‘సెబు’ ప్రాజెక్టును విక్రయిస్తున్న జీఎంఆర్‌ | GMR Group to divest entire 40percent stake in Philippines Cebu airport | Sakshi
Sakshi News home page

‘సెబు’ ప్రాజెక్టును విక్రయిస్తున్న జీఎంఆర్‌

Published Sat, Sep 3 2022 6:18 AM | Last Updated on Sat, Sep 3 2022 6:18 AM

GMR Group to divest entire 40percent stake in Philippines Cebu airport - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫిలిప్పైన్స్‌లోని సెబు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో తనకున్న 40 శాతం వాటాను జీఎంఆర్‌ గ్రూప్‌ విక్రయిస్తోంది. అమ్మకం కారణంగా కంపెనీ రూ.1,330 కోట్లు అందుకోవడంతోపాటు రాబోయే కాలంలో నాలుగేళ్లకుపైగా ఆదాయం స్వీకరించనుంది.

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇంటర్నేషనల్‌ బీవీ, అబూటిజ్‌ ఇన్‌ఫ్రా క్యాపిటల్‌ మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ రుణ భారం తగ్గించడం, అధిక రాబడి కోసం ఆస్తులను మళ్లించడంపై దృష్టి సారించడంలో భాగంగా ఈ వాటాను ఉపసంహరించుకుంటున్నట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. 2026 డిసెంబర్‌ వరకు సాంకేతిక సేవలను జీఎంఆర్‌ అందించనుంది. సెబు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్టును 2014లో జీఎంఆర్‌ దక్కించుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement