అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ఈ రోజు (జులై 12)న ముంబైలో జరగనుంది. ఈ నేపథ్యంలో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(BKC)లోని పలు కార్యాలయాలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ అవకాశం కల్పించాయి. జూలై 15 వరకు ఎవరూ ఆఫిసులకు రావాల్సిన అవసరం లేదని, ఆ తరువాత కార్యాలయాలకు యధావిధిగా హాజరు కావాలని పేర్కొన్నాయి.
అనంత్, రాధికల పెళ్లి కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు ముంబైలోని పలు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ వివాహం జూలై 12న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ పెళ్లి వేడుకలు జూలై 14 వరకు.. మూడు రోజులు కొనసాగుతాయి.
అంబానీ ఇంట జరగనున్న ఈ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. వీరందరికి భద్రత కల్పించడంలో సెక్యూరిటీ చాలా పటిష్టంగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ఆఫీసులు తెలిపాయి.
అనంత్, రాధికల వివాహం కారణంగా ఇప్పటికే ముంబై అంతటా హోటల్ బుకింగ్ ధరలు గణనీయమైన పెరిగాయి. ట్రైడెంట్, ఒబెరాయ్ వంటి వేదికలు జూలై 10 నుంచి 14 వరకు పూర్తిగా బుక్ అయినట్లు సమాచారం. ఇక్కడ ఒక రాత్రి బస చేయడానికి ఏకంగా లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉందని పలు నివేదికలు వెల్లడించాయి.
అంబానీ ఇంట జరగనున్న పెళ్ళికి హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్స్ పీఎల్‌సీ ఛైర్మన్ మార్క్ టక్కర్, శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కో. లిమిటెడ్ ఛైర్మన్ జేలీ, యూకే మాజీ నేతలు బోరిస్ జాన్సన్, టోనీ బ్లెయిర్ వంటి వాటితో పాటు సౌదీ అరామ్‌కో అమిన్ నాసర్, బీపీ పీఐసీ ముర్రే ఆచిన్‌క్లోస్, జీఎస్కే పీఐసీ ఎమ్మా వాల్మ్‌స్లే, లాక్‌హీడ్ మార్టిన్ జిమ్ టైక్లెట్, ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో వంటి టాప్ ఎగ్జిక్యూటివ్‌లు హాజరయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment