FTX
-
Sam Bankman-Fried : క్రిప్టో కింగ్‌కి 40 నుంచి 50 ఏళ్ల జైలు శిక్ష?
సాక్షి, వాషింగ్టన్ : ప్రపంచంలోనే అపరకుబేరుడు, క్రిప్టో కింగ్, ఎఫ్‌టీఎక్స్ ఫౌండర్ శామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్ 40 నుంచి 50 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించనున్నారా? తప్పు చేశానని ఒప్పుకుంటూనే తానెవరిని మోసం చేయలేదన్న శామ్ బ్యాంక్మాన్ ఫ్రైడ్‌ను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం తరుపున వాదించే ప్రాసిక్యూటర్లు న్యాయస్థానాన్ని ఎందుకు కోరుతున్నారు. క్రిప్టో మొగల్ శామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్‌కు 40 నుంచి 50 ఏళ్ల మధ్య జైలు శిక్ష విధించాలనిప్రాసిక్యూటర్లు కోర్టును అభ్యర్థించారు. సుదీర్ఘంగా ఎందుకు జైలు శిక్ష విధించాలో చెబుతూ.. కస్టమర్లను 8 బిలియన్ల భారీ మోసానికి పాల్పడ్డారంటూ అందుకు తగ్గ ఆధారాల్ని కోర్టుకు అందజేశారు. గత ఏడాది నవంబర్‌లో ఎఫ్‌టీఎక్స్‌లో జరిగిన మోసాలపై అమెరికా న్యాయ స్థానం ఫ్రైడ్‌ను దోషిగా పరిగణలోకి తీసుకుంది. కుట్ర, మనీ ల్యాండరింగ్, మోసంతో పాటు మొత్తం ఏడు రకాల కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ఈ ఏడాది మార్చి 28 నుంచి శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ప్రైడ్కు అనారోగ్య సమస్యలు అయితే, ఫ్రైడ్ న్యాయవాదులు 98 పేజీల మెమోలో ప్రైడ్ ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని ఐదు నుండి ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించాలని కోరారు. మెమోలో తన క్లైయింట్ (ప్రైడ్) నాడీ సంబంధిత అనారోగ్య బాధపడుతున్నారని, వాటిని అధిగమించలేకపోతున్నారని పేర్కొన్నారు. జైలు శిక్ష అనుభవిస్తారా? దీనిపై ప్రభుత్వం తరుపు ప్రాసిక్యూటర్లు ప్రైడ్ కుటుంబం గురించి, వారి తల్లిదండ్రుల గురించి ఆరా తీశారు. నిందితుడి తల్లిదండ్రులిద్దరూ స్టాన్ఫోర్డ్ యూనివర్సీ ప్రొఫెసర్లు. ఫ్రైడ్ సైతం ఎంఐటి గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు.కానీ అత్యాశ, మదుపర్లు పెట్టిన పెట్టుబడులతో జూదం ఆడినట్లు గుర్తించారు. దీంతో ఈ కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది? మార్చి 28 నుంచి ఫ్రైడ్ జైలు శిక్షను అనుభవిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
‘కింగ్ ఆఫ్ క్రిప్టో’ శామ్ బ్యాంక్ మన్ ఫ్రీడ్‌కు భారీ షాక్!
మదుపరులు ‘కింగ్ ఆఫ్ క్రిప్టో’గా అభివర్ణించే ఎఫ్‌టీఎక్స్ ఫౌండర్ శామ్ బ్యాంక్ మన్ ఫ్రీడ్‌కు అమెరికా కోర్టు షాకిచ్చింది. ఫ్రీడ్ అభ్యర్ధనని తిరస్కరిస్తూ ఆయనపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. వరల్డ్ లార్జెస్ట్ క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ దివాలా తీసిన ఘటనలో కోర్టు విచారణ ఎదుర్కొంటున్న ఆ సంస్థ ఫౌండర్ శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ అభ్యర్ధనను కోర్టు కొట్టిపారేసింది. ఫ్లిప్ ఫోన్ లేదంటే స్మార్ట్ ఫోన్ వినియోగించేందుకు ఫ్రీడ్‌కు అనుమతి ఇవ్వబోమని అమెరికా న్యూయార్క్ సిటీ మనహట్టన్ ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. తమ ఆదేశాల్ని ఉల్లంఘిస్తే జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు కోర్టు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఎఫ్‌టీఎక్స్ పతనం తర్వాత ఫ్రీడ్పై పలు దేశాల్లో ఆర్థిక నేరాల కింద అభియోగాలు నమోదయ్యాయి. అ అభియోగాలతో అమెరికా పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు విచారణ కొనసాగుతుండగానే గత ఏడాది డిసెంబర్లో 250 మిలియన్ డాలర్ల బాండ్ పూచీకత్తుతో బెయిల్‌పై విడుదలయ్యారు.కోర్టు సైతం ఫ్రీడ్‌ను విడుదల చేస్తూ కఠిన ఆంక్షలు విధించింది. దివాలా కేసులో నిజానిజాలు తేలే వరకు న్యాయ స్థానం చెప్పినట్లుగా నడుచుకోవాల్సి ఉంటుంది. కానీ బెయిల్‌పై విడుదలైన అనంతరం కాల్ఫిపోర్నియాలో తన కుటుంబసభ్యులతో గడుపుతున్న ఎఫ్‌టీఎక్స్ ఫౌండర్ కోర్టు నిబంధనల్ని లైట్ తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో యూఎస్ ఎఫ్‌టీఎక్స్ జనరల్ కౌన్సిల్ రైన్ మిల్లర్‌కు ఎన్క్రిప్టెడ్ మెసేజ్, ఫిబ్రవరి నెలలో థర్డ్ పార్టీ పీఎన్‌ను నెట్‌వర్క్‌ను రెండు సార్లు వినియోగించారు. తాజాగా కోర్టు విధించిన నిబంధనల్ని సడలించాలని ఫ్రీడ్ తన తరుపు లాయర్లతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఫ్రీడ్ సాక్షుల్ని ప్రభావితం చేసేలా గతంలో పలు మార్లు ఇంటర్నెట్ను వినియోగించడం, ఎన్ క్రిప్టెడ్ మెసేజ్‌లను పంపించారని ప్రతివాదులు కోర్టులో వాదించారు. అందుకు తగ్గ ఆధారాల్ని బహిర్ఘతం చేశారు. అనంతరం ఇరుపక్షాల వాదనల విన్న న్యాయవాది లూయిస్ ఏ.కప్లాన్ ఫ్రీడ్ అభ్యర్ధనల్ని తిరస్కరించారు. -
94 శాతం సంపద ఆవిరి, బిలియనీర్‌కు మరో ఊహించని షాక్!
ప్రపంచంలో అతి పెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజ్గా పేరు సంపాదించిన ఎఫ్‌టీఎక్స్ సంస్థ ఫౌండర్ శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఫ్రైడ్ అనుమానాస్పద రీతలో నిధులను తరలించారనే ఆరోపణలతో బహమాస్‌లో అతన్ని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని బహామాస్ అటార్నీ జనరల్ కార్యాలయం వెల్లడించింది. దీని తర్వాత ఫ్రైడ్ని యునైటెడ్ స్టేట్స్కు అప్పగించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మాన్‌హట్టన్‌లోని యూఎస్ అటార్నీ కార్యాలయ ప్రతినిధి బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్‌ను అరెస్టు చేసినట్లు ధృవీకరించినా, అతనిపై ఉన్న ఆరోపణల గురించి తెలిపేందుకు మాత్రం నిరాకరించారు. బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ $10 బిలియన్ల FTX కస్టమర్ల నిధులను అల్మెడకు రహస్యంగా తరలించారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో కనీసం $1 బిలియన్ల కస్టమర్ల నిధులు అదృశ్యమైనట్లు సమాచారం. ఈ అంశంపై బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. కంపెనీ నిధులను ఎప్పుడూ రహస్యంగా బదిలీ చేయలేదని చెప్పారు. నవంబర్, డిసెంబరు చివరిలో జరిగిన ఇంటర్వ్యూలతో పాటు బహిరంగాను బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ తన రిస్క్ మేనేజ్మెంట్ వైఫల్యాలను అంగీకరించాడు. అయితే మోసం చేశాడనే ఆరోపణలను మాత్రం అంగీకరించలేదు. తన యాజమాన్య వ్యాపార సంస్థ అయిన అల్మెడ రీసెర్చ్‌లోని నిధులతో FTXలో కస్టమర్ ఫండ్స్‌ని ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ తరలించలేదని వివరణ ఇచ్చాడు. కాగా నవంబర్ 11న క్రిప్టో ఎక్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ దివాలా తీసిందనే వార్త క్రిప్టో పెట్టుబడిదారుల్ని ఆందోళనకు గురి చేసింది. దీంతో 72 గంటల్లో మదుపర్లు 6 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. ఆ సంస్థ సీఈవో శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ తన పదవికి రాజీనామా చేశారు. నవంబర్ 12న రాయిటర్స్ నివేదిక ప్రకారం..ఎఫ్‌టీక్స్ ఎక్ఛేంజీ నుంచి వందల మిలియన్ల డాలర్లు అనుమానాస్పద రీతిలో ట్రాన్స్ఫర్ అయ్యాయని పేర్కొంది. చదవండి ఐటీ ఉద్యోగులకు డేంజర్ బెల్స్! -
క్రిప్టో ఇన్వెస్టర్లకు ఆర్బీఐ రక్షణ
న్యూఢిల్లీ: ఆకాశమే హద్దుగా పెరిగిపోయిన వివాదాస్పద క్రిప్టో కరెన్సీలు అకస్మాత్తుగా మళ్లీ పాతాళానికి పతనమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ డాలర్ల ఇన్వెస్టర్ల పెట్టుబడులు హరించుకుపోతున్నాయి. 2021లో 3 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న క్రిప్టోల మార్కెట్ విలువ కేవలం ఏడాది వ్యవధిలోనే 1 ట్రిలియన్ డాలర్ కన్నా తక్కువకి పడిపోవడం ఈ కరెన్సీల్లో ఉన్న రిస్కులను ప్రపంచానికి మరోసారి తెలియజేసింది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద క్రిప్టో ఎక్సే్చంజీగా వ్యవహరించిన ఎఫ్‌టీఎక్స్ కుప్పకూలడంతో దాని సహ–వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్–ఫ్రైడ్ సంపద కేవలం రోజుల వ్యవధిలో ఏకంగా 16 బిలియన్ డాలర్లు హరించుకుపోయింది. భారీ సంపద ఇంత వేగంగా కరిగిపోయిన అతి తక్కువ సందర్భాల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో ఇన్వెస్టర్లను కుదిపేసింది. ప్రధాన స్రవంతిలోకి చేరి అందరి విశ్వసనీయతను పొందేందుకు నానా తంటాలు పడుతున్న క్రిప్టోలపై .. ఇప్పటిదాకా ఉన్న కాస్తో కూస్తో నమ్మకాన్ని కూడా సడలించేసింది. ఆర్బీఐ, ప్రభుత్వ అస్త్రాలతో క్రిప్టో లావాదేవీల కట్టడి.. అయితే, క్రిప్టో ప్రపంచంలో అల్లకల్లోలం రేగుతున్నప్పటికీ దేశీ ఇన్వెస్టర్లు మాత్రం ఈ ప్రభావాల నుండి కొంత సురక్షితంగానే ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రిప్టోలపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఆది నుండి కఠిన వైఖరులు పాటిస్తుండటమే మన ఇన్వెస్టర్లను కాస్త కాపాడుతోందని వారు తెలిపారు. క్రిప్టోలకు గుర్తింపునిచ్చేందుకు ఆర్బీఐ నిరాకరిస్తుండటం, ప్రభుత్వం పన్ను అస్త్రాన్ని ప్రయోగించడం .. వంటి అంశాలు దేశీయంగా డిమాండ్‌ను తగ్గించేందుకు, తద్వారా ఇన్వెస్టర్లను కొంత సురక్షితంగా ఉంచేందుకు దోహదపడినట్లు పేర్కొన్నారు. క్రిప్టోలకు చట్టబద్ధత కల్పించకపోయినప్పటికీ వాటి లావాదేవీలపై వచ్చే లాభాల మీద 30 శాతం పన్ను విధించింది ప్రభుత్వం. అంతేకాకుండా వర్చువల్ డిజిటల్ కరెన్సీలకు చెల్లింపులు రూ. 10,000 దాటితే 1 శాతం టీడీఎస్ కూడా విధించింది. ఇలాంటి చర్యలతో క్రిప్టోల జోలికి వెళ్లకుండా ఇన్వెస్టర్లను కాస్త కట్టడి చేసినట్లయిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘ఈ విషయంలో హీరోలు ఎవరు? ఇంకెవరు మన కేంద్ర ప్రభుత్వం, సెబీ, ఆర్బీఐ మొదలైనవే. భారతీయ బ్రోకింగ్ సంస్థలు కూడా క్రిప్టోల్లోకి ప్రవేశించి ఉంటే ఎంత మంది ఎంత డబ్బు పోగొట్టుకుని ఉండేవారో కదా. ప్రభుత్వం, ఆర్బీఐ ఇన్ని చర్యలు తీసుకుంటున్నా .. దాదాపు 3 శాతం మంది భారతీయులు క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేశారు. చివరిగా చెప్పేదేమిటంటే.. ఈ పతనం ఇంకా ముగియలేదు. మార్కెట్ పడిపోయింది కదా అని దయచేసి కొనుగోళ్లకు బైల్దేరవద్దు‘ అంటూ దేశీయంగా అతి పెద్ద ఆప్షన్స్ ప్లాట్‌ఫాం సెన్సిబుల్డాట్కామ్ సీఈవో ఆబిద్ హసన్ ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రిప్టోలకు గుర్తింపు ఇవ్వకూడదన్న ఆర్బీఐ, ప్రభుత్వ నిర్ణయాలు సరైనవేనని అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్సే్చంజెస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ఏఎన్ఎంఐ) ప్రెసిడెంట్ కమ్లేష్ షా అభిప్రాయపడ్డారు. -
నట్టేట ముంచిన ఉద్యోగి, రాత్రికి రాత్రే లక్షల కోట్లు ఆవిరి!
క్రిప్టో మార్కెట్లో అలజడి. వరల్డ్ లార్జెస్ట్ క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ దివాలా తీసింది. ఆ సంస్థ ఫౌండర్ శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ కొద్దిరోజుల క్రితం1600 కోట్ల డాలర్ల (రూ.1 లక్షా 36 వేల కోట్లు)తో ప్రపంచ ధనవంతుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు 1లక్షా 28వేల కోట్ల రూపాయలు నష్టపోయి బిలియనీర్ కాస్తా చిక్కుల్లో పడ్డాడు.అందుకు కారణం ఓ ఉద్యోగి. నవంబర్ 11న క్రిప్టో ఎక్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ దివాలా తీసిందనే వార్త క్రిప్టో పెట్టుబడిదారుల్ని ఆందోళనకు గురి చేసింది. దీంతో 72 గంటల్లో మదుపర్లు 6 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. ఆ సంస్థ సీఈవో శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ తన పదవికి రాజీనామా చేశారు. నవంబర్ 12న రాయిటర్స్ నివేదిక ప్రకారం..ఎఫ్‌టీక్స్ ఎక్ఛేంజీ నుంచి వందల మిలియన్ల డాలర్లు అనుమానాస్పద రీతిలో ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ ట్రాన్స్ఫర్ చేసింది ఎవరో కాదు ఆ సంస్థ ఉద్యోగి నిషాద్ సింగ్. నిషాద్ వల్ల శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ సంపద 1లక్షా 28వేల కోట్లు తగ్గింది నిషాద్ సింగ్ ఎవరు? ►ఎన్నారై నిషాద్ సింగ్ ప్రపంచంలోని అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలలో ఒకటైన ఎఫ్‌టిఎక్స్ దివాలా తీసేందుకు కారణమైన వారిలో ప్రథమ స్థానంలో ఉన్నారు. నిషాద్ సింగ్‌తో పాటు మరో 8 మంది రూమ్మెట్స్. వారిలో ఎఫ్‌టిఎక్స్ సీఈవో శామ్ బ్యాంక్మన్ ఒకరు. ►బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ నిషాద్ సింగ్ పట్టభద్రుడయ్యాడు. ►ఆ తర్వాత నిషాద్ సింగ్ ఫేస్బుక్లో మెషిన్ లెర్నింగ్ విభాగంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశాడు. డిసెంబర్ 2017లో ఎఫ్‌టీఎక్స్ కాంపిటీటర్ అలమేడ రీసెర్చ్‌లో చేరారు. ►అలమెడ రీసెర్చ్‌లో 17 నెలల పాటు ఇంజినీరింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఏప్రిల్ 2019లో క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్‌కి మారాడు. అప్పటి నుండి అదే టాప్ పొజీషన్లో కొనసాగుతున్నాడు. ►నిషాద్ సింగ్, శామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్, గ్యారీ (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గ్యారీ వాంగ్)లు క్రిప్టో ట్రేడర్లకు అనుగుణంగా క్రిప్టో మార్కెట్‌ను, ఫండ్స్‌ను కంట్రోల్ చేస్తారని కాయిన్‌డెస్క్ తెలిపింది. ►రాయిటర్స్ నివేదిక ప్రకారం..ఎఫ్‌టీఎక్స్ కాంపిటీటర్ అలమెడ రీసెర్చ్‌లో 10 బిలియన్ డాలర్ల కస్టమర్ నిధులను రహస్యంగా బదిలీ చేశారు. ఆ ఘటన తర్వాత శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫారెన్స్‌లో సంస్థలోని ఇద్దరు ఉద్యోగులు, నిషాద్ సింగ్ , గ్యారీ వాంగ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్యారీ వాంగ్ మాట్లాడుతూ ఎఫ్‌టీఎక్స్ నుంచి.. అలమెడ రీసెర్చ్‌కు సెండ్ చేసిన నిధుల గురించి తనకు తెలుసని నివేదించారు. కాగా, ప్రస్తుతం అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతోంది. చదవండి👉 షాకింగ్,ఎలాన్ మస్క్ భారీ షాక్.. మరోసారి వేల మంది ట్విటర్ ఉద్యోగుల తొలగింపు