
ముంబై: ఇటీవల చెరకు రసం ఇప్పిస్తానంటూ ఒక యువకుడిని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన తరహా ఘటనే మరొకటి వెలుగుచూసింది. కాకపోతే ఈ సారి అందుకు ఒప్పుకోలేదని బెస్ట్‌ఫ్రెండ్ తల బద్దలు కొట్టి చంపేశాడు ఓ కామాంధుడు. ఈ ఘటన ముంబై నగరంలో వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీముంబైలోని కరావే ప్రాంతంలో బాధితుడు రూపేష్ అలియాస్ రూపసింగ్ (30) అక్టోబర్ 22న ఆగి ఉన్న బస్సు వెనుక సీటులో శవమై కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో అతని స్నేహితుడు మస్కే మీద అనుమానం రావడంతో పోలీసులు అతన్ని విచారించేసరికి జరిగినదంతా బయటపెట్టాడు.
అక్టోబర్ 22 రాత్రి పూట తామిద్దం ఒక సర్వీస్ రోడ్డులో ఆగి ఉన్న బస్సులో కలిశామని, ఆ సమయంలో తాను మద్యం మత్తులో ఉండడంతో తనతో శృంగారం చేయాలన్న తన కోరికను రూప్‌సింగ్‌కు తెలపగా అందుకు రూపేష్ అంగీకరించలేదని మస్కే వెల్లడించాడు. దీంతో తనకు కోపం వచ్చి రోడ్డు పక్కనే ఉన్న సిమెంట్ టైల్స్ తీసుకొని రూపేష్ తలపగలగొట్టడంతో మరణించినట్లు నిందితుడు చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment