బాలీవుడ్ నటుడు దుర్గేశ్ కుమార్ కొత్త ఇల్లు కొన్నాడు. ముంబైలో ఇదే ఆయన కొనుగోలు చేసిన తొలి నివాసం. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ముంబైలో మా కొత్తిల్లు.. ఆ భగవంతుడికి కృతజ్ఞతలు అని రాసుకొచ్చాడు. తన ఇంటి తాళాల ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా నటుడిగా కొనసాగుతున్న ఈయన ఎట్టకేలకు ముంబైలో తనకంటూ ఇల్లు కొనుగోలు చేయడంతో అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇల్లు తీసుకున్నావ్.. మమ్మల్ని పిలవనేలేదు అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా దుర్గేశ్ కుమార్.. 2014లో వచ్చిన హైవే సినిమాతో కెరీర్ ప్రారంభించాడు. సుల్తాన్, ద డ్రీమ్ జాబ్, సంజు, ధడక్, బొంబైరియా, భక్షక్, లాపతా లేడీస్ వంటి చిత్రాలతో అలరించాడు. పంచాయత్ వెబ్ సిరీస్‌లో భూషణ్ పాత్ర ద్వారా ఓటీటీ ప్రియులను మెప్పించాడు.
Comments
Please login to add a commentAdd a comment