రాలేదు. దీంతో వర్షాధారంతోనే 2 ఎకరాల భూమి సాగు చేసుకుంటున్నాను. రైతులు ఈ పథకం గురించి ఆశక్తి చూపడం లేదు. – చెదలలక్ష్మయ్య రైతు,వీరవరం -
‘పచ్చ’ చొక్కాలకే అభివృద్ధి పరిమితం
కడియం : ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు పచ్చచొక్కాలు వేసుకున్న వారికే పరిమితమయ్యాయని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ నాయకుడు కందుల దుర్గేష్ అన్నారు. పార్టీలో చేరిన తరువాత తొలిసారిగా శుక్రవారం కడియం వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా టీడీపీ అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు 750 హామీలను ఇచ్చారని, కానీ అందులో పూర్తిస్థాయిలో అమలైన హామీ ఒక్కటి కూడా లేదన్నారు. ప్రచార ఆర్భాటం తప్పితే ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం లేదన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్న విశాల దృక్ఫథంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పనిచేసేవారన్నారు. ఆయన స్ఫూర్తిని జగ¯ŒS కొనసాగిస్తారన్న విశ్వాçÜం ఉందన్నారు.అందుకే వైఎస్సార్ సీపీలో చేరానని స్పష్టం చేశారు. సమావేశంలో డీసీఎంఎస్ డైరెక్టర్ వెలుగుబంటి అచ్యుతరామ్, గట్టి నర్సయ్య, సాపిరెడ్డి సూరిబాబు, తోరాటి శ్రీను, చిక్కాల బాబులు, ముద్రగడ జెమి, బోణం సతీష్ పాల్గొన్నారు. -
మార్చిలోగా బహిరంగ మలవిసర్జనరహిత జిల్లాలు
అవసరమైతే నిర్మాణాలకు ఆర్థిక సాయం చేయండి స్వచ్ఛభారత్ మిషన్‌సెక్రటరీ పరమేశ్వర్‌నాయర్ ముకరంపుర: స్వచ్ఛభారత్ మిషన్ పథకం కింద ఎంపికైన జిల్లాల్లో మార్చిలోగా వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి బహిరంగ మలవిసర్జనరహిత జిల్లాలుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛభారత్ మిషన్(గ్రామీణ) సెక్రటరీ పరమేశ్వరన్ నాయర్ అన్నారు. ఢిల్లీ నుంచి మొదటివిడతలో ఎంపికైన కలెక్టర్లతో ఐఎస్ఎల్ ప్రగతిపై వీడియో కాన్ఫరెన్స్ బుధవారం ద్వారా సమీక్షించారు. నెలవారీగా లక్ష్యాన్ని నిర్ణయించుకుని గడువులోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణాలకు నిధుల కొరత లేదన్నారు. నిర్మాణాలు పూర్తయిన వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే బిల్లులు చెల్లిస్తారని తెలిపారు. గ్రామీణ ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. అవసరమైన వారికి ఆర్థికసాయం అందించి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. స్వశక్తిసంఘ మహిళలు, వాలంటీర్లను నియమించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎక్కువ నిధులు విడుదల చేయండి.. జిల్లాలో 6,75,802 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 5,57,020 నిర్మించామని, మిగిలినవాటిని వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. ప్రతీ నెలా 17వేల చొప్పున ఐఎస్ఎల్లు నిర్మించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నామని చెప్పారు. జిల్లాలో 13 నియోజకవర్గాలుండగా.. అక్టోబర్ 2వరకు కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూర్, రామగుండం నియోజకవర్గాలను బహిరంగ మలవిసర్జనరహిత నియోజకవర్గాలుగా ప్రకటించనున్నామని తెలిపారు. మొదటి విడత జిల్లాలకు ఎక్కువ నిధులు విడుదల చేయాలని కోరారు. జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ ప్రకాశ్‌రావు, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ తదితరులున్నారు. -
నిర్లక్ష్యానికి మూల్యం నీటి కష్టాలు
లక్షల వ్యయంతో ట్యాంకుల నిర్మాణం నాణ్యతాలోపంతో అందని చుక్క నీరు అధికారుల పర్యవేక్షణ లోపం గుత్తేదారుల ఇష్టారాజ్యం బజార్హత్నూర్: మండలంలోని ప్రజల తాగునీటి కష్టాలు చిత్రంగా ఉన్నాయి. తాగునీటి సమస్యను పరిష్కరించుటకు కోట్ల రూపాయాల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ నిధులతో గ్రామాలలో వాటర్‌ట్యాంకులు నిర్మాణాలు చేపట్టారు. కానీ స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో ఆయా గ్రామాల ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పడం లేదు. వాస్తవ పరిస్థితులు ఇవే... ప్రభుత్వం మండలంలో రాంనగర్, బలాన్పూర్, కొత్తపల్లి, కొత్తగూడ, మాన్కాపూర్, తూకాన్పల్లి, జల్లుగూడ, కిన్నర్పల్లి గ్రామాలలో ఒక్కొక్క వాటర్‌ట్యాంక్ నిర్మాణానికి రూ.11లక్షల నిధులు కేటాయించింది. 2014 సంవత్సరంలో ఆయా గ్రామాలలోని వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. నాటి నుంచి నేటి వరకు వాటి నిర్వహణ గాలి వొదిలేయడంతో ఎనిమిది గ్రామాల ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. నిర్మాణం పూరై ్తయిన వాటర్‌ట్యాంకులను స్థానిక గ్రామ పంచాయితీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అవి అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. ఇదే విషయంపై సర్పంచులను సంప్రదిస్తే బోరుబావుల్లో నీరులేదని, పైపులైన్ లీకేజీ ఉందని, కరెంటు సరఫరా లేదని ఒక్కొక్కరూ ఒక్కొక్క కారణం తెలుపుతున్నారు. నిర్మాణ లోపమే కారణమా.. వాటర్ ట్యాంకుల నిర్మాణం పూరై ్త రెండు సంవత్సరాలు గడిచినా నేటికీ చుక్క నీరు అందడం లేదు. అధికారులను సంప్రదిస్తే వాటర్‌ట్యాంకుల నిర్మించిన గుత్తేదారులకు బిల్లులు మంజూరు కాలేదని గుత్తేదారులు వాటర్‌ట్యాంకులను గ్రామపంచాయతీలకు అప్పగించలేదని తెలిపారు. మరో కోణంలో చూస్తే వాటర్‌ట్యాంకుల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని అన్ని కూడా లీకేజీల సమస్యతో సతమతమవుతున్నందునే బిల్లులు మంజూరు కాలేదని తెలుస్తోంది. ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్రామీణుల నీటికష్టాలు అధికమవుతున్నాయి. ఏదిఏమైనప్పటికీ సాధ్యమైనంత త్వరగా వాటర్‌ట్యాంకులకు నీటి కనెక్షన్ ఇచ్చి తమ తాగునీటి కొరత తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే పొలం బావుల నుంచి నీటిని తీసుకొస్తున్నామని ఆయా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నిధులు ఫ్రీజ్.. పనులకు బ్రేక్
ఫీజింగ్‌తో ముందుకు సాగాని అభివృద్ధి పనులు కుంటుపడుతున్న పంచాయతీల అభివృద్ధి మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేని వైనం ఇబ్బందుల్లో సర్పంచ్‌లు ఆదిలాబాద్ రూరల్ : గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులపై రాష్ట్ర ప్రభుత్వం పదే..పదే ఫ్రీజింగ్ విధించడంతో నిధులు విత్డ్రాల్ కాక, గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టకలేక పోతున్నామని సర్పంచ్‌లు వాపోతున్నారు. సర్వసాధారణంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంటే గతంలో ఫ్రీజింగ్ ఉండేదని, ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేకున్నా పదే..పదే ఫ్రీజింగ్ విధించడంతో గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు కొనసాగడం లేదని వారు వివరిస్తున్నారు. ఎప్పుడు ఫ్రీజింగ్ ఉంటుందో..ఎప్పుడు ఎత్తి వేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది వివరిస్తున్నారు. దీంతో గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయే ప్రమాదం నెలకొందని పలువురు సర్పంచ్‌లు వాపోతున్నారు. ఫ్రీజింగ్‌తో అభివృద్ధి కుంటుపడుతోంది... తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన్నప్పటి నుంచి వందల సార్లు ఫ్రీజింగ్లు విధించడంతో తాము గ్రామాలలో అభివది«్ధ పనులు చేపట్టలేక పోతున్నామని వాపోతున్నారు. అసలే వర్షాకాలం గ్రామాల్లో మురికి కాలువల శుభ్రం, విధి దీపాల ఏర్పాటు, బ్లీచింగ్ పౌడర్ వంటి వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది వివరిస్తున్నారు. కొన్ని నెలల తర్వాత ఫ్రీజింగ్‌ను ఎత్తివేస్తున్న ప్రభుత్వం కేవలం రెండు రోజుల పాటు వివిధ లావాదేవీలు కొనసాగించడానికి మాత్రమే అవకాశం కల్పిస్తోందని సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. నిధులు విత్డ్రాల్ కాకపోవడంతో గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సకాలంలో పరిష్కరించక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల నిర్వహించిన ఆదిలాబాద్ మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న దృష్టికి ఫ్రీజింగ్ సమస్యను సర్పంచ్‌లు తీసుకెళ్లారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా ఫ్రీజింగ్ ఎత్తి వేసి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని సర్పంచ్‌లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
మిషన్ కాకతీయకు ‘గ్రీన్ క్లైమేట్’ నిధులు
గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుంచి రూ. వెయ్యి కోట్లు గ్రాంట్, రూ. వెయ్యికోట్లు రుణం మరో రూ. 2 వేల కోట్లు ఇచ్చేందుకు నాబార్డు సుముఖం నాబార్డు అధికారులతో సీఎస్ రాజీవ్‌శర్మ సమీక్ష సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పనులకు ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన గ్రీన్ క్లైమేట్ ఫండ్ (జీసీఎఫ్) నుంచి రూ. రెండు వేల కోట్లు ఆర్థిక సాయం అందనుంది. అందులో రూ. వెయ్యి కోట్లు గ్రాంటుగా, మరో రూ. వెయ్యి కోట్లు రుణంగా సమకూరనుంది. దీంతోపాటు జీసీఎఫ్‌కు దేశంలో నోడల్ ఏజెన్సీగా ఉన్న నాబార్డు సైతం మిషన్ కాకతీయకు మరో రూ.2వేల కోట్లు ఇవ్వనుంది. ఈ మేరకు నాబార్డు ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. పర్యావరణ హిత ప్రాజెక్టు..: అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యావరణ సమతుల్యతను కాపాడే, కర్బన ఉద్గారాలను తగ్గించే కార్యక్రమాలకు చేయూతనివ్వడానికి ఐక్యరాజ్యసమితి 100 బిలియన్ డాలర్లతో జీసీఎఫ్ను ఏర్పాటు చేసింది. మన దేశంలో అలాంటి కార్యక్రమాలను గుర్తించి నిధుల కోసం ప్రతిపాదించేందుకు జీసీఎఫ్‌కు నాబార్డు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. చెరువులను పునరుద్ధరించే ‘మిషన్ కాకతీయ’ కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించే కార్యక్రమంగా ఇప్పటికే గుర్తింపు పొందిన నేపథ్యంలో... దీనికి ఆర్థిక సాయం చేసేందుకు జీసీఎఫ్ ముందుకు వచ్చింది. నాబార్డు ప్రతినిధులు దీనిపై ఇప్పటికే నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావుతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. తాజాగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో సమావేశమయ్యారు. ఇక్రిశాట్ ప్రతినిధులతో పాటు శాఖ ముఖ్య కార్యదర్శి జోషి, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు ఇందులో పాల్గొన్నారు. చెరువుల పునరుద్ధరణ, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను అనుసరించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం తదితర అంశాలతో డీపీఆర్‌ను తయారు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ‘మిషన్ కాకతీయ’ ప్రాజెక్టుకు రూ.12వేల కోట్లు అవసరమని అంచనా వేయగా... రాష్ట్ర ప్రభుత్వం రూ.8వేల కోట్లు సమకూరుస్తుందని రాజీవ్‌శర్మ హామీ ఇచ్చారు. మిగతా నిధుల్లో జీసీఎఫ్ రూ.2వేల కోట్లు, నాబార్డు మరో రూ.2వేల కోట్లు సమకూర్చుతాయని హామీ ఇచ్చాయి. ఇక వీటితోపాటు హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని చెరువులను పునరుద్ధరించి, వాటిని మంచినీటి సరస్సులుగా మార్చడం, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పరిసరాలను శుభ్రపర్చడం, వంటింటి చెత్తను ఉపయోగించి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసి హాస్టళ్లకు సరఫరా చేయడం తదితర ప్రాజెక్టులను సైతం జీసీఎఫ్ కింద చేర్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. -
నీళ్లు నిధులూ వృధా...