
సెంట్రల్ బ్యాంక్ వ్యాపార లక్ష్యం 5 లక్షల కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెంట్రల్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 5 లక్షల కోట్ల వ్యాపారాన్ని , రూ. 1,000 కోట్ల నికర లాభాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2014-15లో రూ. 4.5 లక్షల కోట్లుగా ఉన్న వ్యాపారం వచ్చే మార్చి నాటికి రూ. 5.07 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.కె.దివాకర్ తెలిపారు.