- మంగపేట పీహెచ్‌సీలో అందని వైద్యం
- కలెక్టర్‌కు ఫిర్యాదు
విద్యుదాఘాతంతో రైతు మృతి
Published Sun, Sep 4 2016 12:20 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
మంగపేట: మండలంలోని తిమ్మంపేటకు చెందిన గడదాసు ఖాదర్‌బాబు(38) అనే రైతు మోటార్ ఆన్ చేస్తుం డగా విద్యుదాఘాతానికి గురై ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. బాధి త కుటుంబీకుల కథనం ప్రకారం.. ఖాదర్‌బాబు మండలంలోని అబ్బాయిగూడెం సమీపంలోని ఎర్రకుంట సమీపంలో మిర్చి పంట సాగుచేసేందుకు రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. శనివారం మిర్చి నాటేందుకు కూలీలను పొలానికి తీసుకెళ్లాడు. సాయంత్రం ఇంటికొచ్చిన ఆయన ఇంటి వద్ద మిర్చి నారుమడులకు నీటిని పట్టేందుకు మోటారును ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురవడంతో స్పృహ తప్పి కిందపడిపోయాడు. గమనించిన కుటుం బ సభ్యులు ఆటోలో మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు.
అందులో ఏఎన్‌ఎం ఒక్కరే ఉండటంతో వైద్యాధికారి కృష్ణకుమార్, ఇతర సిబ్బంది అందుబాటు లో లేదు. దీంతో రైతు ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటనే ఏఎన్‌ఎం సహాయంతో ఆటోలో ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే స్థానిక రైతులు పీహెచ్‌సీలో వైద్యం అందని విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈవిషయంపై కలెక్టర్ ఐటీడీఏ పీఓకు సమాచారం అందించడంతో ఏటూరునాగారం వైద్యులు అప్రమత్తమై గాయపడిన రైతుకు వైద్యం అందించారు. కాగా, చికిత్స పొందుతూ రాత్రి 7 గంటలకు ఆస్పత్రిలోనే రైతు ఖాదర్‌బాబు కన్నుమూశాడు. మంగపేటలో వైద్యాధికారి లేదా సిబ్బంది అందుబాటులో ఉండి సకాలంలో వైద్యం అందిస్తే రైతు బతికేవాడని పలువురు పేర్కొన్నారు.
Advertisement
Advertisement