
ఘోర రోడ్డు ప్రమాదం. ఈ ఘటనలో దాదాపు 10 మంది దుర్మరణం చెందారు. ఇందులో ప్రముఖ నటి అంచల్ తివారీ కూడా ఉంది. మంగవారం అంతా కూడా ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. దీంతో చాలామంది నటి అంచల్‌కి నివాళులు అర్పించారు. పాపం చిన్న వయసులోనే చనిపోయిందని బాధపడ్డారు. కానీ ఈమె చనిపోలేదని, చిన్న పొరపాటు వల్ల మరణ వార్తలు వైరల్ అయ్యాయని అంటున్నారు. ఇంతకీ అసలేం జరిగింది?
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా)
మధ్యప్రదేశ్‌కి చెందిన అంచల్ తివారీ.. నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన 'పంచాయత్' అనే వెబ్ సిరీస్‌లో ఓ పాత్రలో నటించి కాస్తంత పేరు తెచ్చుకుంది. సరే ఈ విషయం పక్కనబెడితే తాజాగా బిహార్‌లోని కైమూర్ జిల్లాలో ఆదివారం ఓ రోడ్డు ప్రమాదం జరగ్గా.. ఇందులో పదిమంది వరకు చనిపోయారు. అయితే ఇందులో ఓ భోజ్‌పురి నటి ఉందనే తెగ మాట్లాడుకున్నారు.
అయితే ఈ ప్రమాదంలో అంచల్ తివారీ అనే అమ్మాయి ఉన్న మాట వాస్తవమే కానీ ఆమె, నటి అంచల్ తివారీ వేర్వేరు అనే విషయం తేలింది. నటి అంచల్ స్వయంగా తన ఇన్ స్టాలో 'నేను బతికే ఉన్నాను' అని అర్థమొచ్చేలా ఉన్న ఓ పోస్ట్ పెట్టడంతో ఈ విషయమై క్లారిటీ వచ్చేసింది. ఒకే పేరుతో ఉన్న ఇద్దరు వ్యక్తుల వల్ల ఇంతలా పొరపాటు జరిగిందనమాట.
(ఇదీ చదవండి:కాబోయే భర్త విజయ్ దేవరకొండలా? రష్మిక ట్వీట్ వైరల్)
Comments
Please login to add a commentAdd a comment