షేర్ ఇట్ యూజర్లకు గుడ్ న్యూస్
బెంగళూరు: స్మార్ట్‌ఫోన్ యూజర్లందరికీ ఫెవరేట్ మెసేజింగ్ యాప్ 'షేర్ ఇట్' ఢిల్లీలో పాగా వేయనుంది. చైనా ఆధారిత ఈ కంటెంట్ షేరింగ్ ప్లాట్ ఫాంభారతదేశంలో మొట్టమొదటి కార్యాలయం తెరవడానికి సన్నాహాలు చేస్తోంది. గ్లోబల్ విస్తరణ ప్రణాళికలో భాగంగా గుర్గావ్లో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు షేర్ ఇట్ వెల్లడించింది. భారత్ నుంచి తమకు యూజర్ల డిమాండ్ భారీగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని బెంగళూరులో షేర్ ఇట్ నిర్వహించిన తొలి క్యాంపస్ మీట్ లో తెలిపింది. ఈ కేంద్రం ద్వారా త్వరలో తమ కార్యాకలాపాలను నిర్వహిస్తామని తెలిపింది. ముఖ్యంగా ఉపఖండం నుంచి వస్తున్న డిమాండ్ కారణంగా ప్రపంచ విస్తరణలో భాగంగా భారత మార్కెట్ ముఖ్యమైనదిగా భావించామని షేర్ ఇట్ మార్కెటింగ్ డైరెక్టర్ జియో లీ డ్యూ ఒక ప్రకటనలో తెలిపారు. తద్వారా తమ యూజర్లకు మరిన్న మెరుగైన సేవలను అందించనున్నట్టు చెప్పారు.
కాగా ఫోటోలు, మూవీ వీడియోలు, మ్యూజిక్, కాంటాక్ట్స్ సహా ఇతర ఫైల్స్ , కొన్ని యాప్స్ ను ట్రాన్స్ఫర్ చేసుకోడానికి ఉపయోగించే ముఖ్యమైన ఫైల్ ట్రాన్స్‌ఫర్ యాప్ షేర్ ఇట్. రోజుకు సుమారు 150 మిలియన్లకు పైగా ఫైళ్లు దీని ద్వారా షేర్ అవుతాయి.