నాన్‌ ఆపరేటివ్‌ ఖాతా నంబర్లు వెంటనే ఇవ్వాలి | none operative account numbers immidiatly open | Sakshi

నాన్‌ ఆపరేటివ్‌ ఖాతా నంబర్లు వెంటనే ఇవ్వాలి

Published Wed, Aug 3 2016 12:19 AM | Last Updated on Wed, Apr 3 2019 8:09 PM

జిల్లాలోని 54 మండలాల్లోని ఈఎస్‌ఎస్‌ లబ్ధిదారుల నాన్‌ ఆపరేటివ్, లోన్‌ అకౌంట్‌ నంబర్లను ఐటీడీఏకు వెంటనే ఇవ్వాలని పీఓ అమయ్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ 2015– 16 ఆర్థిక సంవత్సరంలో 1,789 యూనిట్లను గిరిజన సంక్షేమశాఖ మంజూరు చేసిందన్నారు.

ఏటూరునాగారం : జిల్లాలోని 54 మండలాల్లోని ఈఎస్‌ఎస్‌ లబ్ధిదారుల నాన్‌ ఆపరేటివ్, లోన్‌ అకౌంట్‌ నంబర్లను ఐటీడీఏకు వెంటనే ఇవ్వాలని పీఓ అమయ్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ 2015– 16 ఆర్థిక సంవత్సరంలో 1,789 యూనిట్లను గిరిజన సంక్షేమశాఖ మంజూరు చేసిందన్నారు. ఇందుకుగాను రూ. 13.39 కోట్ల నిధులను ఆయా యూనిట్లకు కేటాయించిందన్నారు. ఇప్పటి వరకు 122 యూనిట్లకు రూ. 1.47 కోట్ల రుణాలను లబ్ధిదారులకు అందాయన్నా రు. మిగతా లబ్ధిదారులకు అకౌంట్‌ నంబర్లను ఎంపీడీఓల ద్వారా ఐటీడీఏకు రాకపోవడంతో యూనిట్లు గ్రౌండ్‌ కావడం లేదని తెలిపారు. ఎంపీడీఓలు ఎంపికయినా లబ్ధిదారుల ఖాతా నంబర్లను త్వరగా ఇవ్వాలని సూచించారు. 
గ్రౌండ్‌ మేళాకు సిద్ధం కావాలి
జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో లబ్ధిదారులకు యూనిట్లను నేరుగా ఇచ్చేందుకు గ్రౌండ్‌ మేళా కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధం గా ఉండాలన్నారు. ఈఎస్‌ఎస్‌లో మంజూరైన లబ్ధిదారుల జాబితాలను ఆయా గ్రామ పంచాయతీల్లో అతికించాలన్నారు. ఆ తర్వాత మేళా లో లబ్ధిదారుడికి నేరుగా యూనిట్‌ను ఇవ్వాలని అన్నారు.. 
కమిటీ ఏర్పాటు
ఎంపీడీఓ, బ్యాంక్‌ మేనేజర్, వెంటర్నరీ అసిస్టెంట్, సర్జన్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఈఈ, ఏఈ, మండల సమాఖ్య అధ్యక్షురాలు, స్పెషల్‌ ఆఫీసర్‌ సమక్షంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో లబ్ధిదారులకు ఈఎస్‌ఎస్‌ యూనిట్లను నేరుగా అందజేయాలన్నారు. ఇలా చేయడం వల్ల లబ్ధిదారుడిని సరైన న్యాయం జరుగుతుందని వివరించారు. ఆయా ఎంపీడీఓలకు ఇప్పటికే సర్క్యూలర్‌ను జారీ చేశామన్నారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం చేయడం సరికాదని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement