అనంతపురం సప్తగిరి సర్కిల్ :
ఎక్సైజ్ శాఖ జిల్లా స్థాయి క్రీడలు శనివారం ఎస్కేయూ క్రీడా మైదానంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లాలోని ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న వారికి షార్ట్‌పుట్, వాలీబాల్, 100, 200, 400, 800 రిలే, కబడ్డీ, త్రోబాల్, చెస్ క్యారమ్స్, షటిల్, బ్యాడ్మింటన్, టగ్ ఆఫ్ వార్, హైజంప్, లాంగ్ జంప్ పోటీలను మహిళలకు, పురుషులకు నిర్వహించారు. వీటితోపాటు 5 కిలోమీటర్ల సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీలు రెండు రోజులపాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి, రెండవ స్థానాల్లో నిలిచిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు.
= అనంతపురం ఎక్సైజ్, పెనుకొండ ఎక్సైజ్ డివిజన్ జట్ల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన పెనుకొండ జట్టు 10 ఓవర్లలో 77 పరుగులు సాధించింది. అనంతరం అనంతపురం జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 49 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.
క్రీడలు స్ఫూర్తి నింపుతాయి
ఉద్యోగులలో స్ఫూర్తిని నింపేందుకు క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని డిప్యూటి కమిషనర్ అనసూయదేవి అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో ఉన్న తమ శాఖ ఉద్యోగులకు ఈ క్రీడలు ఆరోగ్యదాయకమన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఇలా క్రీడలు నిర్వహించడం మొదటిసారన్నారు. తమ ఉద్యోగులు రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభ కనబరచి పతకాలు సా«ధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిల్‌కుమార్‌రెడ్డి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు మల్లారెడ్డి, మునిస్వామి, రాష్ట్ర ఎక్సైజ్ ఉద్యోగుల అసోసియేష¯ŒS అధ్యక్షుడు నరసింహులు, రాముడు, బాలాజినాయక్ తదితరులు పాల్గొన్నారు.
మొదటి రోజు విజేతలు
100 మీటర్లలో పురుషుల్లో నాగరాజు, చరణ్‌కుమార్.., మహిâýæల్లో ప్రభావతి, శాంతకుమారి వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. 200 మీటర్లలో మహిâýæలు శివకుమారి, శాంతకుమారి.., 400 మీటర్లలో మహిళలు ప్రభావతి, శివకుమారి మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. 400 మీటర్లలో పురుషులు చరణ్‌కుమార్, భరత్‌కుమార్.., 800 మీటర్ల పురుషులు మోహ¯ŒS, అనిల్‌కుమార్ వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు.
= లాంగ్ జంప్‌లో పురుషులు మోహ¯ŒS, చరణ్‌కుమార్.., మహిâýæలు నాగవేణి, ప్రభావతి.., హై జంప్‌లో పురుషులు మోహ¯ŒS, భరత్ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు.
= షార్ట్‌పుట్‌లో మహిâýæలు శివకుమారి, రాధమ్మ, పోలక్క, జ్యోతి, ప్రభావతి.., పురుషులు నాగరాజు, మోహన్, సుధాకర్‌రెడ్డి, శివానందరెడ్డి, క్రిష్ణయ్య వరుస స్థానాలు సాధించారు.
= కబడ్డీలో నరసనాయుడు, మధుసూదన నాయుడు, అబ్దుల్ జిలాన్, భీమేష్, కిరణ్‌కుమార్, పురుషోత్తం, లక్ష్మీనారాయణ, మోహ¯ŒS, నాగరాజు.., వాలీబాల్‌లో మధుసూదన నాయుడు, రాముడు, నరసనాయుడు, గురునాథరెడ్డి, శ్రీనివాసులు, నరసింహరాజు, గౌస్‌ఖాన్, అబ్దుల్ జిలాన్, జాన్ పాల్ మోహన్, నాగరాజు విజయం సాధించారు.