సాక్షి,న్యూఢిల్లీ: జీఎస్‌టీ అమలు కారణంగా ధరల దెబ్బతో సామాన్యుడు విలవిలలాడుతుంటే నూతన పన్ను చట్టం ద్వారా ధరలు తగ్గుతాయని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.జీఎస్‌టీతో వస్తువుల ధరలు తగ్గి పేదలు, మధ్యతరగతికి మేలు జరుగుతుందని ప్రధాని అన్నారు. జీఎస్‌టీ దేశానికి నూతన వ్యాపార సంస్కృతిని తీసుకువచ్చి వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు.తూర్పు, దక్షిణాసియాలో వినియోగదారుల పరిరక్షణపై అంతర్జాతీయ సదస్సును ప్రారంభిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
జీఎస్‌టీ అమలు ఫలితంగా కంపెనీల మధ్య పోటీతత్వం పెరిగి ధరలు దిగివస్తాయని ప్రదాని విశ్లేషించారు. జీఎస్‌టీతో పాటు వినియోగదారుల హక్కుల పరిరక్షణ తమ ప్రభుత్వ ప్రాధాన్యాలుగా ఉంటాయని స్పష్టం చేశారు. ధరల పెరుగుదలకు చెక్ పెట్టడంతో పాటు వినియోగదారుల డబ్బు ఆదా అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. నూతన వినియోగదారుల పరిరక్షణ చట్టంలో వినియోగదారుల సాధికారతే ప్రధాన అజెండాగా ఉంటుందని,వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రకటనలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment