గవర్నర్ రఘురామ్ రాజన్ సంతకంతో త్వరలో రూ.10 కొత్త నోటు విడుదల కానుంది.
ముంబై: ఆర్ బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సంతకంతో త్వరలో రూ.10 కొత్త నోటు విడుదల కానుంది. మహాత్మాగాంధీ సిరీస్-2005లో ఈ నోటు విడుదల కానున్నట్లు సెంట్రల్ బ్యాంక్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. నంబరింగ్ ప్యానల్స్‌లో ‘ఏ’ అక్షరం ఉంటుంది. 2014, రూపాయి సింబల్ వంటివి కూడా కొత్త నోటుపై ముద్రితమవుతాయి.
ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.10 నోట్ల తరహాలోనే దీని డిజైనింగ్ కూడా ఉంటుంది. కాగా కొత్త నోటు విడుదలైన తరువాత కూడా ప్రస్తుత రూ.10 నోట్లన్నీ కూడా మార్కెట్‌లో చెల్లుబాటులో ఉంటాయని ప్రకటనలో ఆర్‌బీఐ తెలిపింది.