బిలియనీర్ ముఖేష్ అంబానీ నేడు డేటా గోప్యత, క్రిప్టోకరెన్సీ బిల్లులకు మద్దతు ఇచ్చారు. భారతదేశం అత్యంత ముందుచూపు విధానాలను అనుసరిస్తూ.. కొత్త కొత్త నిబంధనలను అమలులోకి తెస్తోందని ఆయన అన్నారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(ఐఎఫ్ఎస్‌సీఏ) నిర్వహించిన ఇన్ఫినిటీ ఫోరంలో ఈ విషయంపై ఆయన తన అభిప్రాయలు వ్యక్తం చేశారు. దేశంలో డిజిటల్ సమాచారాన్ని ఎలా నిల్వ చేయాలి, ఎలా పంచుకోవాలో గురుంచి కఠినమైన నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉంది అని అయన అభిప్రాయపడ్డారు.
వ్యూహాత్మక డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, రక్షించడానికి దేశాలకు హక్కు ఉందని అన్నారు. డేటా ఒక 'కొత్త చమురు' అని పేర్కొంటూ.. ప్రతి పౌరుడి గోప్యత హక్కును కాపాడాలని ఆయన అన్నారు. "భారతదేశం అత్యంత ముందుచూపుతో విధానాలు, నిబంధనలను అమలు చేస్తోంది. ఆధార్,డిజిటల్ బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ చెల్లింపుల ద్వారా దేశం ఇప్పటికే గొప్ప డిజిటల్ ఫ్రేమ్ వర్క్ కలిగి ఉందని ఆయన అన్నారు. మేము డేటా గోప్యతా బిల్లు, క్రిప్టోకరెన్సీ బిల్లును ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాము. మేము సరైన మార్గంలో ప్రయాణిస్తున్నాము నేను అనుకుంటున్నాను" అని ఫోరంలో పేర్కొన్నారు.
చిన్న పెట్టుబడిదారులను కాపాడుతూ క్రిప్టోకరెన్సీలను ఆర్థిక ఆస్తిగా పరిగణించడానికి ప్రభుత్వం పార్లమెంటులో కొత్త బిల్లును తీసుకురావాలని చూస్తున్నందున ఫోరంలో ముఖేష్ అంబానీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. డిజిటల్ కరెన్సీలలో పెట్టుబడులకు కనీస మొత్తాన్ని చట్టం నిర్దేశించవచ్చు, అదే సమయంలో చట్టపరమైన టెండర్‌గా వాటి ఉపయోగాన్ని నిషేధించవచ్చు అని అన్నారు. నవంబర్ 29న ప్రారంభమైన పార్లమెంటు ప్రస్తుత శీతాకాల సమావేశాల కోసం శాసన ఎజెండా "క్రిప్టోకరెన్సీ అంతర్లీన సాంకేతికత, దాని ఉపయోగాలను ప్రోత్సహించడానికి కొన్ని మినహాయింపులు" మినహా అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించే బిల్లును తీసుకురానున్నట్టు పేర్కొంది. క్రిప్టోకరెన్సీ నుంచి వచ్చే లాభాలపై పన్ను విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీలపై పూర్తి నిషేధాన్ని కోరుతోంది. ఎందుకంటే, ఇది దేశం స్థూల ఆర్థిక, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుందని ఆర్బీఐ భావిస్తుంది.
(చదవండి: నవంబర్‌లో ఎక్కువగా అమ్ముడైన టాప్-10 కార్లు ఇవే!)
డేటా, డిజిటల్ మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యం
"డేటా, డిజిటల్ మౌలిక సదుపాయాలు భారతదేశంతో సహ ప్రపంచంలోని ప్రతి ఇతర దేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి. ఈ వ్యూహాత్మక డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, రక్షించడానికి ప్రతి దేశానికి హక్కు ఉంది" అని ఆయన అన్నారు. సరిహద్దు లావాదేవీలు, సహకారాలు & భాగస్వామ్యాలకు ఆటంకం కలిగించకుండా ఏకరీతి ప్రపంచ ప్రమాణం అవసరమని ఆయన అన్నారు. ప్రతి పౌరుడి గోప్యతహక్కును కాపాడాలని పేర్కొంటూ, సరైన విధానాలు, సరైన నియంత్రణ గల ఫ్రేమ్ వర్క్ రూపొందించి డేటా & డిజిటల్ మౌలిక సదుపాయాలను కాపాడాల్సిన అవసరం ఉంది ముఖేష్ అంబానీ అన్నారు.
బ్లాక్ చైన్ టెక్నాలజీని నమ్ముతున్నాను
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అంబానీ ఇంకా మాట్లాడుతూ.. "నేను బ్లాక్ చైన్ టెక్నాలజీని నమ్ముతున్నాను, ఇది క్రిప్టోకరెన్సీకి భిన్నంగా ఉంటుంది" అని అన్నారు. "బ్లాక్ చైన్ ఆధారిత టెక్నాలజీ సమాజానికి చాలా ముఖ్యమైనది" అని తెలిపారు. క్రిప్టోకరెన్సీని నియంత్రించే బిల్లు పనిలో కేంద్రం ఉండగా, కరెన్సీ లేకుండా కూడా క్రిప్టోకరెన్సీలకు ఆధారమైన బ్లాక్ చైన్ టెక్నాలజీ తనంతట తానుగా ఉనికిలో ఉండవచ్చని భావించే వారిలో ఆర్ బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఉన్నారు. “బ్లాక్‌చెయిన్‌ని ఉపయోగించి, మేము అపూర్వమైన భద్రత, నమ్మకం, ఆటోమేషన్ సామర్థ్యాన్ని దాదాపు ఏ రకమైన లావాదేవీలకైనా అందించగలము” అని అంబానీ చెప్పారు.
(చదవండి: టిమ్ కుక్‌కు కొత్త తలనొప్పులు, చివాట్లు పెడుతున్న ఐఫోన్ యూజర్లు!)
Comments
Please login to add a commentAdd a comment