
లక్నో: గ్రేటర్ నోయిడాలోని జేవార్‌లో ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జేవార్ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు హాజరయ్యారు. విమానాశ్రయ నిర్మాణం 1,330 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతోంది. దీన్ని 2024 నాటికి పూర్తి చేయనున్నారు.
ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయితే, ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద విమానాశ్రయం అవుతుంది. దీంతో దేశంలోనే 70 కిలోమీటర్ల పరిధిలో మూడు విమానాశ్రయాలను కలిగి ఉన్న తొలి నగరంగా ఢిల్లీ అవతరించనుంది. వీటిలో రెండు అంతర్జాతీయంగా ఉంటాయి. కాగా వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలలో విమానాశ్రయం ఒకటి.
Comments
Please login to add a commentAdd a comment