పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను ప్రభుత్వం నియంత్రించాలని సీపీఎం నాయకులు పార్వతీపురం మెయిన్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. రేషన్ డిపోల ద్వారా కందిపప్పు, మినపప్పు, నూనె అందించాలని, ఆహార భద్రతా చట్టం కఠినంగా అమలు చేయాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్ట పరచాలని డిమాండ్ చేశారు. ఈ-పాస్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే రేషన్ సరుకులు ఇవ్వాలని కోరారు.