
ఆదాయపు పన్ను ఫైల్ బేస్ వాటా పెరుగుదలలో మూడో స్థానంలో ఏపీ
ఐటీఆర్ ఫైల్ చేసే మహిళల సంఖ్యలోనూ వృద్ధి
2023–24 అసెస్‌మెంట్ ఏడాది ఐటీఆర్‌లపై ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక
ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు పెరిగారని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఆదాయపు పన్ను ఫైల్ బేస్ వాటా పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచిందని తెలిపింది. ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో నిలవగా.. బిహార్, ఏపీ, రాజస్థాన్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది.

2023–24 అసెస్‌మెంట్ ఏడాది ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్)లపై ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదికను సోమవారం విడుదల చేసింది. 2023–24 అసెస్‌మెంట్ ఏడాదిలో వ్యక్తిగత ఐటీఆర్ ఫైల్ చేసిన వారిలో మహిళలు 15 శాతం ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. మహిళలు వ్యక్తిగత ఐటీఆర్ ఫైల్ చేసిన టాప్ రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment