
వాషింగ్టన్: అందరి అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పావు శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించింది. రెండు రోజుల పాటు జరిగి బుధవారం ముగిసిన సమావేశంలో ఫెడ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ, ప్రస్తుతం 1.75 శాతం నుంచి 2 శాతం రేంజ్‌లో ఉన్న ‘ఫెడ్ ఫండ్స్ రేటు’ను 1.5 శాతం నుంచి 1.75 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది రేట్లను తగ్గించడం ఫెడరల్ రిజర్వ్‌కు ఇది మూడో సారి. ఈ ఏడాది జూలై, సెప్టెంబర్‌ల్లో పావు శాతం మేర రేట్లను ఫెడ్ తగ్గించింది. అంతర్జాతీయంగా మందగమనం నెలకొనడంతో రేట్లను ఫెడ్ తగ్గిస్తూ వస్తోంది.
ఫెడరల్ ఫండ్స్ రేట్ అంటే...
బ్యాంక్‌లు పరస్పరం ఇచ్చుకునే ఓవర్‌నైట్ రుణాలపై ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించే రేటునే ఫెడరల్ ఫండ్స్ రేట్‌గా వ్యవహరిస్తారు. ఈ రేట్‌పై ఆధారపడే బ్యాంక్‌లు వినియోగదారులకు ఇచ్చే తాకట్టు, క్రెడిట్, వ్యాపార ఇలా వివిధ రుణాలపై వడ్డీరేట్లను నిర్ణయిస్తాయి.