స్టార్టప్ ల కోసం ప్రభుత్వ వెబ్ పోర్టల్
న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటు అందించడంతో పాటు వ్యాపార నిర్వహణకు పరిస్థితులను మెరుగుపర్చే దిశగా కేంద్రం స్టార్టప్‌ల కోసం ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఇందులో స్టార్టప్‌లు నమోదు చేసుకునే ప్రక్రియను మరో వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కార్యదర్శి రమేశ్ అభిషేక్ తెలిపారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమం కింద ప్రభుత్వం ప్రకటించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. 2016-17 బడ్జెట్‌లో చిన్న సంస్థల తోడ్పాటు కోసం మూడేళ్ల పాటు 100 శాతం పన్ను మినహాయింపులు తదితర చర్యలను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.