under-14 cricket
-
ఆంధ్ర క్రికెట్ జట్టుకు మధురవాడ కుర్రాడు
మధురవాడ(భీమిలి): మధురవాడ బొట్టవానిపాలేనికి చెందిన ముగడ భానుస్వరూప్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్–14 జట్టులో చోటు సంపాదించాడు. భానుస్వరూప్ ప్రస్తుతం బక్కన్నపాలెం సెయింట్ ఆన్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి రమణ లారీ యజమాని. చిన్నప్పుడే కుమారుడి ఆసక్తిని గమనించిన రమణ.. తమకు తెలిసిన వారి దగ్గర క్రికెట్లో శిక్షణ ఇప్పించాడు. అనంతరం పక్కనే ఉన్న పీఎం పాలెంలో స్టేడియం ఉండటంతో.. విశాఖ క్రికెట్ అసోసియేషన్‌లో చేర్పించాడు. అప్పటి నుంచి భానుస్వరూప్ టోర్నమెంట్లలో పాల్గొంటూ ప్రతిభ చూపేవాడు. ఈక్రమంలో గతేడాది వీడీసీఏలో స్థానం సంపాదించాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా, బ్యాటింగ్‌లో రాణిస్తూ.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్–14 జట్టులో స్థానం సంపాదించాడు. ప్రస్తుతం కేరళలో దక్షిణాది రాష్ట్రాల జట్ల మధ్య జరుగుతున్న పోటీల్లో ఏసీఏ తరఫున భానుస్వరూప్ పాల్గొంటున్నాడు. భానుస్వరూప్ మాట్లాడుతూ.. ‘నాకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని గమనించిన మా నాన్న.. నన్ను బాగా ప్రోత్సహించారు. వీడీసీఏలోని కోచ్‌లు, పెద్దల సూచనలు, ప్రోత్సాహంతో మరింత పట్టుదలగా ఆడుతున్నాను. నాకు రవీంద్ర జడేజా అంటే చాలా ఇష్టం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని జాతీయ జట్టులో ఆడాలనేది నా కల. దాన్ని నిజం చేసుకుంటా’అని చెప్పాడు. -
సంచలనం.. ఒక్కడే 1045 పరుగులు బాదాడు!
ముంబై : క్రికెట్ చరిత్రలోనే సంచలన రికార్డు నమోదైంది. ముంబైలో జరిగిన ఓ లోకల్ టోర్నమెంట్లో తనీష్క్గవటే అనే14 ఏళ్ల కుర్రాడు ఏకంగా 1045 పరుగులు బాదాడు. రెండు రోజుల బ్యాటింగ్ చేసిన ఈ ముంబై ఆటగాడు 149 ఫోర్లు, 67 సిక్సులతో ఈ ఘనత సాధించాడు. నవీ ముంబై, కోపర్ఖైర్నేలోని యశ్వంతరావు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన స్థానిక టోర్నమెంట్ సెమీస్ మ్యాచ్‌లో గవటే ఈ పరుగులు చేశాడు. అయితే ఆఫ్‌సైడ్, లెగ్‌సైడ్ బౌండరీ దగ్గరగా ఉండటంతో ఇన్ని పరుగులొచ్చాయని కోచ్ మనీష్ తెలిపాడు. మరోవైపు ఈ టోర్నీకి ముంబై క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు లేదని అధికారులు స్పష్టం చేశారు. -
భారత జట్టుకు ఆడడమే లక్ష్యం
మహబూబ్‌నగర్ క్రీడలు: తమ పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు తదితర ప్రొఫెషనల్స్‌గా ఎదగాలని చదువు.. చదువు అంటూ వెంటపడే తల్లిదండ్రులున్న రోజులివి.. కానీ తమ కొడుకు క్రికెట్లో రాణించాలని, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని, అందుకోసం ఎంత కష్టాన్నయినా భరిస్తానని పరితపిస్తున్నాడు జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లికి చెందిన పోలీస్ ఉద్యోగి రమేష్‌యాదవ్. తన కుమారులు రాకేశ్‌యాదవ్, హృతిక్యాదవ్లను క్రికెట్ శిక్షణ కోసం ఇంటివద్దే రెండు నెట్లు ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాడు. ఇంటి ఆవరణలో టర్ఫ్, సిమెంట్ పిచ్‌లను ఏర్పాటు చేశాడు. మూడేళ్ల క్రితం బెంగళూర్‌లోని ప్రసిద్ధ బ్రిజేష్పటేల్ క్రికెట్ అకాడమీలో రెండునెలలపాటు ఇద్దరు కుమారులకు శిక్షణ ఇప్పించాడు. అండర్ –14లో మెరిసిన హృతిక్యాదవ్ రాకేశ్‌యాదవ్ అండర్–19, అండర్–23 విభాగాల్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు. హృతిక్యాదవ్ ఆల్‌రౌండర్‌గా సత్తాచాటుతున్నాడు. తన లెగ్‌స్పిన్ మాయాజాలంతో మ్యాచుల్లో వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. లెఫ్ట్‌హ్యాండర్ బ్యాటింగ్, లెగ్‌స్పిన్‌తో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. 2013 హైదరాబాద్‌లో జరిదిన అండర్–14 ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి టోర్నీలో కరీంనగర్‌పై 13 పరుగులు ఐదు వికెట్లు తీసి అందరి దృష్టిలో పడ్డాడు. వయస్సు తక్కువగా ఉన్న కారణంతో ఆ ఏడాది జాతీయస్థాయి పోటీలకు ఎంపికకాలేదు. 2015 హైదరాబాద్‌లో జరిగిన అండర్–14 క్రికెట్ టోర్నీలో స్పిన్నర్ హృతిక్యాదవ్ మెరిశాడు. టోర్నీలో 12 వికెట్లు తీసి బెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. సెమీఫైనల్లో నిజామాబాద్‌పై, ఫైనల్ మ్యాచ్‌లో వరంగల్‌పై ఐదేసి వికెట్లు తీసి రాణించాడు. 2015లో జిల్లా కేంద్రంలో జరిగిన అండర్–14 ఎస్జీఎఫ్ జాతీయస్థాయి క్రికెట్ టోర్నీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. 2016 ఎస్జీఎఫ్, హెచ్‌సీఏ టోర్నీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించాడు. మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2015, 2017లో నిర్వహించిన (మహబూబ్‌నగర్ ప్రీమియర్ లీగ్) ఎంపీఎల్లో ఆడాడు. గత నెలలో సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్లో జరిగిన అండర్–17 రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ టోర్నీలో మెరుగైన ప్రతిభ కనబరిచాడు. ఈ టోర్నీలో 43పరుగులు చేయడంతోపాటు బౌలింగ్‌లో ఆరు వికెట్లు తీశాడు. 2016లో బెంగళూర్‌లో అండర్–14 టోర్నీలో హెచ్‌సీఏ–బి జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. హెచ్‌సీఏ అండర్–16 టోర్నీలో హృతిక్ సంచలనం మూడురోజులుగా హైదరాబాద్‌లోని డానియల్ అకాడమీ మైదానంలో జరుగుతున్న హెచ్‌సీఏ అండర్–16 టోర్నీ సత్తాచాటాడు. కరీంనగర్ జట్టుపై తన స్పిన్బౌలింగ్తో ప్రతిభ కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 5.4 ఓవర్లలో కేవలం 11 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీశాడు. జిల్లా తరపున అండర్–14, అండర్–16 హెచ్‌సీఏ క్రికెట్లో ఏడు వికెట్లు తీసి రికార్డ్‌గా నిలిచాడు. భారత జట్టుకు ఆడడమే లక్ష్యం క్రికెట్ కెరీర్లో నాన్న ప్రోత్సాహం ఎంతో ఉంది. ఎన్ని పనులు ఉన్నా క్రికెట్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఆయన నమ్మకాన్ని వమ్ముచేయకుండా నావంతు ప్రతిభ కనబరుస్తున్నాను. నిత్యం పిల్లలమర్రి సమీపంలోని ఎండీసీఏ క్రికెట్ మైదానంలో కోచ్‌ల వద్ద ప్రత్యేక కోచింగ్ తీసుకుంటున్నాను. ఇంకా చాలా ప్రాక్టిస్ చేసి, కష్టపడి రంజీ, భారతజట్టుకు ఆడడమే నా లక్ష్యం. –హృతిక్యాదవ్ -
ఫైనల్‌కు అనంత జట్టు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : విజయనగరంలో నిర్వహిస్తున్న అండర్–14 క్రికెట్ పోటీల్లో కృష్ణా జట్టు పై అనంత జట్టు విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. అనంత జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 306 పరుగులు చేసింది. శ్రీయాస్ 89 పరుగులు సాధించాడు. జట్టు కెప్టె¯ŒS దత్తారెడ్డి 99 పరుగులకు ఔట్ అయి సెంచరీని చేజార్చుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన కృష్ణా జట్టు అనంత బౌలర్ల ధాటికి 139 పరుగులకే కుప్పకూలింది. అనంత జట్టులోని ఆనంద్ 5 వికెట్లు, ప్ర«శాంత్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ అనంత జట్టు 90 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. దీంతో అనంత జట్టు మొదటి ఇన్నింగ్స్ ఆ««ధిక్యతతో విజయాన్ని సాధించింది. అనంత జట్టులో కెప్టె¯ŒS దత్తారెడ్డి తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సెమీఫైనల్స్‌లో విజయానికి బాట వేశాడు. అనంత జట్టు రెండేళ్లుగా అండర్ –14 విజేతగా నిలుస్తోంది. ప్రస్తుతం వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరింది.