జపాన్ను తాకిన ట్రంప్ టోర్నడో | Japan govt, central bank to meet on market moves: BoJ | Sakshi
Sakshi News home page

జపాన్ను తాకిన ట్రంప్ టోర్నడో

Published Wed, Nov 9 2016 12:28 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

జపాన్ను తాకిన ట్రంప్ టోర్నడో

జపాన్ను తాకిన ట్రంప్ టోర్నడో

డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయంగా మారిపోతున్న పరిణామాలపై జపాన్ ప్రభుత్వం, ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ జపాన్ బుధవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశం కానున్నాయి.

టోక్యో:   డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయంగా మారిపోతున్న పరిణామాలపై జపాన్   స్పందిస్తోంది. కీలక రాష్ట్రాల్లో విజయంతో  వైట్ హౌస్ కు చేరువవుతున్న  ట్రంప్   టోర్నడో జపాన్ ప్రభుతాన్ని  ఆందోళనలో పడవేసింది.  ఈ మేరకు   జపాన్ ప్రభుత్వం,  ఆ దేశ సెంట్రల్ బ్యాంక్   బ్యాంక్ ఆఫ్ జపాన్  బుధవారం సాయంత్రం  అత్యవసరంగా  సమావేశం కానున్నాయి.  మార్కెట్లలో నెలకొన్న తీవ్ర   సంక్షోభాన్ని చర్చించేందుకు   మధ్యాహ్నం 3 గంటలకు (0600 GMT)  సమావేశం కానున్న బీఓజే ప్రతినిధి  చెప్పారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఫినాన్షియల్ సర్వీసెస్ ఏజెన్సీ  సమావేశం కానున్నట్టు తెలిపారు.
కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు   ఫలితాలు   డెమాక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ, రిపబ్లికన్ అభ్యర్థి  ట్రంప్ మధ్య నువ్వా  నేనా అన్నట్టుగా సాగుతున్నాయి.  దాదాపు ట్రంప్ గెలుపు ఖాయమనే అంచనాలతో  హిల్లరీ అభిమానులు తీవ్ర విచారంలో మునిగిపోయారు.   నరాలు తెగే ఈ ఉత్కంఠకు తెరపడాలంటే  తుదిఫలితాలు  రావాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement