E- PASS
-
ధరల నియంత్రణకు సీపీఎం ర్యాలీ
పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను ప్రభుత్వం నియంత్రించాలని సీపీఎం నాయకులు పార్వతీపురం మెయిన్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. రేషన్ డిపోల ద్వారా కందిపప్పు, మినపప్పు, నూనె అందించాలని, ఆహార భద్రతా చట్టం కఠినంగా అమలు చేయాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్ట పరచాలని డిమాండ్ చేశారు. ఈ-పాస్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే రేషన్ సరుకులు ఇవ్వాలని కోరారు. -
రేషన్‌కార్డుల్లో అవినీతిని అరికట్టేందుకు 'ఈ-పాస్'
రాజమండ్రి: రాష్ట్రంలో రేషన్‌కార్డుల్లో అవినీతిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. అందుకోసం కొత్తగా ఈ-పాస్ విధానం అమల్లోకి తెస్తున్నామన్నారు. ఈ విధానం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా తూర్పు గోదావరి జిల్లాను ఎంపిక చేసినట్లు ఆమె వివరించారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రి వచ్చిన సునీత విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 5 లక్షల దీపం కనెక్షన్లు మంజూరు చేసినట్లు సునీత తెలిపారు. రాష్ట్రంలో మొబైల్ వాహానాల ద్వారా ఆధార్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు చెప్పారు. సంక్షేమ పథకాలన్నీ ఆధార్ కార్డులతో అనుసంధానం చేస్తున్నామని అందుకోసం ఈ ప్రక్రియను త్వరలో ఆచరణలో పెడుతున్నట్లు పేర్కొన్నారు దాన్యం కొనుగోలు విషయంలో రైతులు లాభపడే విధంగా చర్యలు తీసుకుంటామని సునీత రైతులకు భరోసా ఇచ్చారు.