
గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా
గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
న్యూఢిల్లీ: గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గన్నవరం విమానాశ్రయం నుంచి ఇక విదేశీ విమానాలు రాక, పోకలు సాగించటానికి అనువైనదిగా మారనున్నది. గన్నవరం విమానాశ్రాయనికి అంతర్జాతీయ హోదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఏపీ అభివృద్ధికి అంతర్జాతీయ హోదా ఉపకరిస్తోందని ఆయన ట్విట్ చేశారు.
As per the decision of the Cabinet, Vijayawada, the land of victory, joins the club of international airports in India.
— PMO India (@PMOIndia) 3 May 2017