విద్యుదాఘాతంతో కూలీ మృతి
Published Fri, Sep 16 2016 1:15 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
మద్దూరు :అడవి పందుల బారి నుంచి మొక్కజొన్న పంటను రక్షించుకునేందుకు ఓ రైతు దొంగచాటుగా వేసుకున్న కరెంట్ తీగలు తాకి మరో కౌలు మృతిచెందిన ఘటన మద్దూరు మండలం దూల్మిట్టలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై కథనం ప్రకారం..గ్రామానికి చెందిన తొగిటె లింగయ్య (65)భైరాన్‌పల్లి గ్రామానికి చెందిన పులిగిల్ల రాజయ్య అనే రైతుకు చెందిన మొక్కజొన్న చేనుకు కావలి వెళ్లున్నాడు. కాగా, ధూల్మిట్ట గ్రామరైతు ఇస్కిల్ల రాజయ్య అడవిపందుల నుంచి మొక్కజొన్న చేను రక్షించుకునేందుకు అక్రమంగా వేసిన కరెంట్ తీగలు లింగయ్యకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే లింగయ్య మృతికి కారణమైన ఇస్కిల్ల రాజయ్యను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లింగయ్య మృతితో తనకు సంబంధం లేదంటూ స్థానికులతో రాజయ్య వాగ్వాదానికి దిగడంతో మృతదేహన్ని అతడి ఇంటివద్ద వేసి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతుని కుటుంబానికి న్యాయం చేయిస్తమని హామి ఇచ్చి, గ్రామస్తులను శాంతింపచేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. లింగయ్య కుమారుడు రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు ఽదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు.
Advertisement