న్యూఢిల్లీ: మన దేశ అధికారిక డిజిటల్ కరెన్సీ 2023 ఆరంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు నిర్వహించే ఎలక్ట్రానిక్ వాలెట్ మాదిరిగానే ఇది పనిచేస్తుందని వారు పేర్కొన్నారు. అయితే, దీనికి ప్రభుత్వ హామీ ఉండటం చేత సౌకర్యంగా ఉంటుందని ఒక ఉన్నత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారం తన బడ్జెట్ ప్రసంగంలో త్వరలో కేంద్ర బ్యాంకు మద్దతుగల 'డిజిటల్ రూపాయి'ని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆర్‌బీఐ జారీ చేయనున్న ఈ డిజిటల్ కరెన్సీని యూనిట్లలో లెక్కించవచ్చని, ప్రతి ఫియట్ కరెన్సీకి ప్రత్యేకమైన సంఖ్య ఉన్నట్లే ఈ డిజిటల్ కరెన్సీకి ప్రత్యేక నెంబర్ ఉండనున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీకి ఇది భిన్నంగా ఉండదు అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. డిజిటల్ కరెన్సీని ప్రస్తుతం ఉన్న సాదారణ కరెన్సీకి డిజిటల్ రూపంగా భావించవచ్చు తెలిపాయి. ఇది ప్రభుత్వ భరోసా గల ఒక ఎలక్ట్రానిక్ వాలెట్ అవుతుంది అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి డిజిటల్ రూపాయి సిద్ధంగా ఉంటుందని ఆర్‌బీఐ సూచించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. రిజర్వ్ బ్యాంక్ అభివృద్ధి చేస్తున్న డిజిటల్ రూపాయి బ్లాక్ చైన్, ప్రైవేట్ కంపెనీలు మొబైల్ వాలెట్ ప్రస్తుత వ్యవస్థ వలె కాకుండా అన్ని లావాదేవీలను గుర్తించగలదు.
(చదవండి: అదిరిపోయిన ఎంజీ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ కూడా అదుర్స్!)
Comments
Please login to add a commentAdd a comment