క్రిప్టో మార్కెట్‌లో అలజడి. వరల్డ్ లార్జెస్ట్ క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ దివాలా తీసింది. ఆ సంస్థ ఫౌండర్ శామ్ బ్యాంక్‌మన్ ఫ్రైడ్ కొద్దిరోజుల క్రితం1600 కోట్ల డాలర్ల (రూ.1 లక్షా 36 వేల కోట్లు)తో ప్రపంచ ధనవంతుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు 1లక్షా 28వేల కోట్ల రూపాయలు నష్టపోయి బిలియనీర్ కాస్తా చిక్కుల్లో పడ్డాడు.అందుకు కారణం ఓ ఉద్యోగి.
నవంబర్ 11న క్రిప్టో ఎక్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ దివాలా తీసిందనే వార్త క్రిప్టో పెట్టుబడిదారుల్ని ఆందోళనకు గురి చేసింది. దీంతో 72 గంటల్లో మదుపర్లు 6 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. ఆ సంస్థ సీఈవో శామ్ బ్యాంక్‌మన్ ఫ్రైడ్ తన పదవికి రాజీనామా చేశారు.
నవంబర్ 12న రాయిటర్స్ నివేదిక ప్రకారం..ఎఫ్‌టీక్స్ ఎక్ఛేంజీ నుంచి వందల మిలియన్ల డాలర్లు అనుమానాస్పద రీతిలో ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. ఆ ట్రాన్స్‌ఫర్ చేసింది ఎవరో కాదు ఆ సంస్థ ఉద్యోగి నిషాద్ సింగ్. నిషాద్ వల్ల శామ్ బ్యాంక్‌మన్ ఫ్రైడ్ సంపద 1లక్షా 28వేల కోట్లు తగ్గింది
నిషాద్ సింగ్ ఎవరు?
►ఎన్నారై నిషాద్ సింగ్ ప్రపంచంలోని అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలలో ఒకటైన ఎఫ్‌టిఎక్స్ దివాలా తీసేందుకు కారణమైన వారిలో ప్రథమ స్థానంలో ఉన్నారు. నిషాద్ సింగ్‌తో పాటు మరో 8 మంది రూమ్‌మెట్స్. వారిలో ఎఫ్‌టిఎక్స్ సీఈవో శామ్ బ్యాంక్‌మన్ ఒకరు.
►బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ నిషాద్ సింగ్ పట్టభద్రుడయ్యాడు.
►ఆ తర్వాత నిషాద్ సింగ్ ఫేస్‌బుక్‌లో మెషిన్ లెర్నింగ్ విభాగంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశాడు. డిసెంబర్ 2017లో ఎఫ్‌టీఎక్స్ కాంపిటీటర్ అలమేడ రీసెర్చ్‌లో చేరారు.
►అలమెడ రీసెర్చ్‌లో 17 నెలల పాటు ఇంజినీరింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఏప్రిల్ 2019లో క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్‌కి మారాడు. అప్పటి నుండి అదే టాప్ పొజీషన్‌లో కొనసాగుతున్నాడు.
►నిషాద్ సింగ్, శామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్, గ్యారీ (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గ్యారీ వాంగ్)లు క్రిప్టో ట్రేడర్లకు అనుగుణంగా క్రిప్టో మార్కెట్‌ను, ఫండ్స్‌ను కంట్రోల్ చేస్తారని కాయిన్‌డెస్క్ తెలిపింది.
►రాయిటర్స్ నివేదిక ప్రకారం..ఎఫ్‌టీఎక్స్ కాంపిటీటర్ అలమెడ రీసెర్చ్‌లో 10 బిలియన్ డాలర్ల కస్టమర్ నిధులను రహస్యంగా బదిలీ చేశారు. ఆ ఘటన తర్వాత
శామ్ బ్యాంక్‌మన్ ఫ్రైడ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫారెన్స్‌లో సంస్థలోని ఇద్దరు ఉద్యోగులు, నిషాద్ సింగ్ , గ్యారీ వాంగ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్యారీ వాంగ్ మాట్లాడుతూ ఎఫ్‌టీఎక్స్ నుంచి.. అలమెడ రీసెర్చ్‌కు సెండ్ చేసిన నిధుల గురించి తనకు తెలుసని నివేదించారు. కాగా, ప్రస్తుతం అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ కమిషన్ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతోంది.
చదవండి👉 షాకింగ్,ఎలాన్ మస్క్ భారీ షాక్.. మరోసారి వేల మంది ట్విటర్ ఉద్యోగుల తొలగింపు
Comments
Please login to add a commentAdd a comment