శ్రీకాళహస్తి: టీడీపీ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నీరుగార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గుర్తించారని, నెల రోజుల్లోనే ఆయన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు అన్నారు. రుణాలు మాఫీ చేస్తే రిజర్వు బ్యాం కుకు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడతానని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
పట్టణంలోని ఆర్‌ఆర్‌బీ కల్యాణ మండపంలో ఆదివారం ఆయన శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల సర్పంచ్‌లతో సమావేశమయ్యారు. ఎంపీ మాట్లాడుతూ పనిచేస్తేనే సర్పంచ్‌లకు గౌరవం దక్కుతుందన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి గ్రామాభివృద్ధికి కలసికట్టుగా పనిచేయాలని పిలువునిచ్చారు.
మన్నవరం, శ్రీసిటిలో స్థానికులకు ఉద్యోగాలు, రేణిగుంటను అంతర్జాతీయ విమానాశ్రయం, నడికుడి-గుంటూ రు రైలుమార్గం, రేణిగుంట-నాయుడుపేట ఫోర్‌లైన్ రోడ్డు, తిరుపతి రైల్వేస్టేషన్‌కు జాతీయ స్థాయి తదితర అంశాలను మంత్రుల దృష్టికి తీసుకుపోయినట్లు వెల్లడిం చారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీని మరింత పటిష్టంగా ముందు కు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చంద్రబాబు అబద్దాలను ప్రజలు గుర్తించారని, భవి ష్యత్తు మనదేనని అన్నారు. సభాధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నాయకుడు గుమ్మడి బాలకృష్ణయ్య వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సర్పం చ్‌లు ఎంపీని దుశ్శాలువతో సత్కరించారు.
పార్టీ నాయకులు అంజూరు శ్రీనివాసులు, మిద్దెల హరి, వయ్యాల కృష్ణారెడ్డి, చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి, పొనుగోటి భక్తవత్సలనాయుడు, హరిప్రసాద్‌రెడ్డి, సుధాకర్, రామచంద్రారెడ్డి, పాక్యముత్తుసభాపతి, గోవింద్‌రెడ్డి, సుబ్రమమణ్యం, లీలాప్రసాద్, రఘురామిరెడ్డి, విద్యానందరెడ్డి, కృష్ణయ్య, అన్నదొరై, రామచంద్రయ్య, మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
బాబు మోసాలను ప్రజలు గుర్తించారు
Published Mon, Jul 21 2014 3:54 AM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM
Advertisement
Advertisement