
ప్రముఖ యుఎస్ ఆధారిత క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ కంపెనీ క్రాకెన్ ఉక్రెయిన్ పౌరులకు $10 మిలియన్లకు పైగా(సుమారు రూ.76 కోట్లు) ఆర్ధిక సహాయం చేయనున్నట్లు ప్రకటించింది. 2022 మొదటి అర్ధభాగంలో రష్యా ఖాతాదారుల నుంచి సేకరించిన మొత్తం ట్రేడింగ్ ఫీజులకు సమానమైన మొత్తాన్ని ఈ ఎక్స్ఛేంజ్ కంపెనీ ఉక్రెయిన్ పౌరులకు విరాళంగా ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ సహాయం వెంటనే అందించేందుకు మార్చి 9కి ముందు తమ క్రిప్టో ఎక్స్ఛేంజ్'లో ఖాతా తెరిచిన ఉక్రెయిన్ వినియోగదారులకు $1,000(సుమారు రూ.76,300) డాలర్లకు సరిసమానమైన బిట్ కాయిన్స్ అందించనున్నట్లు తెలిపింది.
అది, అలా ఉంటే.. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. పుతిన్ సైనిక దళాలు సాధారణ పౌరుల పైనా కాల్పులు జరుపుతున్నారు. మానవతా కారిడార్‌కు సహకరించినట్లు చెప్పుకుంటున్న రష్యా.. ఆ మార్గం గుండా వెళ్లిన ప్రజలపై దాడులు చేసిందని ఉక్రెయిన్ నుంచి బయటపడిన శరణార్థులు చెబుతున్నారు. పోల్లోని ప్రసూతి ఆస్పత్రిపైనా రష్యా దాడులు చేసింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. అనేక మంది గర్భిణులు, చిన్నారులు శిథిలాల కింద చిక్కుకున్నారు. మరో నగరంలో రెండు ఆస్పత్రులపైనా బాంబు దాడులు జరిగాయి.
Kraken will distribute over $10 million worth of to aid clients in 🇺🇦Ukraine. Tranche 1 recipients will be credited $1000 of #BTC, withdrawable tomorrow. The package is funded by historical Ukraine revenues and H1 2022 revenues from Russia-based trading.https://t.co/DdkY2TsVoB
— Kraken Exchange (@krakenfx) March 9, 2022
(చదవండి: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.50 వేల యాపిల్ ఐఫోన్ రూ.10 వేలకే..!)
Comments
Please login to add a commentAdd a comment