
టీటీడీ నమూనా ఆలయం ప్రారంభం
విజయవాడ: కృష్ణా పుష్కరాలకు విచ్చేసే భక్తుల కోసం విజయవాడ స్వరాజ్ మైదానంలో టీటీడీ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం ఈ ఆలయాన్ని ప్రారంభించి పవిత్ర కృష్ణా జలాలతో సంప్రోక్షణ జరిపి అనంతరం శాస్త్రాక్తంగా స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. పుష్కరాలు ముగిసేవరకు స్వరాజ్ మైదానంలో నమూనా ఆలయం భక్తులకు అందుబాటులో ఉంటుంది. రోజు లక్షమంది దర్శనం చేసుకుంనేందుకు వీలుగా ఆలయ నిర్మాణం చేపట్టినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నమూనా ఆలయంలో స్వామివారిని తొలుత కంచి పీఠాధిపతి జయేంద్రసరస్వతి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోకి జర్నలీస్టులను అనుమతించకపోవడంతో జర్నలీస్టులు ధర్నాకు దిగారు.