హైదరాబాద్: సాక్షి తెలుగు విద్యార్థుల మేలు కోసం మరో అడుగు ముందుకేసింది. ఆన్‌లైన్ పరీక్షలకు ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను రూపొందించింది. ఇప్పటికే భవిత, విద్య, చుక్కాని, సిటీప్లస్, సాక్షి బుక్‌లెట్స్ ద్వారా లక్షల మంది అభిమానాన్ని చూరగొన్న సాక్షి.. విద్యార్థులు అతి తక్కువ ఖర్చుతో సులువుగా సాధన చేసుకునేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా సివిల్స్, ఎస్‌ఎస్‌సీ, బ్యాంక్స్, గ్రూప్స్, డీఎస్సీ, వీఆర్‌వో, రైల్వే, ఆర్మీ, పోలీస్, ఎంసెట్, జేఈఈ, ఐసెట్ వంటి దాదాపు 100కు పైగా పోటీ, అర్హత పరీక్షలకు ఆన్‌లైన్ గ్రాండ్ టెస్ట్స్, లైవ్ టెస్ట్స్ అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్స్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వంటి పరీక్షలకు వందల సంఖ్యలో టెస్ట్‌లను అందిస్తోంది.
వెబ్‌సైట్ ప్రత్యేకతలు:
అన్ని ప్రశ్నలకు సాధనలు, వివరణలతో కూడిన గ్రాండ్ టెస్ట్‌లు, లైవ్ టెస్ట్‌లు ఠి 24/7 ఎప్పుడైనా, ఎన్ని సార్లైనా పరీక్ష రాసుకునే సౌలభ్యం ఠి పరీక్ష ముగిసిన వెంటనే గ్రేడులతో కూడిన ఫలితాలు ఠి అభ్యర్థి ప్రదర్శనను తెలిపే రిపోర్టుతో పాటు సబ్జెక్టుల వారీ వీక్ అండ్ స్ట్రాంగ్ ఏరియా అనాలసిస్
వెబ్‌సైట్: http://onlinetests.sakshieducation.com
ఆన్‌లైన్ పరీక్షలకు సాక్షి ప్రత్యేక వెబ్ పోర్టల్
Published Sat, Oct 11 2014 3:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM
Advertisement
Advertisement