CBDT Authorities
-
మారనున్న ట్యాక్స్ రూల్స్, క్రిప్టో కరెన్సీలపై!
న్యూఢిల్లీ: వర్చువల్ డిజిటల్ అసెట్స్‌పై టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) వివరాల వెల్లడికి సంబంధించి ఆదాయ పన్ను శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం డిడక్షన్ చేసిన నెల ముగిశాక, 30 రోజుల్లోగా టీడీఎస్‌ను జమ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం చలానా–కమ్–స్టేట్మెంట్ ఫారం 26క్యూఈని ఉపయోగించాలి. వర్చువల్ డిజిటల్ అసెట్స్ (వీడీఏ) బదలాయింపు తేదీ, విలువ, చెల్లింపు విధానం మొదలైన వివరాలన్నీ దగ్గర ఉంచుకోవాలి. జూలై 1 నుంచి వీడీఏలు లేదా క్రిప్టోకరెన్సీలపై 1 శాతం టీడీఎస్ విధించనున్న నేపథ్యంలో తాజా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా నిబంధనలు వీడీఏ లావాదేవీల గురించి తెలుసుకునేందుకు ట్యాక్స్ విభాగానికి ఉపయోగపడతాయని, కానీ పన్ను చెల్లింపుదారులపై మాత్రం నిబంధనల భారం పెరిగిపోతుందని ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్నర్ అమిత్ మహేశ్వరి తెలిపారు. -
ఆగస్టు 31 తర్వాత ఆ పాన్‌కార్డులు చెల్లవు..
న్యూఢిల్లీ: వచ్చే నెల 31లోగా మీ పాన్‌కార్డుతో వ్యక్తిగత ఆధార్ నంబర్‌ను లింక్ చేసుకోకపోతే.. మీ పాన్‌కార్డు రద్దు కానుంది. పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకునేందుకు ఇంకా 40 రోజుల గడువు ఉంది. ఈ లోపు వాటిని లింక్ చేసుకోకపోతే.. దాదాపు 20 కోట్ల పాన్‌కార్డులు రద్దు కానున్నాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీటీ) అధికారి తాజాగా వెల్లడించారు. దేశం మొత్తంలో 43 కోట్ల మంది పాన్ కార్డ్‌ని కలిగి ఉన్నారని, 120 కోట్ల మందికి ఆధార్ కార్డు ఉందని ఆ అధికారి తెలిపారు. ఇప్పటివరకు పాన్ కార్డుల్లో 50శాతం మాత్రమే ఆధార్‌తో లింక్ అయ్యాయని తెలిపారు. ఇక, ఆధార్ కార్డు లేని 40 రోజుల్లో దీనిని తీసుకొని.. పాన్‌తో అనుసంధానించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రుణాలు, క్రెడిట్ కార్డులు పొందటానికి చట్టవిరుద్ధంగా పాన్‌కార్డ్‌లను ఉపయోగించినట్లు వెల్లడి కావడంతో ఆధార్‌కు అనుసంధానం చేయని పాన్ కార్డులను రద్దు చేయాలని ఆదాయ పన్నుశాఖ నిర్ణయించింది. నేపాల్, భూటాన్లలో సైతం భారత పాన్‌కార్డ్‌లను గుర్తింపు కార్డుగా కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. ఆగస్టు 31లోపు ఆధార్‌తో అనుసంధానం చేసుకోకపోతే.. సెప్టెంబర్ 1 నుంచి పాన్ కార్డ్ చెల్లదు. ఇదిలావుండగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం తన బడ్జెట్ ప్రసంగంలో పాన్ కార్డు లేకపోయినా.. దాని స్థానంలో ఆధార్ కార్డును ఉపయోగించి పన్నుచెల్లించవచ్చునని తెలిపారు. -
పెండింగ్ ‘మ్యాట్’ కేసులపై కేంద్రం వెనక్కు!
న్యూఢిల్లీ: కనీస ప్రత్యామ్నాయ పన్నులు (మ్యాట్) కట్టాలని నోటీసులందుకున్న ఎఫ్ఐఐల కేసుల జోలికి ప్రస్తుతానికి వెళ్లొద్దని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీ టీ) తమ క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించింది. ఏప్రిల్ 1కి పూర్వం కేసుల విషయంలో రికవరీలు ఆపేయాలని ఒక సర్క్యులర్‌లో సూచించింది. మ్యాట్ నిబంధనలపై ఆదాయ పన్ను చట్టాలకు తగు సవరణలు చేయనున్నట్లు సీబీడీటీ పేర్కొంది. ఏపీ షా కమిటీ సిఫార్సుల మేరకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లపై (ఎఫ్ఐఐ) మ్యాట్ విధించొద్దంటూ కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో సీబీడీటీ ఈ ఆదేశాలు జారీ చేసింది.