killed by
-
శృంగారానికి ఒప్పుకోలేదని స్నేహితుడి తల పగలకొట్టి చంపాడు
ముంబై: ఇటీవల చెరకు రసం ఇప్పిస్తానంటూ ఒక యువకుడిని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన తరహా ఘటనే మరొకటి వెలుగుచూసింది. కాకపోతే ఈ సారి అందుకు ఒప్పుకోలేదని బెస్ట్‌ఫ్రెండ్ తల బద్దలు కొట్టి చంపేశాడు ఓ కామాంధుడు. ఈ ఘటన ముంబై నగరంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీముంబైలోని కరావే ప్రాంతంలో బాధితుడు రూపేష్ అలియాస్ రూపసింగ్ (30) అక్టోబర్ 22న ఆగి ఉన్న బస్సు వెనుక సీటులో శవమై కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో అతని స్నేహితుడు మస్కే మీద అనుమానం రావడంతో పోలీసులు అతన్ని విచారించేసరికి జరిగినదంతా బయటపెట్టాడు. అక్టోబర్ 22 రాత్రి పూట తామిద్దం ఒక సర్వీస్ రోడ్డులో ఆగి ఉన్న బస్సులో కలిశామని, ఆ సమయంలో తాను మద్యం మత్తులో ఉండడంతో తనతో శృంగారం చేయాలన్న తన కోరికను రూప్‌సింగ్‌కు తెలపగా అందుకు రూపేష్ అంగీకరించలేదని మస్కే వెల్లడించాడు. దీంతో తనకు కోపం వచ్చి రోడ్డు పక్కనే ఉన్న సిమెంట్ టైల్స్ తీసుకొని రూపేష్ తలపగలగొట్టడంతో మరణించినట్లు నిందితుడు చెప్పాడు. చదవండి: భయపెట్టమంటే.. భయానికే భయం పుట్టించాడు! -
విద్యుదాఘాతంతో కూలీ మృతి
మద్దూరు :అడవి పందుల బారి నుంచి మొక్కజొన్న పంటను రక్షించుకునేందుకు ఓ రైతు దొంగచాటుగా వేసుకున్న కరెంట్ తీగలు తాకి మరో కౌలు మృతిచెందిన ఘటన మద్దూరు మండలం దూల్మిట్టలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై కథనం ప్రకారం..గ్రామానికి చెందిన తొగిటె లింగయ్య (65)భైరాన్‌పల్లి గ్రామానికి చెందిన పులిగిల్ల రాజయ్య అనే రైతుకు చెందిన మొక్కజొన్న చేనుకు కావలి వెళ్లున్నాడు. కాగా, ధూల్మిట్ట గ్రామరైతు ఇస్కిల్ల రాజయ్య అడవిపందుల నుంచి మొక్కజొన్న చేను రక్షించుకునేందుకు అక్రమంగా వేసిన కరెంట్ తీగలు లింగయ్యకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే లింగయ్య మృతికి కారణమైన ఇస్కిల్ల రాజయ్యను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లింగయ్య మృతితో తనకు సంబంధం లేదంటూ స్థానికులతో రాజయ్య వాగ్వాదానికి దిగడంతో మృతదేహన్ని అతడి ఇంటివద్ద వేసి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతుని కుటుంబానికి న్యాయం చేయిస్తమని హామి ఇచ్చి, గ్రామస్తులను శాంతింపచేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. లింగయ్య కుమారుడు రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు ఽదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
మంగపేట పీహెచ్సీలో అందని వైద్యం కలెక్టర్‌కు ఫిర్యాదు మంగపేట: మండలంలోని తిమ్మంపేటకు చెందిన గడదాసు ఖాదర్‌బాబు(38) అనే రైతు మోటార్ ఆన్ చేస్తుం డగా విద్యుదాఘాతానికి గురై ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. బాధి త కుటుంబీకుల కథనం ప్రకారం.. ఖాదర్‌బాబు మండలంలోని అబ్బాయిగూడెం సమీపంలోని ఎర్రకుంట సమీపంలో మిర్చి పంట సాగుచేసేందుకు రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. శనివారం మిర్చి నాటేందుకు కూలీలను పొలానికి తీసుకెళ్లాడు. సాయంత్రం ఇంటికొచ్చిన ఆయన ఇంటి వద్ద మిర్చి నారుమడులకు నీటిని పట్టేందుకు మోటారును ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురవడంతో స్పృహ తప్పి కిందపడిపోయాడు. గమనించిన కుటుం బ సభ్యులు ఆటోలో మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అందులో ఏఎన్ఎం ఒక్కరే ఉండటంతో వైద్యాధికారి కృష్ణకుమార్, ఇతర సిబ్బంది అందుబాటు లో లేదు. దీంతో రైతు ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటనే ఏఎన్ఎం సహాయంతో ఆటోలో ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే స్థానిక రైతులు పీహెచ్సీలో వైద్యం అందని విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈవిషయంపై కలెక్టర్ ఐటీడీఏ పీఓకు సమాచారం అందించడంతో ఏటూరునాగారం వైద్యులు అప్రమత్తమై గాయపడిన రైతుకు వైద్యం అందించారు. కాగా, చికిత్స పొందుతూ రాత్రి 7 గంటలకు ఆస్పత్రిలోనే రైతు ఖాదర్‌బాబు కన్నుమూశాడు. మంగపేటలో వైద్యాధికారి లేదా సిబ్బంది అందుబాటులో ఉండి సకాలంలో వైద్యం అందిస్తే రైతు బతికేవాడని పలువురు పేర్కొన్నారు. -
పాము కాటుతో రైతు మృతి
ఉప్పలచలక (పెనుబల్లి): పాముకాటుతో రైతు మతిచెందాడు. ఉప్పలచలక గ్రామానికి చెందిన చిమట నరసింహారావును గురువారం పొలం గట్టుపై పాము కాటేసింది.తోటి రైతులు వెంటనే పెనుబల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆయన అప్పటికే మతిచెందినట్టుగా వైద్యులు చెప్పారు. మతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.