Online tests
-
విద్యార్థుల భవిష్యత్‌తో సర్కారు చెలగాటం!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికత వినియోగం పేరుతో ఉన్నత విద్యామండలి ‘నిధులకు’ టెండర్ పెట్టింది. పేద విద్యార్థులు కట్టిన ఫీజులను ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో ఆన్లైన్ పరీక్షల విధానాన్ని తీసుకొచ్చే నెపంతో.. రూ.కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రచిస్తూ విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటున్న ఈ విధానంలో విద్యార్థులెవ్వరూ ఆన్లైన్లో పరీక్షలు రాయరు. కేవలం విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను మాత్రమే కంప్యూటర్లో చూస్తూ మార్కులు వేయాల్సి ఉంటుంది. అంటే జవాబు పత్రాలను స్కానింగ్ చేసి పంపిస్తే.. వాటిని మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా ఉన్నత విద్యా మండలి టెండర్లు పిలిచింది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ‘మార్కులు’..విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళితే వాటి పారదర్శకత ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. పైగా అధ్యాపకులు కూడా కంప్యూటర్‌పై చూస్తూ మూల్యాంకనం చేసి మార్కులను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో మాన్యువల్‌గా నమోదు చేయాలి. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండటం వల్ల మార్కులను ట్యాంపరింగ్ చేసినా.. గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది. పరీక్షల ప్రశ్నపత్రాల ముద్రణలోనూ సాంకేతికత పేరుతో విద్యార్థుల భవిష్యత్‌తో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నపత్రాన్ని ఆన్లైన్లో యూనివర్సిటీలకు, కాలేజీలకు పంపించి.. పరీక్షకు కొన్ని క్షణాల ముందు వాటిని ప్రింట్ తీసుకొని ఇచ్చేలా ఆలోచనలు చేస్తోంది.ఒకవేళ పరీక్ష సమయానికి ప్రింటింగ్‌లో సమస్యలు తలెత్తితే విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. అలాగే ప్రశ్నపత్రాలు లీకయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.పైలట్ ప్రాజెక్టు ఎందుకు నిర్వహించలేదు?రాష్ట్రంలోని 19 యూనివర్సిటీల పరిధిలో 10 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరికీ వేర్వేరు యూనివర్సిటీలు పరీక్షలు నిర్వహిస్తుంటాయి. ఇలాంటి తరుణంలో ఒకే సంస్థ ఆన్లైన్లో పరీక్షల మూల్యాంకనం చేపట్టడం ఎంత వరకు విజయవంతం అవుతుందనే అనుమానాన్ని విద్యావేత్తలు లేవనెత్తుతున్నారు. కనీసం పైలెట్ ప్రాజెక్టు కింద ఏదైనా యూనివర్సిటీ పరిధిలో అయినా నిర్వహించాలనే ఆలోచన ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టును కొందరు ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు తమ స్వలాభం కోసమే చేపడుతున్నట్టుగా కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. -
4న జేఈఈ మెయిన్ ఆఫ్‌లైన్ పరీక్ష
10, 11 తేదీల్లో ఆన్లైన్ పరీక్షలు అరగంట ముందుగా పరీక్షకు అనుమతి సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక జాతీయ ఇంజనీరింగ్ విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్-2015 పరీక్ష టైం టేబుల్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) జారీ చేసింది. వచ్చే నెల 4న ఆఫ్‌లైన్, 10, 11 తేదీ ల్లో ఆన్లైన్ ద్వారా నిర్వహించే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పలు సూచనలు చేసింది. ఆఫ్‌లైన్ పరీక్షకు విద్యార్థులను అరగంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని తెలిపింది. ఉదయం 9:30 గంటలకు బీఈ/బీటెక్ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష పేపర్-1 ప్రారంభమవుతున్నందున విద్యార్థులను అరగంట ముందుగానే(9 గంటలకు) పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్/బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష పేపర్-2 ప్రారంభమవుతుందని, దీనికి అరగంట ముందుగానే (మధ్యాహ్నం 1:30 గంటలకు) పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని వెల్లడించింది. నిర్ణీత పరీక్ష సమయం తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. తెలంగాణ నుంచి దాదాపు లక్ష మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 10, 11 తేదీల్లో జరిగే ఆన్లైన్ పరీక్ష ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అవుతుందని, విద్యార్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని తెలిపింది. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఏర్పాటు చేసే పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్ రాత పరీక్షతోపాటు ఆన్లైన్ పరీక్షలు ఉంటాయి. కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండలో ఆన్లైన్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కంచికచర్ల, కర్నూలు, నరసారావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఆన్లైన్ కేంద్రాలు, గుంటూరు, తిరుపతిలో ఆఫ్‌లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
ఆన్లైన్ పరీక్షలకు సాక్షి ప్రత్యేక వెబ్ పోర్టల్
విద్యార్థులు, ఉద్యోగార్థులకు నిరంతరం మార్గదర్శినిగా నిలుస్తున్న సాక్షి తెలుగు విద్యార్థుల మేలు కోసం మరో అడుగు ముందుకేసి ఆన్లైన్ పరీక్షలకు ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను రూపొందించింది. ఇప్పటికే భవిత, విద్య, చుక్కాని, సిటీప్లస్, www.sakshieducation.com, సాక్షి బుక్లెట్స్ ద్వారా లక్షల మంది అభిమానాన్ని చూరగొన్న సాక్షి.. విద్యార్థులు అతి తక్కువ ఖర్చుతో సులువుగా సాధన చేసుకునేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా సివిల్స్, ఎస్ఎస్సీ, బ్యాంక్స్, గ్రూప్స్, డీఎస్సీ, వీఆర్వో, రైల్వే, ఆర్మీ, పోలీస్, ఎంసెట్, జేఈఈ, ఐసెట్ వంటి దాదాపు 100కు పైగా పోటీ, అర్హత పరీక్షలకు ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్స్, లైవ్ టెస్ట్స్ అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్స్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వంటి పరీక్షలకు వందల సంఖ్యలో టెస్ట్‌లను అందిస్తోంది. వెబ్సైట్ ప్రత్యేకతలు: అన్ని ప్రశ్నలకు సాధనలు, వివరణలతో కూడిన గ్రాండ్ టెస్ట్‌లు, లైవ్ టెస్ట్‌లు 24/7 ఎప్పుడైనా, ఎన్ని సార్లైనా పరీక్ష రాసుకునే సౌలభ్యం ఠి పరీక్ష ముగిసిన వెంటనే గ్రేడులతో కూడిన ఫలితాలు అభ్యర్థి ప్రదర్శనను తెలిపే రిపోర్టుతోపాటు సబ్జెక్టుల వారీ వీక్ అండ్ స్ట్రాంగ్ ఏరియా అనాలసిస్ వెబ్సైట్: http://onlinetests.sakshieducation.com -
ఆన్లైన్ పరీక్షలకు సాక్షి ప్రత్యేక వెబ్ పోర్టల్
హైదరాబాద్: సాక్షి తెలుగు విద్యార్థుల మేలు కోసం మరో అడుగు ముందుకేసింది. ఆన్లైన్ పరీక్షలకు ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను రూపొందించింది. ఇప్పటికే భవిత, విద్య, చుక్కాని, సిటీప్లస్, సాక్షి బుక్లెట్స్ ద్వారా లక్షల మంది అభిమానాన్ని చూరగొన్న సాక్షి.. విద్యార్థులు అతి తక్కువ ఖర్చుతో సులువుగా సాధన చేసుకునేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా సివిల్స్, ఎస్ఎస్సీ, బ్యాంక్స్, గ్రూప్స్, డీఎస్సీ, వీఆర్వో, రైల్వే, ఆర్మీ, పోలీస్, ఎంసెట్, జేఈఈ, ఐసెట్ వంటి దాదాపు 100కు పైగా పోటీ, అర్హత పరీక్షలకు ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్స్, లైవ్ టెస్ట్స్ అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్స్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వంటి పరీక్షలకు వందల సంఖ్యలో టెస్ట్‌లను అందిస్తోంది. వెబ్సైట్ ప్రత్యేకతలు: అన్ని ప్రశ్నలకు సాధనలు, వివరణలతో కూడిన గ్రాండ్ టెస్ట్‌లు, లైవ్ టెస్ట్‌లు ఠి 24/7 ఎప్పుడైనా, ఎన్ని సార్లైనా పరీక్ష రాసుకునే సౌలభ్యం ఠి పరీక్ష ముగిసిన వెంటనే గ్రేడులతో కూడిన ఫలితాలు ఠి అభ్యర్థి ప్రదర్శనను తెలిపే రిపోర్టుతో పాటు సబ్జెక్టుల వారీ వీక్ అండ్ స్ట్రాంగ్ ఏరియా అనాలసిస్ వెబ్సైట్: http://onlinetests.sakshieducation.com