ధరలు వెంటనే తగ్గించండి: సీఎస్
తెలంగాణలో నిత్యావసరాల ధరలను వెంటనే అదుపులోకి తేవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. ధరల నియంత్రణపై శుక్రవారం ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఇతర అధికారులు హాజరయ్యారు.
అవసరం మేరకు ఉల్లిని సేకరించి రైతు బజార్లలో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. పప్పు దినుసుల ధరల పెంపును అదుపులో ఉంచాలని తెలిపారు. నిత్యావసరాలను బ్లాక్మార్కెట్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.