పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో శంషాబాద్‌లోనిఅంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో శంషాబాద్‌లోనిఅంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సోమవారం పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఆర్వోబీ గేటు వద్ద పోలీసులు ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికుల లగేజీలను కూడా తనిఖీ చేసి ముందుకు పంపుతున్నారు. విమానాశ్రయంలో దేశీయ, అంతర్జాతీయ టెర్మినళ్ల వద్ద సీఐఎస్‌ఎఫ్ బలగాలు జాగిలాలతో పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు.