price control
-
RBI Monetary Policy: ధరల కట్టడే ధ్యేయం..
ముంబై: ధరల కట్టడికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) స్పష్టం చేసింది. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను యథాతథంగా 6.5 శాతంగా కొనసాగించాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ తరహా ‘యథాతథ రెపో రేటు కొనసాగింపు’ నిర్ణయం తీసుకోవడం వరుసగా ఇది నాల్గవసారి. రిటైల్ ద్రవ్యోల్బణం 4%గా కొనసాగించడమే ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించిన ఎంపీసీ, ఈ దిశలో వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) వెనక్కు తీసుకునే విధానాన్ని కొనసాగిస్తామని పేర్కొంది. ఇందులో భాగంగా బాండ్ విక్రయాల ను చేపడుతున్నట్లు తెలిపింది. ‘సరళతర ద్రవ్య విధానాన్ని వెనక్కుతీసుకునే’ ధోరణికే కట్టుబడి ఉన్నట్లు పాలసీ కమిటీ స్పష్టం చేసింది. మూడు రోజులపాటు జరిగిన కమిటీ సమావేశాల నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ మీడియాకు తెలిపారు. ‘ఆర్బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం 4%. 2 నుంచి 6% కాదు’ అని ఉద్ఘాటించారు. ప్లస్ 2, మైనస్ 2తో 4% వద్ద ద్రవ్యోల్బణం ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. పాలసీ ముఖ్యాంశాలు... ► 2023–24లో జీడీపీ 6.5 శాతం. ► రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం. ► అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుల బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ కింద పసిడి రుణాల పరి మితి రూ. 2 లక్షల నుంచి రూ. 4లక్షలకు పెంపు. రూ. 2,000 నోట్లు ఇప్పటికీ మార్చుకోవచ్చు.. రూ.2,000 నోట్లను అక్టోబర్ 8 నుంచి కూడా మార్చుకునే అవకాశాలన్నీ ఆర్బీఐ కలి్పంచింది. గవర్నర్ ఈ విషయంపై మాట్లాడుతూ రూ. 3.43 లక్షల కోట్ల రూ. 2,000 డినామినేషన్ నోట్లు ఇప్పటి వరకూ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయ న్నారు. ఇంకా రూ.12,000 కోట్లకుపైగా విలువైన నోట్లు చెలామణీలో ఉన్నాయన్నారు. అక్టోబర్ 8 నుండి 19 ఆర్బీఐ కార్యాలయాల్లో వీటిని మార్చుకోవచ్చన్నారు. నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి మొదట సెపె్టంబర్ 30 వరకు గడువిచి్చన ఆర్బీఐ, ఈ తేదీని అక్టోబర్ 7 వరకూ పొడిగించింది. రాష్ట్ర రాజధానుల్లో ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నందున, ఎక్కడివారైనా, 2,000 నోట్లను మార్చు కోవడానికి పోస్టల్ శాఖ సేవలను పొందవచ్చని దాస్ సూచించారు. కఠిన ద్రవ్య విధానం కొనసాగింపు.. ఆర్బీఐ 2022 మే నుంచి 250 బేసిస్ పాయింట్లు రెపో రేటును పెంచింది. అయితే ఇటు డిపాజిట్ల విషయంలో అటు రుణాల విషయంలో బ్యాంకులు కస్టమర్లకు ఈ రేట్లను పూర్తిగా బదలాయించలేదు. ఈ పరిస్థితుల్లో ‘సరళతర ద్రవ్య విధానాన్ని వెనక్కుతీసుకునే’ ధోరణినే కొనసాగించాలని ఆర్బీఐ భావిస్తోంది. అంటే ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాలు వ్యవస్థలో ఇంకా ప్రతిఫలించాల్సి ఉంది. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతిలోనూ దేశ ఆర్థికాభివృద్ధి పటిష్టతే లక్ష్యంగా ఉంది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చీఫ్ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. సమీపకాలంలో ధరలు తగ్గవచ్చు. – సుభ్రకాంత్ పాండా, ఫిక్కీ ప్రెసిడెంట్ వృద్ధికి మద్దతునిస్తూ, ద్రవ్యోల్బణం కట్టడే ఆర్బీఐ ధ్యేయంగా కనబడుతోంది – ప్రసేన్‌జిత్ బసు, చీఫ్ ఎకనమిస్ట్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ -
Fact Check: ‘పట్టు’ తప్పిన రాతలు
సాక్షి, అమరావతి: ముడిపట్టు ఉత్పత్తిలో దేశంలోనే రెండోస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రోత్సాహంతో గడచిన నాలుగేళ్లుగా పట్టుసాగు విస్తరిస్తుండడమే కాదు.. ఆ రైతులు గతంలో ఎన్నడూలేని రీతిలో లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా నాలుగేళ్లలో కొత్తగా 39,640 ఎకరాల్లో పట్టుసాగు విస్తరించగా, బైవోల్టిన్ రకం పట్టుగూళ్ల ఉత్పత్తి మరో 13,905 టన్నులు పెరిగింది. 2018–19లో పట్టుగూళ్ల ధర (కకూన్స్) కిలో రూ.380 రావడం గగనంగా ఉండేది. కానీ, నేడు సగటున రూ.470 నుంచి రూ.620 వరకు లభిస్తోంది. అయినా, ప్రభుత్వంపై బురద జల్లడమే ఈనాడు లక్ష్యంగా పెట్టుకుంది. ‘పట్టు రైతుకు కుచ్చుటోపీ’ అంటూ నిసిగ్గుగా అబద్ధాలు అచ్చేసింది. ఈనాడు కథనంలో వాస్తవాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం.. రాష్ట్రంలో 76,395 మంది 1,37,420 ఎకరాల్లో మల్బరీ సాగుచేస్తున్నారు. 600 సిల్క్ రీలర్ కుటుంబాలు ముడిపట్టును ఉత్పత్తి చేస్తుంటే ఈ రంగంపై ఆధారపడి 14లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. పట్టు రైతులకు మెరుగైన ఆదాయకల్పన లక్ష్యంతో పట్టుగూళ్ల మార్కెట్లలో ఈ–మార్కెటింగ్ వ్యవస్థను తీసుకురావడమే కాదు.. పట్టుసాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తోంది. రైతులు, రీలర్లకు ఏటా ప్రోత్సాహకాలు.. ఇలా నాలుగేళ్లలో పట్టు రైతులకు రూ.19.41 కోట్ల బైవోలి్టన్ కకున్ ఇన్సెంటివ్ను అందజేసింది. ఈ ఏడాది మరో రూ.7.12 కోట్లు విడుదల చేసింది. అలాగే, పట్టు రీలర్లకు నాలుగేళ్లలో రూ.8.20 కోట్ల ఇన్సెంటివ్ ఇచ్చారు. ఈ ఏడాది మరో రూ.6 కోట్లు విడుదల చేశారు. మరోవైపు.. పట్టు రైతులు నిర్మించుకున్న 1,186 షెడ్లకు ప్రభుత్వం ఇప్పటికే రూ.37.88 కోట్ల రాయితీనందించగా, మరో రూ.11.97 కోట్ల రాయితీని విడుదల చేసేందుకు ఏర్పాట్లుచేసింది. పట్టు పురుగుల పెంపకపు షెడ్ల నిర్మాణానికి సంబంధించి ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన బకాయిలన్నీ రైతుల ఖాతాలో జమచేశారు. అలాగే, పట్టుసాగులో అవసరమైన క్రిమిసంహార మందుల కొనుగోలు కోసం నాలుగేళ్లలో రూ.1.46 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు. మరోవైపు.. కొత్తగా ఐదు ఆటోమేటిక్ రీలింగ్ మెషినరీ యూనిట్లు ఏర్పాటుచేస్తున్నారు. పట్టు సాగుబడుల ద్వారా శిక్షణ.. చౌకీ పురుగులు నూరు శాతం సరఫరా చేయడం, రీరింగ్ షెడ్లలో టర్బో వెంటిలేటర్లు, కూలింగ్ సిస్టమ్స్ ఏర్పాటుచేయడం, షూట్ రీరింగ్ పద్ధతులపై ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తున్న పట్టుసాగు బడుల ద్వారా అవగాహన కల్పించడం వలన సమయంతో పాటు కూలీల ఖర్చు 40 శాతం వరకు తగ్గింది. పైగా 15–20 శాతం మేర మల్బరీ ఆదా అవుతోంది. ఫలితంగా ఈ రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇలా ప్రభుత్వ చర్యల ఫలితంగా 2019–23 మధ్యలో కొత్తగా 39,640 ఎకరాల మేర సాగులోకి వచి్చంది. గతేడాది రికార్డు స్థాయిలో రూ.4,075 కోట్ల విలువైన 55,363 టన్నుల క్రాస్‌బ్రీడ్ పట్టుగూళ్లు, 12,542 టన్నుల బైవోల్టెన్ పట్టుగూళ్లు ఉత్పత్తి కాగా, రూ.3,687.15 కోట్ల విలువైన 9,311 టన్నుల నాణ్యమైన ముడిపట్టును సిల్్కరీలర్లు ఉత్పత్తి చేశారు. 2021–22లో స్థూలాదాయం (జీవీఏ) రూ.11,638 కోట్లు సాధించగా, 2022–23లో రూ.12,098 కోట్లు సాధించి పట్టు పరిశ్రమ కొత్త రికార్డు నెలకొల్పింది. ఏటా రికార్డు స్థాయి ధరలు.. గడిచిన నాలుగేళ్లలో గరిష్టంగా బైవోల్టిన్ రకం పట్టుగూళ్లకు కిలోకి రూ.881 లభించింది. నాలుగేళ్లలో రైతులు పొందిన సగటు ధరను పరిశీలిస్తే కిలో రూ.470 నుంచి రూ.620 మధ్య పలికింది. ఈ ఏడాది గడిచిన మూడునెలల్లో సగటు ధర కిలో రూ.400 నుంచి రూ.480 మధ్య ఉంది. సాధారణంగా ఏటా సెపె్టంబరు నుంచి ఫిబ్రవరి వరకు పట్టుగూళ్లకు మంచి ధర లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న ధరలు వచ్చే మూడునెలల్లో గరిష్ట స్థాయికి చేరే అవకాశముంది. ఇక ఈ ఏడాది (2023–24) 12వేల ఎకరాల్లో మల్బరీ విస్తరణ ద్వారా 15వేల టన్నుల బైవోల్టెన్ పట్టుగూళ్లు, 65వేల టన్నుల క్రాస్‌బ్రీడ్ పట్టుగూళ్ల ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, ఇతర పట్టు రైతులకు ఈ ఏడాది రాయితీలిచ్చేందుకు రూ.25 కోట్ల వరకు ఖర్చుచేయడానికి కార్యాచరణను సిద్ధంచేసింది. ఈనాడు ఆరోపణల్లో నిజంలేదు.. పట్టు రైతులకు కుచ్చుటోపీ అంటూ ఈనాడు కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ధరలు పడిపోయాయని, రైతులకు, రీలర్లకు ప్రోత్సాహకాలు, క్రిమిసంహాకర మందులకయ్యే వ్యయాన్ని నిలిపి వేసిందనడంలో ఎలాంటి వాస్తవంలేదు. నిజాలు తెలుసుకోకుండా బురద జల్లడం ఈనాడుకు సరికాదు. – డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, పట్టు శాఖ -
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. పెళ్లిళ్లు, ఇటు పండగల సీజన్‌తో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ.50 పెరిగి రూ.57,870 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.600 పెరిగి.. ప్రస్తుతం రూ.66,540 వద్ద ఉంది. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.57,870గా ఉంది. కిలో వెండి ధర రూ.66,540 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ రూ.52,430 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200 కి చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,750 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,450 కి చేరింది. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,870 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,540గా ఉంది. వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,870 గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,540 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.51,900 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధరరూ.56,600 గా నమోదైంది. బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 51,800 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,500 గా ఉంది. మైసూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 51,800 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500 గా ఉంది. పుణెలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 51,750 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,450 గా ఉంది. -
పుతిన్‌తో పెట్టుకుంటే అంతే!.. ఆ దేశాలకు చమురు ఎగుమతులు బంద్
మాస్కో: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేస్తున్న రష్యాను కట్టడి చేసేందుకు పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. రష్యాకు ప్రధాన వనరుగా ఉన్న చమురు ఉత్పత్తులపై ప్రైస్క్యాప్ విధించి ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయి. అయితే, తాజాగా ఆయా దేశాలకు గట్టి షాక్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పశ్చిమ దేశాల ప్రైస్ క్యాప్‌కు కౌంటర్ ఇవ్వాలని సుదీర్ఘ కాలంగా భావిస్తున్న పుతిన్ తాజాగా ఆ దిశగా అడుగు వేశారు. ప్రైస్ క్యాప్ విధించిన దేశాలకు చమురు, చమురు ఉత్పత్తులను ఎగుమతి చేయకూడదనే ఆదేశాలపై సంతకం చేశారు. ఈ నిర్ణయం వచ్చే ఏడాది జులై వరకు అమలులో ఉండనుంది. ఐరోపా సమాఖ్యలోని ఏడు పెద్ద దేశాలు, ఆస్ట్రేలియాలు రష్యా సముద్రం నుంచి ఉత్పత్తి చేస్తున్న ఆయిల్‌పై ప్రైస్ క్యాప్‌ను బ్యారెల్‌కు 60 డాలర్లుగా నిర్ణయించాయి. దానిని డిసెంబర్ 5 నుంచి అమలులోకి తీసుకొచ్చాయి. ఈ నిర్ణయానికి తాజాగా కౌంటర్ ఇచ్చింది క్రెమ్లిన్. చమురు ఎగుమతులను నిలిపివేస్తూ తీసుకొచ్చిన ఆదేశాలు 2023 ఫిబ్రవరి 1 నుంచి జులై 1 2023 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం ముడి చమురు ఎగుమతులపై నిషేదం ఫిబ్రవరి 1 నుంచే అమలులోకి వస్తుండగా.. చమురు ఉత్పత్తులపై బ్యాన్ ఎప్పటి నుంచి ఉంటుందనే విషయాన్ని రష్యా ప్రభుత్వం వెల్లడించలేదు. మరోవైపు.. ఈ ఆదేశాల్లో ప్రత్యేక క్లాజ్‌ను ఏర్పాటు చేసింది రష్యా ప్రభుత్వం. ప్రత్యేకమైన సందర్భంలో ఈ బ్యాన్‌ను అధ్యక్షుడు పుతిన్ ఎత్తివేసే అవకాశం కల్పించింది. ఇదీ చదవండి: అమెరికాలోని ఎంబసీ ఆస్తులను అమ్మకానికి పెట్టిన పాకిస్థాన్ -
ఫెడ్ భారీ ‘వడ్డిం‘పు
న్యూయార్క్: ధరల అదుపే లక్ష్యంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేటును 0.75 శాతంమేర పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 3–3.25 శాతానికి ఎగశాయి. వెరసి వరుసగా మూడోసారి రేట్లను పెంచింది. గత నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణ కట్టడికే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) ప్రాధాన్యత ఇచ్చినట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు. కాగా.. కరోనా మహమ్మారి కాలంలో 9 ట్రిలియన్ డాలర్లకు చేరిన బ్యాలెన్స్‌షీట్‌ను తగ్గించేందుకు ఫెడ్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు జూన్ నుంచి నెలకు 95 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను రోలాఫ్ చేయడం ద్వారా లిక్విడిటీలో కోత పెడుతోంది. ఈ నేపథ్యంలో డాలరు ఇండెక్స్ 110ను అధిగమించగా.. ట్రెజరీ ఈల్డ్స్ 3.56 శాతాన్ని తాకాయి. అయితే 2022 జనవరి–మార్చిలో 1.6 శాతం క్షీణించిన యూఎస్ జీడీపీ ఏప్రిల్–జూన్‌లోనూ 0.6 శాతం నీరసించింది. దీంతో ఆర్థిక మాంద్య భయాలు తలెత్తినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
తక్కువ రేటుకే టమాటా...టమోటో ధరలకు ఏపీ ప్రభుత్వం కళ్లెం
-
మాస్కులు, శానిటైజర్ల ధరలపై హెల్ప్‌లైన్
న్యూఢిల్లీ: మాస్కులు, శానిటైజర్ల ధరల నియంత్రణకు జారీ చేసిన నోటిఫికేషన్ తు.చ. తప్పకుండా అమలయ్యేలా హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చి, వాటిపై ప్రచారం కల్పిస్తామని కేంద్రం తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో మాస్కులు, శానిటైజర్ల ధరలను దుకాణదారులు భారీగా పెంచడంపై ‘జస్టిస్ ఫర్ రైట్స్ ఫౌండేషన్’అనే ఎన్జీవో వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. శానిటైజర్లు, లిక్విడ్ సోప్, మాస్కుల ధరల నియంత్రణకు జారీ చేసిన ఆదేశాలు అమలుకాని సందర్భాల్లో ప్రజలు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా కేంద్రం తెలిపింది.(9 గంటలకు.. 9 నిమిషాల పాటు) అదేవిధంగా, పౌరులందరికీ కోవిడ్ పరీక్షలు ఉచితంగా జరిపించాలంటూ దాఖలైన పిల్, వలస కార్మికులకు కేంద్రమే వేతనం చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం కేంద్రం వివరణ కోరింది. రిసార్టులు, హోటళ్లను షెల్టర్లుగా మార్చి, వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లకుండా ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన మరో పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. కాగా, కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసే వరకు ‘పిల్లు వేయడమే పనిగా పెట్టుకున్న వారి’పై లాక్డౌన్ విధించాలని కేంద్రం వ్యాఖ్యానించింది. యావత్ అధికార యంత్రాంగం తమ శక్తియుక్తులను కరోనాపై పోరుకు ధారపోస్తున్న ఈ కష్ట సమయంలో, ఏసీ గదుల్లో కూర్చున్న కొందరు వేసే పిల్ల కారణంగా అధికారులు విలువైన సమయాన్ని వృథా చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. (మందు తాగడం జీవన విధానం: బీజేపీ నేత ) -
ధరల నియంత్రణకు ఏం చేశారో చెప్పండి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజల భయాందోళనలను దుకాణదారులు సొమ్ము చేసుకుంటున్నారని, మాస్కులు, శానిటైజర్లు, లిక్విడ్ సోప్‌లను ఎంఆర్పీకి మించి అధిక ధరలకు అమ్ముతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు నిలదీసింది. ధరలను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఇరాన్‌లోని 250 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ యాత్రికులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇప్పటికే 500 మంది వెనక్కి తీసుకొచ్చామని గుర్తుచేసింది. ఇంకా 250 మంది అక్కడే ఉన్నారని పేర్కొంది. ఆ 250 మంది భారతీయులకు కరోనా పాజిటవ్ ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని, వారు అక్కడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. రక్షణ పరికరాలపై వివరణ ఇవ్వండి కరోనా వైరస్ బాధతులకు వైద్య సేవలందించే డాక్టర్లకు, ఇతర సిబ్బందికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాలతో కూడిన రక్షణ పరికరాలు అందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన ఓ వైద్యుడి ఈ పిటిషన్ దాఖలు చేశారు. కరోనా బాధితులకు వైద్యం చేసేవారికి డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల మేరకు రక్షణ పరికరాలు సరఫరా చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఆ పిటిషన్‌పై రెండు వారాల తర్వాతే విచారణ దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై రెండు వారాల విచారణ చేపతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ స్తంభించిందని సెంటర్ అకౌంటబిలిటీ, సిస్టమిక్ ఛేంజ్(సీఏఎస్‌సీ) అనే సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
కేన్సర్ ఔషధాల ధరలకు కళ్లెం
న్యూఢిల్లీ: కేన్సర్ చికిత్సల్లో వినియోగించే నాన్ షెడ్యూల్డ్ విభాగంలోని 42 ఔషధాలను ధరల నియంత్రణల విధానంలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఔషధాల విక్రయ ధరలపై 30 శాతం మార్జిన్‌ను గరిష్ట పరిమితిగా విధించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జాతీయ ఫార్మాస్యూటికల్ ధరల నిర్ణాయక మండలి (ఎన్పీపీఏ) ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఔషధ విభాగం తన ప్రకటన ద్వారా తెలియజేసింది. ‘‘ఔషధ చట్టం 2013లోని పారాగ్రాఫ్ 19 కింద ప్రభుత్వం ఇకపై వ్యాపార మార్జిన్‌ను 30 శాతంగా నిర్ణయించింది. ఈ మేరకు నాన్ షెడ్యూల్డ్ విభాగంలోని 42 ఔషధాలపై మార్జిన్‌ను ఖరారు చేయాలని తయారీదారులకు ఆదేశించడం జరిగింది’’ అని ఫార్మాస్యూటికల్స్ విభాగం తన నోటిఫికేషన్లో పేర్కొంది. 105 బ్రాండ్ల ధరలు 85% వరకు తగ్గనున్నాయని, ఫలితంగా వినియోగదారులకు రూ.105 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని తెలిపింది. -
ధరలను తగ్గించకుంటే మోదీకి కష్టమే
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న ధరలను అదుపు చేయకపోతే వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఆదివారం హెచ్చరించారు. 2014లో మాదిరి వచ్చే సాధారణ ఎన్నికల్లో మోదీకి అనుకూలంగా, బీజీపీ తరఫున తాను ప్రచారం చేయననీ స్పష్టం చేశారు. అయితే అన్ని పార్టీలూ తనకు సమానమేననీ, రాజకీయాల్లో తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు రామ్‌దేవ్ చెప్పారు. ‘మోదీ ప్రభుత్వ విధానాలను ఎందరో పొగుడుతున్నారు. కానీ వాటిలో కొన్నింటికి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ధరల పెరుగుదల ప్రధాన సమస్య. నియంత్రణ చర్యలకు ఉపక్రమించకపోతే మోదీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని రామ్‌దేవ్ అన్నారు. -
‘పెట్రో’ పరిష్కారంపై చర్చిస్తున్నాం
భువనేశ్వర్/ముంబై: పెట్రో ధరలు పెరగడంపై సత్వరమే ఓ పరిష్కారాన్ని కనుగొనేందుకు యత్నిస్తున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పెట్రో బాదుడు నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించే విషయమై ప్రభుత్వం విస్తృతంగా చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఆయన భువనేశ్వర్‌లో మాట్లాడారు. ‘పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించేందుకు వీటిని వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని పెట్రోలియం శాఖ యోచిస్తోంది. జీఎస్టీ పరిధిలోకి తెచ్చేలోపు ఈ సమస్యకు వెంటనే ఓ పరిష్కారం కనుగొనడంపై కేంద్రం చర్చిస్తోంది. పెట్రో ఉత్పత్తుల ధరల నియంత్రణలో కేంద్రంతో పాటు రాష్ట్రాల పాత్ర ఉంది’ అని అన్నారు. పెట్రో సమస్యపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్, వెనిజువెలా దేశాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్లే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయన్నారు. ప్రజలపై పెట్రోబాదుడుకు నిరసనగా ప్రతిపక్షాలు గురువారం దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న వ్యాట్, అమ్మకపు పన్నుల్ని రాష్ట్రాలు తగ్గించాలని నీతిఆయోగ్ సూచించింది. ఆర్థికలోటును కట్టడిచేయడం, ముడిచమురు ధరల ప్రభావాన్ని ఎదుర్కోవడం వంటి కీలక బాధ్యతలు కేంద్రంపై ఉన్నందున ఎక్సైజ్ సుంకాలు తగ్గించడం వీలుకాదని స్పష్టంచేసింది. -
ధరల అదుపు, ఉపాధి చేతకాకుంటే తప్పుకోండి
న్యూఢిల్లీ: దేశంలో ధరలను అదుపుచేసి ప్రజలకు ఉపాధి కల్పించలేకపోతే మాటలు ఆపి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ డిమాండ్ చేశారు. ‘వంట గ్యాస్, ఆహార పదార్థాలు ఖరీదైనవిగా మారాయి. మభ్యపెట్టే ప్రసంగాలు ఆపి ధరలు తగ్గించి ప్రజలకు ఉపాధి కల్పించండి. చేతకాకుంటే అధికారం నుంచి తప్పుకోండి’ అని ఆదివారం ట్వీట్ చేశారు.. మోదీ ‘మిత్రో’ అంటే ప్రజలు వణికిపోతున్నారు ధర్మశాల: íహిందీ చిత్రం ‘షోలే’లో విలన్ గబ్బర్ సింగ్ డైలాగుల్ని ప్రధాని మోదీ సంబోధించే మిత్రో(మిత్రులారా) అన్న పదంతో కాంగ్రెస్ పోల్చింది. ‘వాళ్లు ఎంతమంది ఉన్నారు? అని గబ్బర్ ప్రశ్నించగానే ప్రజలందరూ భయపడేవారు. ఇప్పుడు కూడా మోదీ టీవీ ముందుకొచ్చి మిత్రో(మిత్రులారా) అనగానే తర్వాత ఏం జరుగుతుందో అన్న భయంతో జనాలు వణికిపోతున్నారు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఎద్దేవా చేశారు. -
జీఎస్టీతో ధరలెలా తగ్గుతాయంటే...
సాక్షి,న్యూఢిల్లీ: జీఎస్టీ అమలు కారణంగా ధరల దెబ్బతో సామాన్యుడు విలవిలలాడుతుంటే నూతన పన్ను చట్టం ద్వారా ధరలు తగ్గుతాయని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.జీఎస్టీతో వస్తువుల ధరలు తగ్గి పేదలు, మధ్యతరగతికి మేలు జరుగుతుందని ప్రధాని అన్నారు. జీఎస్టీ దేశానికి నూతన వ్యాపార సంస్కృతిని తీసుకువచ్చి వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు.తూర్పు, దక్షిణాసియాలో వినియోగదారుల పరిరక్షణపై అంతర్జాతీయ సదస్సును ప్రారంభిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ అమలు ఫలితంగా కంపెనీల మధ్య పోటీతత్వం పెరిగి ధరలు దిగివస్తాయని ప్రదాని విశ్లేషించారు. జీఎస్టీతో పాటు వినియోగదారుల హక్కుల పరిరక్షణ తమ ప్రభుత్వ ప్రాధాన్యాలుగా ఉంటాయని స్పష్టం చేశారు. ధరల పెరుగుదలకు చెక్ పెట్టడంతో పాటు వినియోగదారుల డబ్బు ఆదా అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. నూతన వినియోగదారుల పరిరక్షణ చట్టంలో వినియోగదారుల సాధికారతే ప్రధాన అజెండాగా ఉంటుందని,వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రకటనలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. -
నిత్యావసర ధరలు నియంత్రణలో ఉండాలి
– అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్ : నిత్యావసర సరుకుల ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశించారు. శుక్రవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు ఇష్టానుసార ధరలకు విక్రయించకుండా మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. కందిబేడలు కిలో రూ.100 వరకు ఉందని, ఇంతకు మించి విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహార కల్తీపై కూడా నిఘా పెట్టాలన్నారు. దాడులు నిర్వహించి ఎక్కడైనా కల్తీకి పాల్పడుతున్నట్లు గుర్తిస్తే తక్షణం కేసులు నమోదు చేయాలని చెప్పారు. జిల్లా కేంద్రంలోని ఎనిమిది ప్రభుత్వ వసతి గహాలకు రైతు బజార్ నుంచి కూరగాయలు, ఆకుకూరలు కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అక్రమ నిలువలపై విజిలెన్స్, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ –క్రాప్ బుకింగ్ చేయాలి జిల్లాలో ఈ – క్రాప్ బుకింగ్ వంద శాతం చేయాలని మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓ, ఎంపీఓలను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం ఎన్ఐసీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 4లోపు ఈ–క్రాప్ బుక్కింగ్ వంద శాతం పూర్తి చేయాలన్నారు. -
పది ఔషధాల ధర తగ్గింపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా పది ఔషధాల ధరలను తగ్గించింది. అలాగే మరో ఎనిమిదికి పైగా ఔషధాలను ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకువచ్చింది. ఔషధ ధరలపై నియంత్రణ ఉంచాలని ప్రభుత్వం గతంలోనే ఒక నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఎన్పీపీఏ తాజాగా పదికి పైగా మందుల ధరలను 4.8-23.3% మధ్యలో తగ్గించింది. అలాగే ఇది తొలిసారి పారాసిటమాల్ సహా పలు యాంటీ బయాటిక్స్‌ను ధరల నియంత్రణ పరిధిలోకి తెచ్చింది. వీలైనంత త్వరగా దాదాపు 800కు పైగా ఔషధాలను ధరల నియంత్రణ పరిధిలోకి తెస్తామని ఎన్పీపీఏ చైర్మన్ భుపేంద్ర సింగ్ తెలిపారు. ప్రస్తుతం కేంద్రం 467 ఔషధాలను ధరల నియంత్రణ పరిధిలో ఉంచింది. తప్పనిసరి ఔషధాల జాబితాలో 900 మందులు ఉన్నాయి. -
ధరల నియంత్రణకు సీపీఎం ర్యాలీ
పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను ప్రభుత్వం నియంత్రించాలని సీపీఎం నాయకులు పార్వతీపురం మెయిన్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. రేషన్ డిపోల ద్వారా కందిపప్పు, మినపప్పు, నూనె అందించాలని, ఆహార భద్రతా చట్టం కఠినంగా అమలు చేయాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్ట పరచాలని డిమాండ్ చేశారు. ఈ-పాస్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే రేషన్ సరుకులు ఇవ్వాలని కోరారు. -
ధరలు వెంటనే తగ్గించండి: సీఎస్
తెలంగాణలో నిత్యావసరాల ధరలను వెంటనే అదుపులోకి తేవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. ధరల నియంత్రణపై శుక్రవారం ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఇతర అధికారులు హాజరయ్యారు. అవసరం మేరకు ఉల్లిని సేకరించి రైతు బజార్లలో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. పప్పు దినుసుల ధరల పెంపును అదుపులో ఉంచాలని తెలిపారు. నిత్యావసరాలను బ్లాక్‌మార్కెట్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
డీజిల్‌పై నియంత్రణ ఎత్తివేత
లీటర్‌కు రూ. 3.37 తగ్గిన ధర శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి.. ఇకపై అంతర్జాతీయ ధరలకు తగ్గట్టు ధర సహజవాయువు ధర 46 శాతం పెంపు కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా తగ్గడం, చమురు కంపెనీలు లాభాల బాటలోకి ప్రవేశించడంతో డీజిల్ ధరలపై నియంత్రణను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎత్తేసింది. దీంతో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా లీటర్ డీజిల్‌పై రూ. 3.37 పైసలు ధర తగ్గింది. కొత్త ధర శనివారం అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు శనివారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీ అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విలేకరులతో మాట్లాడుతూ.. డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తేయాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయించినట్టు చెప్పారు. దీనివల్ల సామాన్యులపై ఎటువంటి భారం పడబోదన్నారు. డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తేయడంతో వచ్చే నెల నుంచి అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా డీజిల్ ధరలు ఉండబోతున్నాయి. సవరించిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 58.97 నుంచి రూ. 55.60కి తగ్గింది. హైదరాబాద్‌లో రూ. 64.27 నుంచి రూ. 60.60కు, వరంగల్‌లో రూ. 63.90 నుంచి రూ. 60.24 కు తగ్గింది. ఐదేళ్లలో ఇదే తొలిసారి.. ఐదేళ్ల కాలంలో డీజిల్ ధరలను తగ్గించడం ఇదే తొలిసారి. ఆఖరిసారిగా 2009 జనవరి 29న డీజిల్ ధరను రూ. 2 మేరకు ప్రభుత్వం తగ్గించింది. ఈ ఏడాది సెప్టెంబర్1న చివరిసారిగా డీజిల్ ధరను 50 పైసల చొప్పున పెంచారు. 2013 జనవరి నుంచి ఇప్పటి వరకూ 19 సార్లు డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పడిపోవడంతో పాటు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తికావడంతో డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర సుమారు 25 శాతం తగ్గి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 83 డాలర్లకు పరిమితమైంది. ఇప్పట్లో ఇది వంద డాలర్లను దాటే అవకాశం లేదని పరిశ్రమ వర్గాల అంచనా. 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం పెట్రోల్ ధరలపై నియంత్రణను ఎత్తివేసింది. గత ఏడాది జనవరిలో ప్రతినెలా 50 పైసల చొప్పున డీజిల్ ధరను పెంచాలని నిర్ణయించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ ఐదు సార్లు పెట్రోల్ ధరలు తగ్గాయి. దీంతో రెండు నెలల్లోనే పెట్రోల్ ధర రూ. 7 మేరకు తగ్గింది. డీజిల్ విషయానికి వస్తే సెప్టెంబర్ రెండో వారం నాటికే కంపెనీలు నష్టాల నుంచి గట్టెక్కాయి. లీటర్‌కు రూ. 3.56 చొప్పున డీజిల్‌పై లాభాలను ఆర్జిస్తున్నాయి. తాజాగా డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేయడంతో ఇకపై ప్రభుత్వం లేదా ప్రభుత్వ చమురు సంస్థలు డీజిల్‌పై ఎలాంటి సబ్సిడీని అందించవు. డీజిల్ ధరల నుంచి చమురు కంపెనీలకు ఉపశమనం లభించినా కిరోసిన్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై మాత్రం నష్టాలు కొనసాగుతున్నాయి. లీటర్ కిరోసిన్‌పై రూ. 31.22, 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 404.64 చొప్పున కంపెనీలు నష్టపోతునున్నాయి. పెరిగిన సహజవాయువు ధర...మరోవైపు సహజవాయువు ధరను 46 శాతం పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం 4.2 డాలర్లుగా ఉన్న సహజవాయువు ధర నవంబర్ 1 నుంచి 6.17 డాలర్లకు చేరనుంది. ఈ గ్యాస్ ధరను రెట్టింపు చేయాలన్న రంగరాజన్ కమిటీ సిఫార్సుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆమోదించినా ఎన్డీఏ ప్రభుత్వం పక్కన పెట్టి, కొత్త ఫార్ములా కింద ధర నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ, ముఖేష్ అంబాని నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)ఉత్పత్తి చేసే గ్యాస్ ధరను ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వం సమీక్షించనుంది. దీనిపై తదుపరి సమీక్ష వచ్చే ఏడాది ఏప్రిల్ 1న చేపడుతుంది. సహజవాయువు ధరను పెంచడంతో సీఎన్జీ ధర కేజీకి రూ. 4.25 చొప్పున, పైప్‌లైన్ ద్వారా సరఫరా అయ్యే వంట గ్యాస్ ధర రూ. 2.60 చొప్పున పెరగనుంది. కాగా గ్యాస్ ఆధారిత విద్యుత్, ఆహార పదార్థాల ధరలు పెరగనున్నాయి. కేజీ డీ6లోని ధీరుబాయ్ అంబానీ 1, 3 గ్యాస్ ఫీల్డ్స్‌లో ఉత్పత్తి తక్కువగా ఉన్నందున ఆర్ఐఎల్ కొత్త గ్యాస్ ధరను పొందలేదు. ఆర్ఐఎల్ కస్టమర్లు కొత్త ధరను చెల్లించినా.. ఆర్ఐఎల్కు 4.2 డాలర్లు మాత్రమే చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని గెయిల్ నేతృత్వంలోని గ్యాస్ పూల్ ఖాతాలో జమ చేస్తారు. నిబంధనల మేరకు గ్యాస్‌ను ఉత్పత్తి చేసిన తర్వాత మాత్రమే ఆర్ఐఎల్ కొత్త ధరను పొందగలుగుతుంది.మరోవైపు ఢిల్లీలోని ప్రభుత్వ భవనాలను స్మారక చిహ్నాలుగా మార్చరాదని కేంద్రం నిర్ణయించింది. ఆర్ఎల్డీ చీఫ్ అజిత్‌సింగ్ తన తండ్రి, మాజీ ప్రధాని చరణ్‌సింగ్ నివసించిన బంగళాను స్మారక చిహ్నంగా మార్చాలని ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. మహాత్మా గాంధీ జయంతి, వ ర్ధంతి వేడుకలను ఇకపై కేంద్రమే నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. మళ్లీ నగదు బదిలీ.. యూపీఏ హయాంలో అమలు చేసిన వంట గ్యాస్‌కు నగదు బదిలీని తిరిగి అమలు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. నవంబర్ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 1 వరకూ దేశంలోని 54 జిల్లాల్లో వంట గ్యాస్‌కు నగదు బదిలీని అమలు చేయనున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. పాత పథకంలో ఉన్న లోపాలను సవరించి తొలి దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు గోవా, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో దీనిని అమలు చేయనున్నారు. ఆధార్‌కార్డు లేకపోయినా బ్యాంకు ఖాతాలు ఉన్న వారందరికీ నేరుగా నగదు బదిలీ చేస్తామని జైట్లీ చెప్పారు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా లేని వారికి మాత్రం కొంత కాలం పాటు పాత పద్ధతిలోనే గ్యాస్ సరఫరా చేస్తామని చెప్పారు. వంట గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. జనధన యోజన పథకం కింద ఇప్పటి వరకూ 6.02 కోట్ల బ్యాంకు ఖాతాలు ప్రారంభించినట్టు చెప్పారు. -
డీరెగ్యులేషన్‌కి మరింత చేరువగా డీజిల్ రేట్లు
కొనుగోలు, రిటైల్ అమ్మకం ధరలకు మధ్య భారీగా తగ్గిన వ్యత్యాసం న్యూఢిల్లీ: డీజిల్ అమ్మకాలపై చమురు మార్కెటింగ్ సంస్థల ఆదాయ నష్టాలు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో ధరల నియంత్రణ ఎత్తివేత (డీరెగ్యులేషన్) మరింత వేగిరం కానుంది. వాస్తవ ధర, రిటైల్ అమ్మకపు ధర మధ్య వ్యత్యాసం ప్రస్తుతం 8 పైసలకు తగ్గిపోవడం ఇందుకు తోడ్పడనుంది. కొనుగోలు, రిటైల్ అమ్మకపు ధరల మధ్య వ్యత్యాసం ఇంత తక్కువ స్థాయికి దిగి రావడం దశాబ్ద కాలంలో ఇదే తొలిసారని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. నెలవారీగా డీజిల్ రేటు పెంచుతూ పోవడం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుండటం దీనికి తోడ్పడినట్లు వివరించింది. ఇదే ధోరణి కొనసాగితే.. వచ్చే వారం కల్లా డీజిల్ ధరలు అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ఉంటాయి. అదే జరిగితే ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని కొనసాగిస్తూ అక్టోబర్ 1న ధరను మరో అర్ధ రూపాయి (లీటరుకు) పెంచాల్సిన అవసరం రాదు. నష్టాలను తగ్గించుకునే ఉద్దేశంతో 2013 జనవరి నుంచి డీజిల్ రేట్లను ప్రతి నెలా లీటరుకు 50 పైసల చొప్పున పెంచుతున్న సంగతి తెలిసిందే. దీంతో 19 విడతల్లో రేటు రూ.11.81 మేర పెరిగింది. నియంత్రణ ఎత్తివేతకు సరైన సమయం: డీజిల్ రేట్లను నిర్ణయించుకునేందుకు చమురు కంపెనీలకు (ఓఎంసీ) స్వేచ్ఛనివ్వడానికి ఇదే సరైన సమయం అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీని వల్ల ఓఎంసీల క్రెడిట్ రేటింగ్ మెరుగుపడగలదని ఇండియా రేటింగ్స్ తెలిపింది. ప్రభుత్వం కూడా ఆర్థిక క్రమశిక్షణ లక్ష్యాలను సాధించడానికి ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. డీజిల్ ధరలు.. మార్కెట్ రేట్ల స్థాయికి చేరడం పెట్రోలియం రంగానికి సానుకూలాంశమని ఐసీఆర్ఏ వివరించింది. మరోవైపు, సబ్సిడీల భారాన్ని ప్రభుత్వం, చమురు ఉత్పత్తి సంస్థలు (ఓఎన్జీసీ, ఓఐఎల్) చెరి సగం పంచుకోవాలన్న ప్రభుత్వ ప్రతిపాదన చమురు సంస్థలకు సానుకూలమని మూడీస్ తెలిపింది. ఇది అమలైతే ఓఎన్జీసీ, ఓఐఎల్ ఇంధన సబ్సిడీల భారం దాదాపు 36 శాతం.. అంటే సుమారు రూ. 22,000 కోట్ల మేర తగ్గుతుందని వివరించింది. దీంతో ఆయా కంపెనీల లాభదాయకత కూడా పెరగగలదని పేర్కొంది. -
కూరగాయల ధరల నియంత్రణకు కృషి
విజయవాడ రూరల్ : జిల్లాలోని రైతుబజార్లలో కూరగాయల ధరలను నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ రైతుబజార్స్ ఎంకే సింగ్ అధికారులను ఆదేశించారు. గొల్లపూడి మార్కెట్‌యార్డులో జిల్లాలోని 17 రైతుబజార్ల ఏస్టేట్ అధికారులు ఆర్డీడీ ,డీఈ, ఏఈలు హార్టికల్చర్ ఏఈలతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు లేని కారణంగా కూరగాయల ఉత్పత్తి తక్కువగా వుందని వాటి ధరలు అదుపు చేసి వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఉల్లిపాయల ధరలు ఎక్కువగా వున్నందున వాటిని వీలయినంత తక్కువ ధరకు రైతు బజార్లలో విక్రయించాలన్నారు. అన్ని రైతుబజార్లలో కంప్యూటర్స్, మైక్, తాగునీటి వసతులు కల్పించాలని చెప్పారు. అసంపూర్తిగాఉన్న నిర్మాణాలను పూర్తి చేసి విద్యుద్దీకరణ చేయిం చాల్సిందిగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను ఆదేశించారు. ఈ పనులకు ఆయా బజార్ల పరిధిలోని మార్కెట్ కమిటీల నిధుల నుంచి కేటాయించాలన్నారు. హార్టికల్చర్ సహాయ సంచాలకులు రైతులకు ఇస్తున్న సబ్సిడీ విత్తనాల గురించి తెలియజేయానికి రైతుబజార్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచిం చారు. డిమాండ్‌కు సరిపడా కూరగాయలు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. గ్రామాల్లో రైతులను సంఘాలుగా ఏర్పాటుచేసి వాటిద్వారా కూరగాయలు రైతు బజారుకు సరఫరా చేయడానికి క్లస్టర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ డెప్యూటీ డెరైక్టర్ దివాకర్, డీఈ ప్రసాద్, ఎస్టేట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
ఈ ‘ధర’ణిలో బతికేదెలా!
- కిలో రూ.30 నుంచి రూ.40కి పెరిగిన సన్నబియ్యం - మండుతున్న కూరగాయల ధరలు - ఒక్కసారిగా రూ.100 పెరిగిన సిమెంట్ - మార్కెట్ అంటే జంకుతున్న సామాన్యులు - ధరల నియంత్రణలో అధికారులు విఫలం ఒంగోలు టూటౌన్: ధరలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. సామాన్యులు కొనలేని స్థితికి చేరుకుంటున్నాయి. మార్కెట్‌కు వెళ్లాలంటే పేద, మధ్యతరగతి ప్రజలు జంకుతున్నారు. నెల రోజులుగాఅన్ని వస్తువుల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల పెరిగిన కొన్ని వస్తువుల ధరలు చూస్తే గుండె గుభేల్మంటోంది. బియ్యం ధరలు అమాంతంగా పెరిగాయి. ప్రజలు ఎక్కువగా వాడే సన్నబియ్యం, లావు బియ్యం ధరలు వినియోగదారులకు మార్కెట్లో చుక్కలు చూపిస్తున్నాయి. బియ్యం ధరలు పెరిగిందిలా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సన్నబియ్యం(బీపీటీలు) కిలో రూ.30 నుంచి రూ.35 ఉంటే ఇప్పుడు కిలో రూ.40 పలుకుతోంది. అదే విధంగా లావు బియ్యం 25 కిలోల బ్యాగ్ రూ.1050 పెరిగింది. కిలో రూ.40 పైనే పెరిగింది. బియ్యం వ్యాపారులు అక్రమ నిల్వలు సృష్టించి ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క రైస్ షాపుల వద్ద 250 క్వింటాళ్ల కంటే అదనంగా బియ్యం నిల్వలు ఉండకూడదు. వ్యాపారులు నిబంధనలు అతిక్రమించి అధికంగా కొని అక్రమ నిల్వలకు పాల్పడుతుండటంతో బియ్యం ధరలు పెరుగుతున్నాయి. సివిల్ సప్లై ఉదాసీనంగా వ్యవహరించడంతో వ్యాపారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మండుతున్న కూరగాయల ధరలు : కూరగాయల సాగు విస్తీర్ణం రానురానూ తగ్గిపోతుండటంతో కూరగాయల ధరలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అరకొరగా సాగు చేసిన కూరగాయల పంటలకు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు కరువై.. చీడపీడల బెడదతో పంటలను అర్ధాంతరంగా వదిలేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ ఏడాది వాతావరణం అనుకూలించక వంగతోటలు చీడపీడలకు గురై రైతుకు నష్టాలను మిగిల్చాయి. మార్కెట్లో కూరగాయల ధరలు రెండు నెలలుగా మండుతున్నాయి. గతంలో కేజీ రూ.10 నుంచి రూ.12 వరకు అమ్మిన వంకాయలు ఇప్పుడు డిమాండ్‌ను బట్టి రూ.24 వరకు పలుకుతోంది. ఒక దశలో రూ.40 పెరిగింది. అదే విధంగా క్యారెట్ రూ.24 ఉండగా.. కిలో రూ.60 చేరింది. రూ.40 అమ్మిన చిక్కుళ్లు రూ.80 చేరి వామ్మో అనిపిస్తోంది. కాలీఫ్లవర్ పువ్వు ఒకటి రూ.10 నుంచి రూ.15 ఉండగా ఇప్పుడు రూ.25 వరకు అమ్ముతున్నారు. బీర కిలో రూ.20 నుంచి రూ.30, బీట్రూట్ రూ.22 నుంచి రూ.25 నుంచి రూ.30 వరకు అమ్ముతున్నారు. మిర్చి రూ.14 నుంచి రూ.20 చేరింది. దోసకాయలు రూ.5 నుంచి రూ.10 చేరింది. పెద్దఉల్లి రూ.12 నుంచి రూ.18 పెరిగింది. దొండ కాయలు కిలో రూ.14 నుంచి రూ.20 పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కూరగాయల ధరలతోపాటు ఆకుకూరలైన గోంగూర, పెరుగు ఆకు, తోటకూర వంటి వాటికి కూడా ధరలు పెరిగాయి. గతనెలలో కేజీ ఉల్లిపాయల ధర రూ.12 నుంచి రూ15 వరకు ఉండగా ప్రస్తుతం రూ 30 లు పలుకుతోంది. పాలధరలు... పాలధరలు అమాంతంగా పెరిగాయి. లీటర్ రూ.42 నుంచి రూ.46 పెరిగింది. గతంలో లీటరు పాలు కొనే వారు ఇప్పుడు అరలీటరు కొనుక్కొని సర్దుకుంటున్నారు. పేద, మధ్య తరగతి వినియోగదారులు చాలమంది పాలనే కొనుక్కోవడం మానేయాల్సి వచ్చింది. పెరుగు, వెన్న ధరలు పెంచేశారు. కొండెక్కిన సిమెంట్ ధరలు : సిమెంట్ మంట పుట్టిస్తోంది. బస్తాపై రెండు సార్లు ధర పెరిగింది. గతంలో రూ.200 నుంచి రూ.210 ఉన్న సిమెంట్ ధరలు ఇప్పుడు రూ.300 నుంచి రూ.310 పెరిగింది. ధరలు పెరుగుతున్న సంగతి ముందే తెలుసుకొని పాత ధరలకు అధిక మొత్తంలో కొని నిల్వలు చేసుకున్నారు. ఇప్పుడు కొత్త ధరలకు అమ్మి వినియోగదారుల నెత్తిన శఠగోపం పెడుతున్నారు. పెరిగిన ధరల ఫలితంగా జిల్లాలో నెలకు 50 వేల టన్నుల అమ్మకాలు జరిగిన వ్యాపారం ఇప్పుడు 40 వేల టన్నులకు పడిపోయింది. అయినా ఇళ్లు కట్టుకునే పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా పరిణమించింది. మార్కెట్లో ధరలు ఒకదాని ప్రభావం ఇంకొక వస్తువు పడి భారంగా పరిణమించాయి. టీ రూ.5 నుంచి రూ.7 పెంచారు. కాఫీ రూ.8 అమ్ముతున్నారు. అల్పాహారాల ధరలూ పెరిగిపోయాయి. ధరల అదుపునకు ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.