సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడాలంటే చాలా కష్టం. ఎన్నో కష్టాలు తట్టుకోవాలి. ఈ క్రమంలోనే మనసుకు నచ్చకపోయినా సరే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. 'పంచాయత్' వెబ్ సిరీస్‌తో బోలెడంత ఫేమ్ సొంతం చేసుకున్న దుర్గేశ్ కుమార్‌ది కూడా ఇలాంటి కథే. నటుడిగా నిలదొక్కుకునే క్రమంలోనే అడల్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించానని ఇప్పుడు ఓపెన్ అయిపోయాడు.
(ఇదీ చదవండి: తండ్రయిన స్టార్ హీరో.. మహాలక్ష‍్మి పుట్టిందని వీడియో పోస్ట్)
బిహార్‌కి చెందిన దుర్గేశ్ కుమార్.. 2001లో ఇంజినీరింగ్ చేయడం కోసం దిల్లీ వెళ్లాడు. కానీ ఎగ్జామ్ కష్టంగా ఉండేసరికి.. నటనవైపు షిఫ్ట్ అయ్యాడు. ఓవైపు నాటకాల్లో నటిస్తూనే డిగ్రీ పూర్తి చేశాడు. 'నేషనల్ డ్రామా స్కూల్'లో యాక్టింగ్ కోర్సు చేశాడు. ఆ తర్వాత 'హైవే' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'సుల్తాన్', 'ఫ్రీకీ అలీ' లాంటి చిత్రాల్లో నటించాడు కానీ ఇబ్బందులు తప్పలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో డబ్బుల కోసం అడల్ట్ మూవీస్ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదంతా చెప్పుకొచ్చాడు.
'యాక్టింగ్ చేయకపోతే నేను బతకలేదు. దీంతో నాకొచ్చిన ప్రతిదీ చేసుకుంటూ పోయాను. అలానే కొన్ని అడల్ట్ మూవీస్‌లోనూ చేయాల్సి వచ్చింది. 2016లో నేను ముంబయికి వచ్చాను. కొందరు ఫ్రెండ్స్ అయ్యారు. మేమందరం ఎలాగైనా సరే ఇండస్ట్రీలోకి నిలబడాలనుకున్నాం. కానీ ఛాన్సుల కోసం ప్రతి క్యాస్టింగ్ డైరెక్టర్‌కి దగ్గరకెళ్లి, వాళ్ల కాళ్ల మీద పడ్డాం. ఇదంతా కూడా 'హైవే', 'ఫ్రీకీ అలీ', 'సుల్తాన్' లాంటి సినిమాల్లో నేను నటించిన తర్వాతే జరిగింది. కొన్ని చిత్రాల్లో యాక్ట్ చేసిన తర్వాత కూడా ఆడిషన్స్‌కి వెళ్లాలంటే ఏదోలా ఉంటుంది. అలా పంచాయత్ మొదటి సీజన్‌లో చిన్న రోల్ చేశాను. రెండున్నర గంటల్లో దీని షూట్ చేశారు' అని దుర్గేశ్ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)
Comments
Please login to add a commentAdd a comment