న్యూఢిల్లీ: వర్చువల్ డిజిటల్ అసెట్స్‌పై టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) వివరాల వెల్లడికి సంబంధించి ఆదాయ పన్ను శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం డిడక్షన్ చేసిన నెల ముగిశాక, 30 రోజుల్లోగా టీడీఎస్‌ను జమ చేయాల్సి ఉంటుంది.
ఇందుకోసం చలానా–కమ్–స్టేట్‌మెంట్ ఫారం 26క్యూఈని ఉపయోగించాలి. వర్చువల్ డిజిటల్ అసెట్స్ (వీడీఏ) బదలాయింపు తేదీ, విలువ, చెల్లింపు విధానం మొదలైన వివరాలన్నీ దగ్గర ఉంచుకోవాలి.
జూలై 1 నుంచి వీడీఏలు లేదా క్రిప్టోకరెన్సీలపై 1 శాతం టీడీఎస్ విధించనున్న నేపథ్యంలో తాజా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా నిబంధనలు వీడీఏ లావాదేవీల గురించి తెలుసుకునేందుకు ట్యాక్స్ విభాగానికి ఉపయోగపడతాయని, కానీ పన్ను చెల్లింపుదారులపై మాత్రం నిబంధనల భారం పెరిగిపోతుందని ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్‌నర్ అమిత్ మహేశ్వరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment