బ్లాక్ చెయిన్ ఆధారంగా పనిచేసే క్రిప్టో కరెన్సీల గురించి చాలా తక్కువమందికి తెలిసి ఉంటుంది. ప్రభుత్వం, బ్యాంకుల జోక్యం లేకుండా జరుగుతాయి. దీని విలువ.. డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతుంటుంది. క్రిప్టో కరెన్సీల ద్వారా కుబేరులు కూడా ఒక్కోసారి భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇందులో దివాళా దీసిన బిలియనీర్‌లలో ఒకరు FTX ఫౌండర్, సీఈఓ, అమెరికా యువ వ్యాపారవేత్త, ఇన్వెస్టర్ 'శామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్'.
ఎఫ్‌టీఎక్స్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ కస్టమర్ల నుంచి 8 బిలియన్ డాలర్లను మోసం చేసినందుకు శామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్‌కు మార్చి 29న (గురువారం) 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. FTX కస్టమర్‌లు డబ్బును పోగొట్టుకోలేదని బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ చేసిన వాదనను తిరస్కరించిన తర్వాత ఈ శిక్షను విధించారు.
అమెరికా చరిత్రలోనే ఆర్థిక మోసాలలో ఒకటిగా FTX అని, బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ 2022 నుంచి మోసాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. అది తప్పు అని తెలిసినప్పటికీ.. మోసాలకు పాల్పడ్డాడని న్యాయవాది పేర్కొన్నారు. ఎఫ్‌టీఎక్స్ కస్టమర్లు బాధపడ్డారని 20 నిమిషాల విచారణ తరువాత బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ తరువాత సహోద్యోగులకు క్షమాపణలు చెప్పాడు.
FTX కస్టమర్‌లు 8 బిలియన్ డాలర్లు, ఈక్విటీ పెట్టుబడిదారులు 1.7 బిలియన్ డాలర్లను కోల్పోయారని తెలుస్తోంది. వీరు మాత్రమే కాకుండా బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ రుణదాతలు కూడా 1.3 బిలియన్ డాలర్లను కోల్పోయారు. దీంతో ఇతనికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.
ఎవరీ శామ్ బ్యాంక్‌మన్-ఫ్రైడ్
అమెరికాకు చెందిన శామ్ బ్యాంక్‌మన్-ఫ్రైడ్ పూర్తి పేరు 'శామ్యూల్ బెంజమిన్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్'. ఈయన 2014లో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్ (డిగ్రీ) పూర్తి చేశారు. ఆ తర్వాత క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ క్యాపిటల్‌లో మూడేళ్ల పాటు ట్రేడర్‌గా పనిచేశారు.
2017లో అలమెడా రీసెర్చ్ పేరుతో సొంత ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. 2019లో ఎఫ్‌టీఎక్స్‌ను ఏర్పాటు చేశారు. అతి తక్కువ కాలంలోనే ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీగా అవతరించింది. 2022 ప్రారంభంలో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఎక్స్ఛేంజీ విలువ 40 బిలియన్ డాలర్లు.
Comments
Please login to add a commentAdd a comment