వేధింపులు తాళలేక.. సైంటిఫిక్‌ ఆఫీసర్‌ అదృశ్యం | BARC lady officer goes missing | Sakshi
Sakshi News home page

వేధింపులు తాళలేక.. సైంటిఫిక్‌ ఆఫీసర్‌ అదృశ్యం

Published Thu, Jan 26 2017 3:15 PM | Last Updated on Sat, Sep 15 2018 7:34 PM

వేధింపులు తాళలేక.. సైంటిఫిక్‌ ఆఫీసర్‌ అదృశ్యం - Sakshi

వేధింపులు తాళలేక.. సైంటిఫిక్‌ ఆఫీసర్‌ అదృశ్యం

ముంబై :
బాబా అటామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (బార్క్)లో  సైంటిఫిక్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న బబితా సింగ్‌ అనే 30 ఏళ్ల యువతి ఆచూకీ లభించడం లేదు. పని చేసే చోట వేధింపులపై తల్లిదండ్రులతో చర్చించిన కొన్ని రోజుల్లోనే ఇంట్లోనుంచి వెళ్లిన బబితా సింగ్‌ కనిపించకుండా పోయింది.

నవీ ముంబైలోని నీరుల్‌లో నివాసముంటున్న అధికారిణి జనవరి 23 నుంచి కనిపించకుండా పోయిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం చివరిసారిగా ఇంటి నుంచి బయటకు వెళ్లినట్టు తెలిపారు. దీంతో బబితా సింగ్‌ కోసం వెతకగా ఆచూకీ లభించకపోవడంతో ఆ మరుసటి రోజు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. బార్క్‌లో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ఆమె తన తల్లిదండ్రులకు ఈ మెయిల్‌ చేసినట్టు సమాచారం.  

అయితే మెయిల్‌లో పేర్కొన్న వివరాలను పోలీసులు వెల్లడిచలేదు. మహిళ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement