దక్షిణాఫ్రికా మహిళకు వేధింపులు
థానే: సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో పరిచయమైన దక్షిణాఫ్రికా మహిళను మోసం చేయడమే కాకుండా, ఆమెను లైంగికంగా వేధించిన కొరియోగ్రాఫర్ ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు(48) పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడు కుష్ అగ్నిహోత్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దక్షిణాఫ్రికాలో సొంతంగా పెట్రోల్ బంకు నడుపుతున్న బాధితురాలికి నవీ ముంబైకి చెందిన కుష్ సామాజిక మాధ్యమంలో పరిచయమయ్యాడు. వ్యాపారంలో సహాయం చేస్తానని చెప్పి ఆమెను ముంబైకి రప్పించాడు. ఆమె డెబిట్ కార్డు నుంచి రూ. 34 వేలు తీసుకున్నాడు. అంతేకాదు ఆమెను లైంగికంగా వేధించడమే కాకుండా, కొట్టాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.