హిమాయత్‌నగర్: ఇన్‌స్ట్రాగామ్ వేదికగా పరిచయమైన ఇద్దరు వ్యక్తులు క్రిప్టో కరెన్సీ వైపు అడుగులు వేశారు. కొద్దిరోజులు సాన్నిహిత్యంగా మాట్లాడిన అనంతరం క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే కోటీశర్వురాలిని చేస్తానంటూ నగరానికి చెందిన ఓ టెకీకి చైనీయుడు వల వేశాడు. వలలో పడ్డ టెకీ పెద్ద మొత్తంలో మోసపోయి సిటీ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే..జూబ్లిహిల్స్‌కు చెందిన యువతి హైటెక్‌సిటీలోని ప్రముఖ ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేస్తోంది.
కొద్దిరోజుల క్రితం చైనాకు చెందిన హువాంగ్‌వినూ పేరుతో ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ప్రతిరోజూ ఇద్దరూ చాటింగ్ చేసుకుంటున్నారు. క్రమంలో క్రిప్టో కరెన్సీకు సంబంధించిన పోస్టులను, కోట్లు గెలుచుకున్నట్లుగా కొందరి ఫొటోలతో అభిప్రాయాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నాడు. ప్రతిపోస్ట్‌కు లైక్ కొడుతున్న టెకీ ఓ రోజు తాను కూడా చేయొచ్చా అంటూ సంప్రదించింది.
తక్కువ టైంలో తక్కువ సంపాదనతో కోటీశ్వరురాలిని చేస్తానంటూ భరోసా ఇచ్చాడు. అంతే కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే పలు దఫాలుగా రూ.91లక్ష పెట్టుబడి పెట్టింది. ఒక్క రూపాయి కూడా లాభం రాకపోగా ఉన్నవి ఇవ్వకుండా వేధిస్తున్న క్రమంలో తాను మోసపోయినట్లు గ్రహించి సైబర్‌క్రైం పీఎస్ మెట్లు ఎక్కింది. బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.
మరో కేసులో...
సుల్తాన్‌బజార్‌కు చెందిన ఓ యువకుడికి రీకా పేరుతో ఓ అమ్మాయి పరిచయమైయ్యింది. ఫోన్‌లో సైతం ఇద్దరూ సంభాíÙంచుకుంటున్నారు. తాను ఇన్వెస్టర్‌ని అంటూ మాటలు కలిపింది. రీకా మాటలకు బుట్టలో పడ్డ యువకుడు పలు దఫాలుగా రూ.42లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఒక్క రూపాయి లాభం ఇవ్వకపోవడంతో ఆలస్యంగా మోసపోయినట్లు తేరుకుని ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: ఒక్కసారి ప్రచారానికి రండి అన్నా)
Comments
Please login to add a commentAdd a comment