
న్యూఢిల్లీ: దేశంలో ధరలను అదుపుచేసి ప్రజలకు ఉపాధి కల్పించలేకపోతే మాటలు ఆపి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ డిమాండ్ చేశారు. ‘వంట గ్యాస్, ఆహార పదార్థాలు ఖరీదైనవిగా మారాయి. మభ్యపెట్టే ప్రసంగాలు ఆపి ధరలు తగ్గించి ప్రజలకు ఉపాధి కల్పించండి. చేతకాకుంటే అధికారం నుంచి తప్పుకోండి’ అని ఆదివారం ట్వీట్ చేశారు..
మోదీ ‘మిత్రో’ అంటే ప్రజలు వణికిపోతున్నారు
ధర్మశాల:
íహిందీ చిత్రం ‘షోలే’లో విలన్ గబ్బర్ సింగ్ డైలాగుల్ని ప్రధాని మోదీ సంబోధించే మిత్రో(మిత్రులారా) అన్న పదంతో కాంగ్రెస్ పోల్చింది. ‘వాళ్లు ఎంతమంది ఉన్నారు? అని గబ్బర్ ప్రశ్నించగానే ప్రజలందరూ భయపడేవారు. ఇప్పుడు కూడా మోదీ టీవీ ముందుకొచ్చి మిత్రో(మిత్రులారా) అనగానే తర్వాత ఏం జరుగుతుందో అన్న భయంతో జనాలు వణికిపోతున్నారు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment