అంబానీ ఇంట పెళ్లి ఖర్చు 0.5 శాతమే!! | Ambani Wedding Cost 0 5 pc Of Ambanis Net Worth | Sakshi
Sakshi News home page

అంబానీ ఇంట పెళ్లి ఖర్చు 0.5 శాతమే!!

Published Thu, Jul 11 2024 9:33 PM | Last Updated on Fri, Jul 12 2024 11:38 AM

Ambani Wedding Cost 0 5 pc Of Ambanis Net Worth

ఆసియా అపర కుబేరుడు ముఖేష్‌ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహం జూలై 12న జరగనుంది. రెండు విడతల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఇదివరకే అత్యంత ఘనంగా జరిగాయి. ఇక అసలైన పెళ్లి వేడుకలు ఇంకెంత ఘనంగా జరుగుతాయోనని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది.

ప్రపంచమే అబ్బురపడేలా వీరి వివాహ వేడుకలు నిర్వహిస్తున్నారు. గ్లోబల్ సింగింగ్ ఐకాన్‌లు జస్టిన్ బీబర్, రిహన్న, దిల్జిత్ దోసాంజ్, ఇతర బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకలలో ప్రదర్శనలు ఇస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా ఈ పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. అంబానీ వివాహానికి సంబంధించిన విజువల్స్, ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

రూ.5000 కోట్ల ఖర్చు
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల పెళ్లి ఖర్చు రూ. 4,000-5,000 కోట్లు ఉంటుందని ఫైనాన్స్‌ డీకోడర్లు అంచనా వేస్తున్నారు. పెళ్లి కోసం ఇంత మొత్తంలో ఖర్చు చేయడం అనూహ్యమైనప్పటికీ, అంబానీ కుటుంబం సగటు భారతీయ కుటుంబాలు ఖర్చు చేసే దాని కంటే తక్కువ శాతాన్నే ఖర్చు చేస్తోంది.

రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు ఆస్తి కలిగిన కుటుంబం తమ పిల్లల పెళ్లికి రూ. 10-15 లక్షలు ఖర్చు చేస్తున్నారు. అదే విధంగా రూ. 10 కోట్ల సంపద కలిగిన కుటుంబం రూ. 50 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అంటే తమ సంపదలో 5 శాతం నుంచి 15 శాతం వరకు ఖర్చు చేస్తున్నారన్న మాట. అయితే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహానికి చేస్తున్న దాదాపు రూ.5,000 కోట్లు అంబానీ సంపదలో 0.5 శాతం మాత్రమే. ఫోర్బ్స్ ప్రకారం.. ప్రస్తుతం ముఖేష్ అంబానీ నికర విలువ 123.2 బిలియన్ డాలర్లు (రూ. 10,28,544 కోట్లు).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement