‘కింగ్‌ ఆఫ్‌ క్రిప్టో’ శామ్‌ బ్యాంక్‌ మన్‌ ఫ్రీడ్‌కు భారీ షాక్‌! | Bankman Fried get Bail Can Only Use Non Smartphone Without Internet | Sakshi
Sakshi News home page

‘కింగ్‌ ఆఫ్‌ క్రిప్టో’ శామ్‌ బ్యాంక్‌ మన్‌ ఫ్రీడ్‌కు భారీ షాక్‌!

Published Sun, Mar 5 2023 11:11 AM | Last Updated on Sun, Mar 5 2023 5:23 PM

Bankman Fried get Bail Can Only Use Non Smartphone Without Internet  - Sakshi

మదుపరులు ‘కింగ్‌ ఆఫ్‌ క్రిప్టో’గా అభివర్ణించే ఎఫ్‌టీఎక్స్‌ ఫౌండర్‌ శామ్‌ బ్యాంక్‌ మన్‌ ఫ్రీడ్‌కు అమెరికా కోర్టు షాకిచ్చింది. ఫ్రీడ్‌ అభ్యర్ధనని తిరస్కరిస్తూ ఆయనపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది.  

వరల్డ్‌ లార్జెస్ట్‌ క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజ్‌ ఎఫ్‌టీఎక్స్‌ దివాలా తీసిన ఘటనలో కోర్టు విచారణ ఎదుర్కొంటున్న ఆ సంస్థ ఫౌండర్‌ శామ్‌ బ్యాంక్‌మన్‌ ఫ్రీడ్‌ అభ్యర్ధనను కోర్టు కొట్టిపారేసింది.  ఫ్లిప్‌ ఫోన్‌ లేదంటే స్మార్ట్‌ ఫోన్‌ వినియోగించేందుకు ఫ్రీడ్‌కు అనుమతి ఇవ్వబోమని అమెరికా న్యూయార్క్‌ సిటీ మనహట్టన్ ఫెడరల్‌ కోర్టు స్పష్టం చేసింది. తమ ఆదేశాల్ని ఉల్లంఘిస్తే జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు కోర్టు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. 

ఎఫ్‌టీఎక్స్‌ పతనం తర్వాత ఫ్రీడ్‌పై పలు దేశాల్లో ఆర్థిక నేరాల కింద అభియోగాలు నమోదయ్యాయి. అ అభియోగాలతో అమెరికా పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు విచారణ కొనసాగుతుండగానే గత ఏడాది డిసెంబర్‌లో 250 మిలియన్‌ డాలర్ల బాండ్‌ పూచీకత్తుతో బెయిల్‌పై విడుదలయ్యారు.కోర్టు సైతం ఫ్రీడ్‌ను విడుదల చేస్తూ కఠిన ఆంక్షలు విధించింది.  

దివాలా కేసులో నిజానిజాలు తేలే వరకు న్యాయ స్థానం చెప్పినట్లుగా నడుచుకోవాల్సి ఉంటుంది. కానీ బెయిల్‌పై విడుదలైన అనంతరం కాల్ఫిపోర్నియాలో తన కుటుంబసభ్యులతో గడుపుతున్న ఎఫ్‌టీఎక్స్‌ ఫౌండర్‌ కోర్టు నిబంధనల్ని లైట్‌ తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో యూఎస్‌ ఎఫ్‌టీఎక్స్‌ జనరల్‌ కౌన్సిల్‌ రైన్ మిల్లర్‌కు ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజ్‌, ఫిబ్రవరి నెలలో థర్డ్‌ పార్టీ పీఎన్‌ను నెట్‌వర్క్‌ను రెండు సార్లు వినియోగించారు. 

తాజాగా కోర్టు విధించిన నిబంధనల్ని సడలించాలని ఫ్రీడ్‌ తన తరుపు లాయర్లతో  కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఫ్రీడ్‌ సాక్షుల్ని ప్రభావితం చేసేలా గతంలో పలు మార్లు ఇంటర్నెట్‌ను వినియోగించడం, ఎన్‌ క్రిప్టెడ్‌ మెసేజ్‌లను పంపించారని ప్రతివాదులు కోర్టులో వాదించారు. అందుకు తగ్గ ఆధారాల్ని బహిర్ఘతం చేశారు. అనంతరం  ఇరుపక్షాల వాదనల విన్న న్యాయవాది లూయిస్‌ ఏ.కప్లాన్‌  ఫ్రీడ్‌ అభ్యర్ధనల్ని తిరస్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement