నిధులు ఫ్రీజ్.. పనులకు బ్రేక్
-
ఫీజింగ్‌తో ముందుకు సాగాని అభివృద్ధి పనులు
-
కుంటుపడుతున్న పంచాయతీల అభివృద్ధి
-
మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేని వైనం
-
ఇబ్బందుల్లో సర్పంచ్‌లు
ఆదిలాబాద్ రూరల్ : గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులపై రాష్ట్ర ప్రభుత్వం పదే..పదే ఫ్రీజింగ్ విధించడంతో నిధులు విత్‌డ్రాల్ కాక, గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టకలేక పోతున్నామని సర్పంచ్‌లు వాపోతున్నారు. సర్వసాధారణంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంటే గతంలో ఫ్రీజింగ్ ఉండేదని, ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేకున్నా పదే..పదే ఫ్రీజింగ్ విధించడంతో గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు కొనసాగడం లేదని వారు వివరిస్తున్నారు. ఎప్పుడు ఫ్రీజింగ్ ఉంటుందో..ఎప్పుడు ఎత్తి వేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది వివరిస్తున్నారు. దీంతో గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయే ప్రమాదం నెలకొందని పలువురు సర్పంచ్‌లు వాపోతున్నారు.
ఫ్రీజింగ్‌తో అభివృద్ధి కుంటుపడుతోంది...
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన్నప్పటి నుంచి వందల సార్లు ఫ్రీజింగ్‌లు విధించడంతో తాము గ్రామాలలో అభివది«్ధ పనులు చేపట్టలేక పోతున్నామని వాపోతున్నారు. అసలే వర్షాకాలం గ్రామాల్లో మురికి కాలువల శుభ్రం, విధి దీపాల ఏర్పాటు, బ్లీచింగ్ పౌడర్ వంటి వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది వివరిస్తున్నారు. కొన్ని నెలల తర్వాత ఫ్రీజింగ్‌ను ఎత్తివేస్తున్న ప్రభుత్వం కేవలం రెండు రోజుల పాటు వివిధ లావాదేవీలు కొనసాగించడానికి మాత్రమే అవకాశం కల్పిస్తోందని సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు.
నిధులు విత్‌డ్రాల్ కాకపోవడంతో గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సకాలంలో పరిష్కరించక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల నిర్వహించిన ఆదిలాబాద్ మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న దృష్టికి ఫ్రీజింగ్ సమస్యను సర్పంచ్‌లు తీసుకెళ్లారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా ఫ్రీజింగ్ ఎత్తి వేసి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని సర్పంచ్‌లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.