సంచలనం.. ఒక్కడే 1045 పరుగులు బాదాడు! | Mumbai Cricketer Hits 1,045 in Local Match | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 31 2018 11:23 AM | Last Updated on Wed, Jan 31 2018 2:01 PM

Mumbai Cricketer Hits 1,045 in Local Match - Sakshi

తనీష్క్‌గవటే

ముంబై : క్రికెట్‌ చరిత్రలోనే సంచలన రికార్డు నమోదైంది. ముంబైలో జరిగిన ఓ లోకల్‌ టోర్నమెంట్‌లో తనీష్క్‌గవటే అనే14 ఏళ్ల కుర్రాడు ఏకంగా 1045 పరుగులు బాదాడు. రెండు రోజుల బ్యాటింగ్‌ చేసిన ఈ ముంబై ఆటగాడు 149 ఫోర్లు, 67 సిక్సులతో ఈ ఘనత సాధించాడు. నవీ ముంబై, కోపర్‌ఖైర్నేలోని యశ్వంతరావు ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో జరిగిన స్థానిక టోర్నమెంట్‌ సెమీస్‌ మ్యాచ్‌లో గవటే ఈ పరుగులు చేశాడు.

అయితే ఆఫ్‌సైడ్‌, లెగ్‌సైడ్‌ బౌండరీ దగ్గరగా ఉండటంతో ఇన్ని పరుగులొచ్చాయని కోచ్‌ మనీష్‌ తెలిపాడు. మరోవైపు ఈ టోర్నీకి ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ గుర్తింపు లేదని అధికారులు స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement