అనంతపురం సప్తగిరి సర్కిల్ : విజయనగరంలో నిర్వహిస్తున్న అండర్–14 క్రికెట్ పోటీల్లో కృష్ణా జట్టు పై అనంత జట్టు విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. అనంత జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 306 పరుగులు చేసింది. శ్రీయాస్ 89 పరుగులు సాధించాడు. జట్టు కెప్టె¯ŒS దత్తారెడ్డి 99 పరుగులకు ఔట్ అయి సెంచరీని చేజార్చుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన కృష్ణా జట్టు అనంత బౌలర్ల ధాటికి 139 పరుగులకే కుప్పకూలింది.
అనంత జట్టులోని ఆనంద్ 5 వికెట్లు, ప్ర«శాంత్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ అనంత జట్టు 90 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. దీంతో అనంత జట్టు మొదటి ఇన్నింగ్స్ ఆ««ధిక్యతతో విజయాన్ని సాధించింది. అనంత జట్టులో కెప్టె¯ŒS దత్తారెడ్డి తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సెమీఫైనల్స్‌లో విజయానికి బాట వేశాడు. అనంత జట్టు రెండేళ్లుగా అండర్ –14 విజేతగా నిలుస్తోంది. ప్రస్తుతం వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరింది.
ఫైనల్‌కు అనంత జట్టు
Published Sat, Nov 12 2016 11:41 PM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM
Advertisement
Advertisement