
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న ధరలను అదుపు చేయకపోతే వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఆదివారం హెచ్చరించారు. 2014లో మాదిరి వచ్చే సాధారణ ఎన్నికల్లో మోదీకి అనుకూలంగా, బీజీపీ తరఫున తాను ప్రచారం చేయననీ స్పష్టం చేశారు. అయితే అన్ని పార్టీలూ తనకు సమానమేననీ, రాజకీయాల్లో తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు రామ్‌దేవ్ చెప్పారు. ‘మోదీ ప్రభుత్వ విధానాలను ఎందరో పొగుడుతున్నారు. కానీ వాటిలో కొన్నింటికి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ధరల పెరుగుదల ప్రధాన సమస్య. నియంత్రణ చర్యలకు ఉపక్రమించకపోతే మోదీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని రామ్‌దేవ్ అన్నారు.